అంతరిక్షంలో సునితా విలియమ్స్

21-7-2024 తరుణి పత్రిక సంపాదకీయం

మనమంతా ఎంత హాయిగా ఉంటాము ఈ నేల మీద. ఇష్టమైన తిండి ఇష్టమైన పద్ధతిలో బ్రతకడం స్వేచ్ఛ జీవులం. శాస్త్రవేత్తలకు వాళ్ల ధ్యేయం ఒక్కటే వాళ్లది. మిగతా అంతా వినిమయ బ్రతుకుది. సూపర్ టెక్నాలజీలో తమని తాము కరగ తీసుకొని మన వంటి జీవుల కొరకు అహర్నిశలు కష్టపడతారు
భూమి మీద ఆవరించి ఉన్న అనంతమైన అంతరిక్షం శోధించి కొత్త నాగరిక జీవనం కోసం త్యాగం చేస్తూ ఉంటారు సైంటిస్టులు. పరీక్షానికి భూమి పైన వాతావరణానికి ఏ విభజన రేఖలను సృష్టించలేము కానీ హాయిగా ఇంట్లో కూర్చొని నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ ఉంటాం. కోటానుకోట్ల క్షేత్రాలు, అనేకానేక గ్రహాలు
చెప్పలేనన్ని అద్భుతాలు అణువులు అను శక్తులు విపరీత పదార్థాలు అన్నింటి సముదాయం విశ్వం. ఈ నామవాచక శబ్దం ఎంత బలమైనదంటే ఈ భూమి ఒక చిన్న గ్రహం ఇక ఊహించుకోవచ్చు విశ్వతలాన్ని. రోదసి అని చెప్పే ఈ అంతరిక్షం ఖగోళ అద్భుతం.aero space గురించి ఎంత తలచి చూసిన తరగనిది. కానీ, మన సునీత విలియమ్స్ గురించి చూడాలి. మనో పుస్తకాన్ని తెరచి తెరచి మరీ చూడాలి. 2007లో మొట్టమొదటి మిషన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఐఎఫ్ఎస్సి లో ఆమె చేరినప్పటి నుంచి ఇప్పుడు అంతరిక్షంలో పరిస్థితి వరకు చూడాలి, వినాలి . హృదయం మీదికి తీసుకోవాలి. అప్పుడే మనం మనుషులం అన్న స్పృహ ఉన్న వాళ్ళం అవుతాం.
Boston Marathon space station లో సునీత విలియమ్స్ ప్రయోగం మరపురానిది.
Home Beyond Earth అనేది ఊహించగలమా? అన్ని తీర్ల వాతావరణం సరిగా ఉన్న ఈ చిన్న అసౌకర్యాన్ని కూడా తట్టుకోలేని ఈ చిన్న భారాన్ని కూడా మోయలేని బ్రతుకు జీవులం . తమదైన కుటుంబాలను తమ దైన స్వేచ్ఛాపూరిత జీవితాలను వదులుకొని ఆకాశంలో పరిశోధనలు చేయడానికి వెళుతున్నటువంటి వ్యోమగాముల అందరిలోనూ సునీత విలియమ్స్ సుప్రసిద్ధు రాలే. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఫ్లోరిడా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ లో 1995లో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నది. నావికాదళం అధికారినిగా NASA లో అంతరిక్ష స్టేషన్ స్థాపించి 14వ సభ్యురాలైన యోగ మీద నియమించబడిన సునీత విలియమ్స్ తనదైన ప్రతిభాపాటవాలను చాటుతూ అంచలంచెలుగా ఎదిగారు. 