ముందుగా తరుణి పాఠకులకు శ్రోతలకు నా నమస్కారములుపోయిన వారం శేషప్ప కవి రచించిన నరసింహ శతకం పద్యం చూశాం ఈ వారం మరొక పద్యం చూడండి.
లోకమందేవ డై న లోభి మానవుడున్న
బిక్ష మర్ధి కి చేత బెట్టలేడు
తాను పెట్టకయున్న తగవు పుట్టదు కానీ
ఒరులు పెట్టగా చూచి యోర్వగ లేడు
దాత దగ్గర జేరి తన ముల్లె వో యినట్లు
జిహ్వతో జాడీలు చెప్పుచుండు
ఫలము విగ్నంబైన బలు సంతసము నందు
మేలు కల్గి న జాల మి డుకు చుండు
శ్రీ రమానాథ! ఇటువంటి క్రూరునకు ను
బిక్షకుల శత్రువని పేరు పెట్టవచ్చు
భూషణ వికాస!ధర్మపురి నివాస!
దుష్ట సంహా ర నరసింహ దురిత దూర
ఇప్పుడు భావం చూడండి
పిసినారి యాచ కుల తన చేతితో బిక్షం పెట్టడు పెట్టకపోతే ఏ గొడవ లేదు. కానీ ఇతరులు పెట్టినప్పుడు చూసి తాను ఓర్వలేడు దానం చేసి వారి దగ్గరకు వెళ్లి తన సొమ్ము పోయినట్లుగా చాడీలు చెబుతాడు. లోభి తాను అనుకున్నట్లు దానం చేయడం విఫలం అయితే చాలా సంతోషిస్తాడు ఇతరులకు మేలు కలిగితే బాధపడతాడు ఇటువంటి వారిని భిక్షకులకు శత్రువుగా కవి సూచిస్తున్నాడు.