నడిమంత్రపుసిరి ………

“ఎప్పుడూ ఏదో జోకులు వేస్తూ, నవ్వుతూ నవ్విస్తూ ,తన పని తాను చేసుకునే పార్వతి,
ముఖం వేలాడేసుకుని పుట్టెడు దుఃఖంతో మాయింటికి వచ్చింది..
కదిలిస్తే కన్నీటి ప్రవాహం అయ్యేలా ఉంది.
ఎలా ప్రారంభించాలో తెలియక …, ఎందుకంత బాధ పడతావు?
“నిజం నిలకడ మీద తెలుస్తుందిలే.
మీరు ఎలాంటి వారో మాకు తెలియదా?
ఎవరో ఒకరు అన్నంత మాత్రాన ,
అబద్ధం నిజం అయిపోతుందా?
కాస్త కాఫీ కలిపి ఇస్తాను .ఇలా కూర్చొని కాఫీ తాగేసి వెళ్ళిపో .ఈరోజు పని నేను చేసుకుంటాను అన్నాను..
కుర్చీలో కూర్చుని క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేసుకుంటున్న నేను,
నా కాళ్ళ మీద చేతులు వేసి ప్రమాణం చేస్తూ, బోరుమని ఏడుస్తున్న పార్వతిని చూసి, కంగారుగా,
కాళ్లు వెనక్కి లాక్కుని ,పార్వతి తల మీద చెయ్యి వేసి నిమురుతూ ,
పిచ్చిదానా! నాకు తెలుసు . కానీ ఏం చేసేది చెప్పు? మీపై నిందపడింది కాబట్టి, ధైర్యం చేసి
ఆ సబ్ ఇన్స్పెక్టర్ గారితో కూడా మాట్లాడాను.
“ఇంతలా మీపై నిందలేసిన ఆవిడతో కూడా మాట్లాడాను .
మీరు తొందర పడుతున్నారు.ఇది సరికాదు.
ముందు ఇంట్లో బాగా వెతుక్కుని,
మీఇంట్లో వాళ్ళని కూడా వెతకమని చెప్పి, దొరక్కపోతే, ఫిర్యాదు చేయవలసింది అన్నాను. .
మీరు .పనివాళ్ళు తీశారనిఎలా చెప్పగలరు? మీరు కంప్లైంట్ చేయడం వల్ల ,
వాళ్ల మనోభావాలు కూడా దెబ్బతింటాయి. వాళ్ళు ఇబ్బందిలో పడతారు.
వాళ్ళు తీయకపోతే, ఆ పాపంమీదే కదండీ !అన్నాను .
అయినా! ఇన్నాళ్లు బట్టి మన అపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు.వాళ్ళ మీద చిన్న కంప్లైంట్ కూడా లేదు .
మీరు కొత్తగా వచ్చారు కాబట్టి మీకుతెలియదు. మరొక్కసారి మీ ఇంట్లో వెతకండి.మీ వాళ్ళతో సంప్రదించండి అని చెప్పాను
మీరు పెట్టిన కేసునుగూర్చి వెనక్కి తీసుకోడానికి ఆలోచించండని చెప్పాను”.
*ఆమె నాపై తాడెత్తు లేచింది,

మీరు పనిమనిషిని వెనకేసుకొచ్చి, పరువు పరపతి ఉన్న మాలాంటి వాళ్ళను అవమానిస్తారా?
మేము అబద్ధం ఆడే వాళ్ళమా?
నేను పెద్ద సంపన్న కుటుంబం నుంచి వచ్చాను..
మా ఇంటవంటా ఎవరికీ అలాంటి బుద్దులు లేవు.. ఆ ముసలిది ఇల్లు ఊడ్చివెళ్లిన తర్వాత ఆ వస్తువు కనిపించలేదని విరుచుకు పడింది ..
ఆమెను చూసి , ఏమీ మాట్లాడలేక వచ్చేసాను* .
ఎలాగైనా పోలీసులు ఎంక్వయిరీ చేస్తారని నిజానిజాలు తెలుస్తాయని చెప్పివచ్చేసాను..

