మన మహిళామణులు

శ్రీమతి దేదీప్య

అందమైన పేరు.అంతకన్నా మిన్నగా సేవాభావంతో బుద్ధి మాంద్యం పిల్లలకి చదువు చెప్తున్నారు.ఓచిన్నారి తల్లి గా ఇంట్లో అత్త గారి కి తోడ్పతున్న ఆమె దేదీప్య…

భమిడి దేదీప్య పెద్ద కూతురు.అమ్మానాన్నలు లక్ష్మి భాస్కరరావు గార్లు.భర్తపవన్ కుమార్ ప్రోత్సాహం తో ముందుకు సాగుతున్నారు ఆమె! చిన్నారిపాప శ్రీవన్య . బాల్యంలోనే తండ్రి ప్రోత్సాహం ప్రభావం తో ఆమెలో సేవాబీజాలు అంకురించాయి.అలా ఆమె తో పాటు అవి పెరిగి పెద్దైనాయి.సైకాలజిస్ట్ కావాలనే తపన బాల్యం లోనే మొగ్గ తొడిగింది.ఇంటిప్రక్కనే దివ్యాంగులబడి ఉండటంతో ఆమె లో ఆసక్తి కుతూహలం పెరిగింది.డౌన్ సిండ్రోమ్ పిల్లలు పైకి చక్కగా బాగుంటారు కానీ మామూలు పిల్లలలాగా ఎందుకు ప్రవర్తించరు అనే ప్రశ్న ఆమెని తొలి చేయసాగింది.కాలేజీ చదువు ముగించిన ఆమె స్పెషల్ ఎడ్యుకేటర్ బి.ధనలక్ష్మిటీచర్ గారి ప్రేరణతో ఎం.ఎస్సీ.సైకాలజీ చేసిన ఆమె ఠాకూర్ హరిప్రసాద్ ఇన్స్టిట్యూట్ లో బి.ఎడ్.స్పెషల్ ఎడ్యుకేషన్ చేశారు.అక్కడ రాజేశ్వరి గారు ప్రేరణ స్ఫూర్తి దాత.డాక్టర్ జగదీష్ గారు సలహాలు సూచనలు ఇచ్చారు.సాధన ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్ లో టీచర్ గా చేరారు దేదీప్య.కోవిడ్ టైం లో వర్క్ ఫ్రం హోం తోపాటు టెలికౌన్సిలింగ్ సాయంతో పిల్లలకి పాటలు నేర్పుతూ అమ్మ నాన్నలలో కూడా అవగాహన కల్గించారు.ఆపెద్దల్లో కూడా ఉత్సాహం ఆశ పెరిగి తమ దివ్యాంగుల పిల్లలని ఈమె దగ్గరకు తెచ్చేవారు.ఐ.ఈ.ఆర్.పి.గా పేదపిల్లలకి సేవ చేయాలని ముందడుగు వేశారు.ఉదయం 5.30 కి ఆమె దినచర్య ప్రారంభిస్తారు.రాత్రి11దాకా బిజీ బిజీగా ఉంటారు.

దేదీప్య తన చదువు ఇతరవివరాలు తరుణి తో పంచుకున్నారు.”నేను ముమ్మిడివరం తూర్పు గోదావరి జిల్లా లో పుట్టాను.హైదరాబాద్ లోనే నా చదువు ఉద్యోగం.ఇండో ఇంగ్లీష్ హైస్కూల్ కూకట్పల్లి _ విద్యాభారతి హైస్కూల్ లో చదివి బేగంపేట సెయింట్ ఫ్రాన్సిస్ డిగ్రీ కాలేజీలో బయో కెమిస్ట్రీ కెమిస్ట్రీ కంప్యూటర్ అప్లికేషన్స్ లో డిగ్రీ పొందాను.నాగార్జునయూనివర్శిటీ నుంచి MBA అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో M.SC psychology చేశాను.కాకతీయ యూనివర్సిటీ నుంచి PG Diploma in Guidance and counseling Diploma in Community Mental health NIMHANS

AWARDS:
Received Women Inspiring Psychologist Award from Telangana Psychologists Association.
Received a certificate from INDIAN BOOK OF RECORDS for being part of “MAXIMUM PARENTS COUNSELLING ON POSITIVE PARENTING” conducted by Manojagriti Organisation and TSWRS.

Received a certificate from ASIAN BOOK OF RECORDS for being part of “LARGEST MENTAL HEALTH PEER COUNSELLING SESSION FOR WOMEN” on International Women’s Day, conducted by Manojagriti Organisation

Received a certificate from INDIAN BOOK OF RECORDS for being part of “LARGEST COUNSELLING AND PSYCHOLOGICAL FIRST AID FOR STUDENTS” on World Mental Health Day conducted by Manojagriti Organisation.

Received a certificate from GUINNESS BOOK OF WORLD RECORDS for being part of “Laksha Gala Sankeerthanarchana of Annamacharya Keertanas” conducted by Silicon Andhra.

Received best cadet award in NCC during March past for Republic Day.
Received many other awards at school and college levels like 1st prize in memory game, science exhibition, drawing, singing, etc.
ఇలాంటి తరుణీమణి నేటి యువతకు ఆదర్శం.ఆమె ఇంకా ఎన్నో బహుమతులు పొందాలని పిల్లలలో చైతన్యం నింపి వారిలో వెలుగులు పంచాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ

దేదీప్య నెంబర్ 7396996688

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఈ పాట విందామా

పాఠకుల స్పందన