aఅమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతల మూట అని కవి పుంగవుడు చెప్పిన మాటను పాటను ఇక్కడ ఒకసారి స్మరించుకుంటూ నాన్న నా వేదం నాన్న నా నాదం అంటూ చెబుతున్నటువంటి కవితలను స్మరించుకుంటూ తల్లిదండ్రులు ఎందుకు గొప్పనో చూద్దాం.
ఆకలి, నిద్ర ,ఆరోగ్యము, అవసరాలు అన్నింటి సమాహారమే తల్లిదండ్రులు.
నవ మాసాలు మోసి గర్భాన్ని ధరించినటువంటి తల్లి తన శిశువును చూసుకొని బాధలన్నీ మర్చిపోయి సంతోష డోలికల్లో ఊగుతుంది. ఈ మధుర క్షణాల కోసం ఎదురుచూస్తూ ఉండేవాడే తండ్రి. చిన్ని మొక్క ఎదగడానికి కావలసిన సూర్య రశ్మి నీరు, నేల కలగలిసినటువంటి చక్కని వాతావరణాన్ని అందించేది కుటుంబం.
మనిషి జీవితానికి కావాల్సినటువంటి చైతన్య జ్ఞాన దీప్తులను అందించే గురువు కంటే ప్రథమ స్థానాన్ని తల్లిదండ్రులకు ఇవ్వడానికి కారణం కూడా ఇదే .పాఠశాలలో అడుగుపెట్టని కాలానికంటే ముందు వరకే జీవిత పాఠాలను తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలతో నేర్చుకుంటారు పిల్లలు. నిస్వార్థం అనే పునాదుల పైన నిర్మించినటువంటి కుటుంబం. పిల్లలని కన్నప్పటినుంచి ఎన్నో త్యాగాలు చేయాల్సి వస్తుంది తల్లిదండ్రులు సరైన సమయానికి నిద్ర ఉండదు తిండి తినలేరు పిల్లలకి ఏ చిన్న కష్టం కలిగిన తల డిల్లిపోతాడు భయకంపితులవుతారు. శిశువుగా ఉన్నప్పుడు రాత్రుళ్ళు పాల కోసం ఏడ్చే పిల్లలు తల్లిని ఇబ్బంది పెట్టాలని ఏడవరు. మన మూత్ర విసర్జనలు చేస్తున్నామని జ్ఞానం కూడా లేని పిల్లలు. తమవల్ల ఎవరికో కష్టం వస్తుంది అని తెలియని బాల్యం అది ఇవన్నీ కూడా ప్రేమ వెల్లువలో పొంగిపోయే విషయాలుగానే గ్రహిస్తారు. కానీ తల్లిదండ్రులు అది కష్టంగా భావించరు. ఈ అవినాభావ సంబంధానికి ఎవరు విలువ కట్టలేరు.
తల్లిదండ్రులు గొప్ప వాళ్ళు అనే వాళ్ళు ఉంటారా? వాళ్ల తాహతు, హోదా, ఆర్థిక పరిస్థితులు సామాజిక పరిస్థితులు ఈ గొప్పతనం కాదు. ప్రేమ ఆప్యాయత ఆదరణ వీటిల్లో పేద గొప్ప అనే తేడాలు లేనిది ఏదైనా ఉందా అంటే అది కేవలం తల్లిదండ్రుల పెంపకం విషయంలోనే. అయితే సామాజిక ఆర్థిక పరిస్థితుల దాస్తీకాలలో పెరిగినటువంటి వాళ్ళ పిల్లలకు మిగతా వాళ్లకు అందినంత స్థాయి అందరు కావచ్చు. కానీ అధిక శాతం తల్లిదండ్రులు ఈ మంచి ,గొప్ప పునాదుల పైననే తమ సంతానాన్ని పెంచుకుంటారు.
సమాజం అంటే ఎగుడు, దిగుడు పరిస్థితులు ఉంటాయి. ఎక్కువ తక్కువలు, మంచి చెడులు ఉత్తమ, అధమ… ఉచ్చ, నీచ పరిస్థితులు ఉంటాయి. ఇదే కొలమానాలలో తల్లిదండ్రులు కూడా ఉంటారు. Positive acceptance ఏంటి అన్నది దృష్టి సారించినప్పుడు….. కేవలం మంచిని గురించే ఒకసారి తలుచుకుందాం.
మాతృదేవోభవ పితృదేవోభవ అంటూ దైవంతో పోల్చినటువంటి తల్లిదండ్రులు ఎప్పుడైనా మంచికే పట్టం కడతారు. అబద్ధాలాడకు అని చెప్తారు. శుభ్రంగా ఉండు అని నేర్పిస్తారు .కష్టపడి వృద్ధిలోకి రా అని మార్గదర్శనం చేస్తారు. ఎవరి స్థాయి వాళ్ళది ఎవరి డబ్బు ఎవరి సంపాదన వారికి తగిన వాళ్లు నేర్పిస్తారు. అంతా విలువలు పాటిస్తున్నారా ? నటిస్తున్నారా ? అనే అంశం పక్కన పెట్టి, మీమాంసలు అన్ని వదిలేసి ఉత్తమ తల్లిదండ్రులు విషయాన్ని తీసుకున్నప్పుడు మానవజాతి మొత్తం హర్షించే విధమైన జీవితాలు అందించాలి అనేదే ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది.
