కొందరంతే భయపీడితులు.
మూసలో శాంతి ఉందనుకునే మనస్కులు.
వైరుధ్యం వైవిధ్యం పట్ల వైముఖ్యం.
ఆడ మగ ఒక పిల్లాడు పిల్లతో, ఉద్యోగం
ఇల్లు జీవితాశయం!
డబ్బు హోదా బంగారం ఆర్భాటం,
పొదుపు మదుపు ఆదాయం పెంపు
పరుగుపందెంలో పోటీ ప్రపంచంలో,
భయం యేదో కోల్పోతామని,
ఇంకేదో సాధించాలని’ మనకేదో లేదని
మనకే కావాలని,
కొందరంతే భయస్తులు,
ఓడిపోతామనే భయం
ఏదో పోగొట్టుకుంటామనేబెరుకు
జీవితాంత భద్రతకై
జీవితకాల అభద్రత
మనసు తెలుస్తుందనే భయం
చులకనైపోతామనే భయం,
ఒక్కపగలు చౌరస్తాలో చేయిసాచి నిలబడు!
భయంలేని క్షణం అనుభవానికొస్తుంది.
ఒక్కరాత్రి చౌ రాస్థలో ఆగి చూడు!
మనసుతో పనిలేని శరీరాలకు
వెలకట్టడం ఎంత తేలికో అనుభవం వస్తుంది
మర్యాద ముసుగులో
కొందరంతే
ఒక్కరాత్రి ఫుట్పాత్ మీద పడుకుని చూస్తే
మనం రాజయోగం అర్థమవును
మూసజీవితం ఎంత పేలవమో
మనసెంత పేదదో మనకెంత స్వార్దమో
అర్ధంఅవుతుంది.
సాధించిందేం ఉంది పరుగెత్తడం తప్ప!
వారికేమో పోగొట్టుకునేందుకేం లేదు
భయంలేని ఒంటరితనం తప్ప
పగలు రాత్రులు ఒకరి కోసం మరొకరు పడి గాపులు.
జీవితమంతా మతాన్ని కులాన్ని మోస్తూ
అవి చేసిన, చేయిస్తున్న హీనమైన హేయమైన కార్యక్రమాలకు
ప్రత్యక్షంగా,.పరోక్షంగానైనా జవాబు ఇవ్వక తప్పదు..
పనిలో, సాటి మనిషిలో, పిల్లల్లో, తల్లుల్లో, ఆలోచనల్లో, ప్రకృతిలో కనపడలేదు దైవత్వం?
రంగులో హంగులోనేనా,
ఆర్భటంలో, అరాచకత్వం.లో,.
హింసలోనా, ఉంది నీ మతం,?
విద్వేషం లోనా కులం?
9154293872