ముందుగా తరుణి పాఠకులకు శ్రోతలకు నా నమస్కారములు
గత ఏడు వారాల నుండి శతక కవులు రచించిన శతక పద్యాలు తెలుసు కొనే ప్రయత్నం చేస్తున్నాం అందులోభాగంగా ఈ వారం శేషప్ప కవి రచించిన మరొక పద్యం చూడండి
భుజబున పెద్ద పు లుల జంపగ వచ్చు
పాము కంఠము చేత పట్టవచ్చు
బ్రహ్మ రాక్షసి కోట్ల బార ద్రోలగా వచ్చు
మనుజుల రోగముల్ మాన్ప వచ్చు
జిహ్వ కిష్టము గాని చేదు మ్రింగ వచ్చు
పదును ఖడ్గము చేత నదుమవచ్చు
కష్టమొందు చు ముండ్ల కంపలో జోర వచ్చు
తిట్టు బో తుల నోళ్లు కట్టవచ్చు
పుడమిలో దుస్తులకు జ్ఞాన బోధ తెలిసి తెలిపి
సజ్జ నుల జే య లే డెం త చతురుడైన
భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాసం
దుష్ట సంహా ర నరసింహ దురిత దూర
ఇప్పుడు భావం చూడండి
భుజ బలం తో పెద్ద పులుల నైనా చంప వచ్చు. పాముని చేతితో పట్టుకోవచ్చు. కోట్ల కొద్ది బ్రహ్మ రాక్షసులను పారద్రోలవచ్చు నోటికి ఇంపుగా లేకపోయినా చేదుని మ్రింగవచ్చు ఎంత కష్టమైనా ముళ్ల కంపలో చొరబడవచ్చును తిట్టేవాళ్ళు నోళ్లు ఊహించవచ్చు కానీ భూమ్మీద ఉన్న దుష్టులను సజ్జనులుగా ఎంత చతురు లై నా మార్చలేరు.