The house is made up of with bricks ,the home is made up with love and affection. అనే మాట మన అందరికీ తెలిసిందే ఇల్లు నిర్మాణానికి ఇంటి పాలనకు మధ్యన ఉన్న ఆ భేదాన్ని గ్రహించాలి. నాలుగు గోడల మధ్య బ్రతుకు కాదు నాలుగు కాలాలు మనల్ని తలుచుకునే బ్రతుకు కావాలి. మంచి వాళ్ళుగా తలుచుకునే బ్రతుకుతావా.
ఇవాళటి పిల్లలే రేపటి తల్లిదండ్రులు అవుతారు ఈ విషయాన్ని ఎవరు మర్చిపోకూడదు. కాలం ఎక్కడ ఆగదు.
ఆధునిక మానసిక మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు చెబుతున్నటువంటి విషయం ఏమిటంటే తల్లిదండ్రులను కౌగిలించుకోండి give a hug very frequently అంటున్నారు. కన్నతల్లి పేగు బంధము కన్నతండ్రి రక్త బంధము కట్టెల్లో కాలిపోయేదాకా ఉంటుంది అనే సత్యాన్ని మరవక తల్లిదండ్రులను ప్రేమ ఆప్యాయతలు పంచి అనుభవించి ముందడుగు వేయాలి.
శాస్త్రపరంగా తల్లి పేగు బంధాన్ని పెంచుకున్నప్పుడు ఆ బొడ్డు ఏదైతే ఉంటుందో దాని స్టెమ్ సెల్ ఉంటుంది, దాన్ని దాచిపెట్టి దానిలోంచి వైద్యానికి ఉపయోగపడే విధంగా ఉపయోగిస్తారు అనేది పాశ్చాత్య దేశాలలో చాలా చూస్తున్నాం ఆ బొడ్డును దాచిపెడతారు సైంటిఫిక్ గా సురక్షితంగా ఉండేలాగా దాని రిజిస్టర్ చేస్తారు వాళ్ళ పేరు మీద. దాని ఉపయోగం ఏంటంటే ఏదైనా ఒక భయంకరమైన వ్యాధి వచ్చినప్పుడు అది ఉపయోగిస్తారు అని. ఇది నా శిశువుది పుట్టినప్పటి స్టెమ్ సెల్ అని వివరాలన్నీ రాసి, సెల్ నూ రిజిస్టర్ చేస్తారు. భవిష్యత్తులో ఏదైనా అనారోగ్యం వస్తే, మందులతోనే తగ్గలేని భయంకరమైన వ్యాధి వస్తే దానితో ఈ సెల్స్ ను ఉపయోగించి ఆ వ్యాధి నిరోధక చేసే ప్రయత్నాలను చేస్తున్నారు. ఈ విషయం మీద ఇంకా తీవ్రమైన పరిశోధనలు జరుగుతున్నాయి. ల్యాబ్ లో సేఫ్టీ స్టోరేజ్ లో పెడతారు. దీనికి డబ్బు కూడా కట్టించుకుంటారు తల్లిదండ్రుల దగ్గర్నుండి. న్యూ బోనస్ టెంపర్ సెల్స్ ను ,ఈ శాంపుల్ కలెక్ట్ చేసి దాచిపెట్టి కావలసినప్పుడు ఉపయోగిస్తారు.
ఇది వింతలో వింతగా అనిపిస్తుండొచ్చు మనకి. కానీ ఇది వాస్తవం నమ్మలేని వాస్తవం. తల్లిదండ్రుల ప్రేమను వారి రక్తం ప్రాధాన్యతను గ్రహించలేక కొందరు తల్లిదండ్రులను అవమానపరుస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు ఇటువంటి వాళ్లకు కనువిప్పు కలిగేలా సమాజంలో కొందరైనా ముందుకు వస్తే భావితరాలకు మంచితనం అనే ఒక కవచం అందించిన వాళ్ళం అవుతాం. తల్లిదండ్రులకు ఒక్క రోజా అనే వింత మాటలను అనకుండా అన్ని రోజులు తల్లిదండ్రుల అయినా కూడా, ఒక్కరోజు మరి ఎక్కువగా వాళ్ళని సంతోషపెట్టేలా చేయాలి అనే ఒక దృష్టిని కలిగించడమే ఈ “రోజుల” ప్రస్తావన. జూలై చివరివారం తల్లిదండ్రుల రోజు వస్తుంది. ఇది మనము గుర్తుపెట్టుకుందాం, అమ్మానాన్నలకు అంకితం అవుదాం.