నీకు తెలుసు కదా!.. నేను ఎవరి గొడవల్లో దూరను. ఎవరి పక్షాన మాట్లాడను. .
ఎంతో అవసరమైతే తప్ప ఈ ప్లాట్ లో ఎవరితో మాట్లాడను..
అయినా!మీగురించి మాట్లాడాను.బాధపడకు. పోలీసులు వాళ్ల ధర్మం వాళ్లు నెరవేర్చాలి కదా!
అందులో భాగంగానే నిన్ను ప్రశ్నించారు;
మీ అమ్మను తీసుకెళ్లారు.మావారు,రానీ!..
అయినా,సార్. ఆఫీస్ కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాను .
ఆయన స్నేహితుడు కమిషనర్ గారి బావమరిదట. .నువ్వేమీ భయపడకు. మీఅమ్మ సాయంత్రానికల్లా ఇంటికి వచ్చేస్తుంది . అప్పుడే కమీషనర్ గారికి ఫోన్ చేశారుట.వాళ్లు నిజాన్ని నిగ్గు తేలుస్తాం అన్నారట కూడా. .
నువ్వు బెంగపడకు పార్వతీ అన్నాను ధైర్యం చెప్తూ..
మాకు మీరే దిక్కమ్మా!అంటూ పార్వతి అంది.
మీకు తెలుసు కదమ్మా?మేము ఎలాంటి వాళ్ళమో? పిల్లల చదువుల కోసం ఈ హైదరాబాద్ వచ్చాము.
ఖాళీగా కూర్చోలేక కష్టపడుతున్నాం .
అయినా మాకు దొంగతనం చేయవలసిన కర్మం ఏంటమ్మా? మా ఆస్తులే మాకు నిలబడలేదు. *పచ్చని పంట పొలాలు ఫ్యాక్టరీలకు అమ్మేసిన పాపం ఇది.,
మా నాన్న ,మా మామ లాంటివాళ్ళు, మాకు ఈ పరిస్థితి కల్పించారు*
“మా అమ్మ పూచిన తంగేడులా ఉండేదమ్మా” .
మా అత్తవారు సంపన్నులే.
మా మామకోడి పందాలు ఆడి ఆస్తిఅంతా అణగపెడితే ,
మా ఆయన సరిగా చదువుకోక …..
చిన్నప్పుడే. వ్యసనాలను అలవాటు చేసుకుని, ఆస్తంతా పోగొట్టుకుని ఇక్కడికి వచ్చేసాడు, .”చాపంతా పోయినా చదరంత మిగిలిన ఆ భూమిలో” పంట పండించుకు బ్రతుకున్నామమ్మా.. ఆభూమిని మామామ నాకొడుకుకి 25 ఏళ్లువచ్చేక వాడీకి చెందుతుందని .లింక్ పెట్టాడు. గాబట్టి ,
అది మిగిలింది. మేము ఈపట్టణం రామని అన్నాం. మా ఆయన పిల్లల్ని చక్కగా చదివించవచ్చు. పిల్లల భవిష్యత్తు కోసం అని ఆశపెడితే వచ్చామమ్మా…..
తల్లిలాంటి పల్లె వదిలి, వాచ్మెన్ గా కాపలాకు వచ్చాము. ఇప్పటివరకూ ఒక్కరిచేత మాటపడలేదు.
మా ఆయనని తాగితే. వీధిలోనికి కూడా వెళ్ళనీయను .మీకు తెలుసు కదమ్మా!. …..అయినా !మా కష్టాన్ని నమ్ముకుని బతుకుతున్నాము. ఒక్కరి నుండి ఒక రూపాయి ఆశించలేదు.
మీరు, అయ్యగారు మాత్రం మంచిగా ఆలోచిస్తారు. నడిమంత్రపు సిరి నిలవనీయక ఆమె అన్ని మాటలంటోంది, కానీ!,బహుగా బతికాం…
మేము ఆమెలో మాట్లాడలేము కదమ్మా…
అయినా!పచ్చని పంట పొలాలు అమ్ముకున్న ఫలితం అమ్మా ఇది.
