స్నేహమనే విరితోటకు
స్నేహితుడే తోటమాలి
దానికి
ప్రేమ అనే నీరు పోసి….
ఆత్మీయత అనే ఎరువు వేసి…..
బాధ్యత అనే పందిరివేసి….
కోపతాపాలనే కలుపుతీసి….
చీడపీడలను దరిచేరనీయకుండా….
ద్వేషం అనే తెగులు పట్టనీయకుండా…..
స్నేహితుడనే తోటమాలి
తగు జాగ్రత్తలు తీసుకుంటే
ఆ స్నేహ మనే విరి తోట
పదికాలాలు పచ్చగా
చిరునవ్వులనే పూలు పూసి
ఆత్మీయతానురాగాలు అనే ఫలాలను అందిస్తుంది
ఆ క్షణాన కలిగే అనుభూతి అనుభవైకవేద్యం
సోదర సోదరీమణులందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు