ఆత్మబంధువు

స్నేహితుల దినోత్సవం సందర్భంగా

          వై .సుజాత ప్రసాద్

అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

****
స్నేహం
ఓ ఆత్మీయ బంధం !
పరస్పరం
ఓ భరోసా !
కష్టసుఖాల్లో
తోడూ నీడ !
ఇష్టాయిష్టాల్లో
అవగాహన !
సహాయ సహకారాల్లో
చేయూత !
ప్రతిభా పాటవాల్లో
ఓ కితాబు !
లోటుపాటుల్లో
ఓ దిద్దుబాటు !
ప్రగతి బాటల్లో
ఓ ప్రోత్సాహం!
నిరాశా నిస్పృహల్లో
చైతన్య దీప్తి !
ఆటపాటల్లో
కేరింత !
సుఖసంతోషాల్లో
ఓ త్రుళ్ళింత !
పదవీ హోదాల్లో
నిరహంకారి !
ఆస్తి అంతస్తుల్లో
సమభావం !
కుల మతాల్లో
లౌకిక వాదం !
అభిమతాల్లో
సంఘీభావం!
పొరపొచ్చాల్లో
క్షమా గుణం !

స్నేహం
నిస్వార్థ రూపం !
త్యాగానికి
సర్వ సన్నద్ధం!

అలాంటి స్నేహం
ఓ వరం
లభిస్తే జన్మ ధన్యం !

వై .సుజాత ప్రసాద్
లచ్చ పేట
సిద్దిపేట
996316965

Written by Y.Sujatha Prasad

వై. సుజాత ప్రసాద్,
ఊరు - లచ్చపేట,
జిల్లా సిద్దిపేట,
చరవాణి - 9963169653.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఎడారి కొలను

స్నేహమంటే