ఆ పాపన్నే,మేమనుభవిస్తున్నామమ్మా…
పదిమందికి అన్నం పెట్టే స్థితిలో ఉండేవాళ్ళం,
ఈ రోజు పది ఇళ్లల్లో పాత్రలు తోముకొని పొట్ట పోసుకుంటున్నాం.
ఆ భూమాత శాపం .మా పాపం కాకపోతే!
ఈ నిందలేంటమ్మా? కర్మం కాకపోతే ఇంకా ఏంటమ్మా?….
.”పువ్వులమ్మిన దగ్గర కట్టెలు అమ్ముకోలేక “
మా అమ్మ ఇక్కడికి వచ్చి, ఈ పనులు చేస్తోంది .మా ఇంట్లోనే నా చిన్నప్పుడు పొద్దున్న నుండి రాత్రి వరకు మనుషులు ఉండి మా పనులు చేసేవారు.. మా ఇంట్లో వంటకు మనిషి ఉండేది.
“డబ్బుకు ఆశపడి ఆ పొలాలు అమ్ముకున్న పాపం ఇప్పుడు మేము అనుభవిస్తున్నాం.
*ఇప్పుడు మా అమ్మ పోలీస్ స్టేషన్కు వెళ్లిందంటే చుట్టాలు ,బంధువులలో మా పరువు ఏం కావాలి?
ముందు వెనక ఆలోచించకుండా ఆవిడ నిందలు వేసింది .కానీ!, ఎన్నడూ పోలీస్ స్టేషన్ మొహం కూడా చూడని మా అమ్మ , ఆకారణంగా నిందపడింది..
మా ఇంట్లో ఉండడం వలన, పోలీస్ స్టేషన్ కి వెళ్లింది ., తిరిగి వచ్చి ఏమైపోతుందో ? నాకు భయంగా ఉందమ్మా” … ఒక సంగతమ్మా….
*.దీనంతటికీ కారణం ఆవిడ తమ్ముడమ్మా *
నా కూతురు వెంట పడుతున్నాడట .
* పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని బెదిరించిందట నా కూతురు*..
ఆ తర్వాత ఆవిడ, నీ కూతురికి పొగరెక్కువని నన్ను అని, నీమనుమరాలిని అదుపులో పెట్టుకో,
మగ పిల్లలలను తన వెనుక తిప్పుకోవడానికి చూస్తూ ఉందట అని నాకూతుర్నినిందించిందట . పోలీసు కంప్లైంట్ ఇస్తానందిట.మా తమ్ముడు మాయకుడు నీకూతురు.మావాడిని ముగ్గులోకి దింపడానికి ప్రయత్నించిందట..అందటమ్మా ఆవిడ……..
మాఅమ్మకు కోపం వచ్చి, ఊరుకోకుండా..
మీ తమ్ముడెలాంటి వాడో, ఇక్కడ అపార్ట్మెంట్ మొత్తం అందరికీ తెలుసు..మీ తమ్ముడిని తీసుకురండి. అపార్టు మేంటు పెద్దలందరి
దగ్గరా రుజువుపెట్టిస్తానుఅందట.
అంతేకాదు!,ఈ నెల నుండి పని మానేస్తాను .ఎవరినో చూసుకోండి అందట.
అందుకు,ఆవిడ కక్ష పెట్టుకునే , ఇలా చేసిందమ్మా.!.
“మా ఊర్లో మాది పెద్ద ఇల్లు అమ్మా! ..
ఇక్కడ చిన్న గదిలో, ఎదిగిన పిల్లను ఇంట్లో పెట్టుకొని, ఎలా కాపాడుకోవాలా అని బెంగ పడుతున్నాం. చేజేతులా చేసుకున్న కర్మమిది .
పిల్లల చదువులకని ,వాళ్ళు మావలే కాకుండా గొప్పగా బతుకుతారని వచ్చాము .
కానీ! ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి కూడా కోల్పోతామని అనుకోలేదమ్మా……
మా అమ్మ , మా పాప, నేను బాబు
,ఆ గదిలో పడుకుంటున్నాము..
