గుండె బరువెక్కుతుంది
విరబూసిన బంధాలు
చుట్టూ అలుముకున్న ప్రేమలు
మంచులా కరిగిపోతున్నపుడు
వెలుగే చీకటిలా తోస్తుంది
కారుమబ్బులతో మేఘాలు
వర్షాలు కురిపించిన
కన్నీళ్ళు అందులో కలిసిపోయి
వరదలా పారుతున్నాయి
ఎవరికీ తెలియని విధిరాత
అట్టడుగన పడేసింది బ్రతుకులను
ఉన్నంతవరకే యోగక్షేమాలు
చివరిచూపులు
మంచిచెడుల పలకరింపులు
ఊపిరాగిపోయాక
ఆ దారే ఆగిపోయి ఒంటరిదైతుంది
పదిమంది తిరిగే త్రోవలో
నడకలేదిపుడు
అనాధగా మారిన ఆ చోట
ఆపద్భాందువుల మాట నేడు కల్ల
నివ్వెరపోయిన నీడ
నిజాలు చవిచూస్తుంటే
భావాల ఉబికి
ఊబినుంచి
బయటపడి
మరో చైతన్య ఉప్పెనవై
ప్రసరిస్తున్నపుడు మళ్ళీ అందరూ నీ వెంట