మా ఆయన తాగి వస్తేనే వాడి నోరు మూయించలేక, పరువు కాపాడుకోవడానికి,
ఆ గదిలోనే ఉంచి నానాయాతనలు పడుతున్నాము..
మధ్యలో మా ఆయన స్నేహితులమని,
ఎవరో వస్తారు.వాళ్లు ఏదోలా చూస్తూ ఉంటే ,
నాకు పిల్లలకి తిరగడానికి కూడా స్థలం లేక ,
ఆ చిన్న గదిలో నానాఅవస్థలు పడుతున్నాం. అయినా ఒకరింటికి వెళ్ళము.
అయినా! ఈ నిందలుఏంటమ్మా?.
ఇక చాలమ్మా ! ఈ పట్టణంలో కాపలాబతుకులు.
ఈ సదుపాయాలు . మరింక ఏవి మాకు అక్కర్లేదు
మా అమ్మ నాకు పసుపు కుంకుమ కోసం ఇచ్చిన పొలం సాగు చేయించుకుని బతుకుతాం.
మా ఆయన పేరన ఉన్న, కాస్త పొలం అమ్మితే,
ఆ పిల్లకు పెళ్లి చేసేస్తాము .
అప్పుడుమాకు ఏ సమస్యా ఉండదమ్మా!.
అమ్మకి .పింఛన్ వస్తుంది.నేను అక్కడ ఉండి ప్రభుత్వ సాయంతో ,ఏ దుకాణమో పెట్టుకుంటాను మేము పల్లెటూరులో ఉంటేనే మాకు పధకాలు కూడా వస్తాయి.వ్యసనపరుడైన మా ఆయనలాటి వాడితో ఎక్కడఉన్నా ఒక్కటే గదమ్మా!
ఈ కష్టమేదో అక్కడే చేసుకుంటూ, పరువుగా బతుకుతాం.
ఒక విషయం మీమనసులో ఉంచుకోండమ్మా.
ఆ అమ్మ గారి కన్నవారిది, మా అమ్మ కన్నవారిది ఒకే ఊరమ్మా.
మాతాత దగ్గర వాళ్ల నాన్న పాలికాపుగా పనిచేసేవాడు.
ఈ మధ్యన వారింటికి వచ్చిన చుట్టం, మా అమ్మనుచూసి చాలాసేపు మాట్లాడారటమ్మా…
ఆవిడ వాళ్ల దగ్గర అప్పుజేసి ఎగవేసిందని వెతుక్కుని వచ్చాడట.
ఆయనమా అమ్మతో మాట్లాడ్డం ఆవిడ చూసి, మా ఇంటికి వచ్చిన చుట్టాలతో నీవెందుకు మాట్లాడావని? గొడవ పెట్టారట.
మా ఇంటి సంగతులు నువ్వెక్కడైనా మాట్లాడితే నీవు చుట్టుప్రక్కల లేకుండా చేస్తానన్నారటమ్మా…
అవన్నీ మనసులో పెట్టుకొని ఈరోజు దొంగతనం. కేసులో ఇరికించారమ్మా.
మా పొలం మా తిండికి సరిపోతాయి,
చాలమ్మా!.
ఇక మా ఊరు వెళ్ళిపోతామమ్మా .
మా అమ్మ మర్యాదగా ఇఅంటికి వచ్చేస్తే చాలు. బాబుగారికి చెప్పండమ్మా..బాబుగారే ,
మా అమ్మను రక్షించాలి,
వెక్కివెక్కి ఏడవసాగింది పార్వతి.
. నాకు అన్నీ తెలుసు పార్వతీ.
“ఆమెది నడి మంత్రపు సిరి.అందుకే మిడిసి పడుతోంది”.
నువ్వు బెంగపడకు అమ్మ వచ్చేస్తుందిలే .
ఇంకొక మాట..నీ కూతురు గురించి బెంగపడకు..
మా తమ్ముడికి అమెరికాలో ఉద్యోగం వచ్చింది. ముందు వాడు వెళ్లి, ఒక సంవత్సరం ఉండి
ఆ తర్వాత మా మరదల్ని పిల్లల్ని తీసుకెళ్తాడుట .
ఆ అమ్మాయి కూడా ఇక్కడ ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్లడానికి టైం పడుతుంది.
వాళ్లది పెద్ద ఇల్లు నీకు తెలుసు కదా!.
పిల్లలతో ఒక్కరిని ఎలా ఉండడం అని బెంగ పడుతోంది మా మరదలు.
మీ అమ్మను, కూతుర్ని అక్కడిక పంపితే..
తనకు సాయం ఉంటారు..
నీ సమస్య తీరిపోతుంది. వాళ్ళ ఔట్హౌస్ పెద్దదే .మొన్న తమ్ముడు తో అదే మాట్లాడితే చాలా సంతోషించాడు.
నేను నీతో మాట్లాడాలను కున్నాను.
ఇంతలో ఇది జరిగింది.
మా మరదలు తో మాట్లాడతాను. సరేనా?
మా ఆయన కమిషనర్ గారి ద్వారా చెప్పించు తున్నారు. సరియైన ఎంక్వయిరీ చేస్తారు.
అమ్మ నేమి జైల్లో పెట్టరు.
అని నేను చెప్తుండగానే,* పరిగెత్తుకుంటూ వచ్చింది పార్వతి కూతురు పద్మిని*..
అమ్మా! నాన్న, అమ్మమ్మ, తాత వచ్చేసారు. అమ్మమ్మకు వాళ్ల చేత సారీ !చెప్పించి ,
అమ్మమ్మను ఇంటికి పంపించేశారు.
“ఇంతకీ! అమ్మగారి గొలుసు దొంగలించిన వాళ్ళు ఎవరో తెలుసా? ఆ అమ్మగారి తమ్ముడే అంట.
ఆయన గారి గర్ల్ ఫ్రెండు పుట్టినరోజున పార్టీ ఇవ్వడం కోసం, ఈ గొలుసు దొంగలించి.అమ్మేసి..
ఆ డబ్బుతో పార్టీ ఇచ్చాడంట.”.
పోలీసులు మన అపార్ట్మెంట్లో ఉన్న వాళ్లను ఎంక్వయిరీ చేస్తున్నప్పుడు ,
నిన్న ఆఅబ్బాయి పుట్టినరోజు పార్టీ ఇచ్చినట్లు తెలిసిందట.
ఆ కోణంలో ఎంక్వయిరీ చేసిన, పోలీసులు వెంటనే అతడిని పట్టేశారు.
. అమ్మమ్మని వదిలేసి ఆ అబ్బాయిని తీసుకెళ్లారు.. ఆవిడ గోల గోల పెడుతూ, మా వాడికేం తెలియదు అనవసరంగా ఇరికించారు..
నేను కేసు వాపసు తీసుకుంటాను అన్నాదట., వాళ్లు ఒప్పుకోవడం లేదట. ఆయాసపడుతూ.
వచ్చి చెప్పింది పద్మిని.
. చూసావా ?దేవుడు అన్న వాడు ఉన్నాడుపార్వతీ . నేను చెప్పలేదా !
.మీ అమ్మ బయటకు వచ్చేసింది.అన్నాను…
“నిజంగానే దేవుడున్నాడమ్మా!..
అది .మీ రూపంలో,అయ్యగారి రూపంలో వచ్చి, మమ్మల్ని ఆదుకున్నాడు ..
మీమేలు జన్మలో మర్చిపోము.
మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు ,అని వేయి నమస్కారాలు పెట్టి వెళ్ళింది పార్వతి..
“పార్వతి వెళ్లిపోయినా, “పచ్చని పంట పొలాలను అమ్ముకున్న పాపం అనుభవిస్తున్నామమ్మా,”అని ఏడ్చిన ఏడుపు,
ఆమెఅన్న మాటలు, నా చెవుల్లోగింగురు మంటూనే ఉన్నాయి” .. సమాప్తం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

గమ్యం లేని పయనం…

నీ వెంటే