321 రోజుల 17 గంటల 15 నిమిషాలు అంతరిక్షంలో గడిపిన సునీత విలియమ్స్ ధైర్య సాహసాలు యువతకు స్ఫూర్తిదాయకం. భారతీయ సంతతికి చెందిన సునీత విలియమ్స్ అమెరికాలోని ఒహాయో స్టేట్ లో పుట్టింది . ఈమె తండ్రి మన దేశం లోని గుజరాత్ రాష్ట్రానికి చెందిన దీపక్ పాండ్యా . సునీత విలియమ్స్ తల్లి బోనీ జలోకర్ , స్లోవేకియా అనే దేశానికి చెందిన స్త్రీ. సునీతకు మరో ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు. నేవల్ ఏవియేటర్గా శిక్షణ తీసుకున్న సునీత విలియమ్స్ హెలికాప్టర్ కంబార్ట్ సపోర్టు స్క్వాడ్ గా పేరు తెచ్చుకున్నది. దాదాపు 30 ఏళ్లు తన వృత్తిలో నిబద్ధత కలిగిన ఉద్యోగినిగా నిలబడింది. నాసా సునీత విలియమ్స్ ని అంతరిక్ష యానంలోకి పంపించేందుకు ఎంపిక చేసుకున్నప్పుడు ఎన్నో రికార్డ్స్ నెలకొల్పబోయే వ్యోమగామి అని ఎవరనుకున్నారు? సౌర ఫలకాలను అంతరిక్షంలో అమర్చడం కానీ ఆ కేంద్రాన్ని భూమి కొరకు చేసే ప్రయోగాలకు అనువుగా తయారు చేసే రమ్మత్తులు గాని తనదైన ప్రయోగశాల తత్వంతో ఎన్నో రకాల పరిశోధనలు జరుగుతుందని ఎవరనుకున్నారు? తన ఈ వ్యోమగామై ఉద్యోగం నుంచి వరికాస్త ముందుకు అడుగు వేసి నాసా ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్ మిషన్ ఆపరేషన్ బృందంతో కలిసి కూడా కొత్త కొత్త ప్రయోగాలను చేసింది. ఇందుకోసం సునీత విలియమ్స్ సముద్ర గర్భంలో కూడా రీసెర్చ్ చేసింది.
మొన్నటికి మొన్న 20204 జులై 14 వ తేదీ నాడు సునీత విలియమ్స్ మళ్లీ అంతరిక్ష యాత్రను ప్రారంభించింది అందరికీ తెలిసిందే. ఈమెతో పాటు యూరి మాలెన్కర్ అనే రష్యన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఇంజనీర్ తో ,
జపాన్ ఏరోస్పేస్ ఇంజనీర్ అకికో షైడ్ లు సునీత విలియమ్స్ సబర్డినేట్స్. ఈ అంతరిక్ష యాత్ర కజకిస్తాన్ దేశంలోని బైకనూర్ క్రాస్మోడ్ డ్రోమ్ నుంచి మొదలుపెట్టారు. ఇంకా అంతరిక్షం నుండి తమ సేవలను అందిస్తూనే ఉన్నారు.
2020లో సునీత విలియమ్స్ భారతదేశానికి వచ్చారు మరో వ్యోమగామి కల్పనా చావ్లా ను కలవడానికి వచ్చారు. పద్మ భూషణ్ అవార్డును అందుకున్నారు . అలాగే humanitarian service medal కూడా బహుకరించింది మన దేశం. space explorer in New Dawn and a cinemalu Sunita Williams ఎంతో సహజ సిద్ధంగా నటించారు.19 సెప్టెంబర్ 1965లో జన్మించిన సునీత విలియమ్స్ 58 సంవత్సరాల వయసులోనూ ఇంతటి సాహసాన్ని చేయడానికి పూనుకున్నారంటే ఎంత విచిత్రం.
అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్ సి ఆర్ టి లో ఉన్న విమానాల తయారీ చేసే Boeing దర్శించినప్పుడు సునీత విలియమ్స్ విశేషాలన్నీ అక్కడ చదవగానే విజ్ఞెఎఎతకులోనైనా సందర్భాలను గుర్తు చేసుకుంటు ఆమె తిరిగి భూమి మీద కాలు మోపి అంతరిక్ష విశేషాలు మనందరికీ తెలియజేయాలని కోరుకుందాం.
సునీత విలియమ్స్ అనగానే ఒక స్ఫూర్తి. ఒక చైతన్యం వెల్లి విరుస్తుంది. Dr. Gioia, Dr. Sarena Chancellor, Nicola Scot వంటి మీ అమ్మగాములందరిలో ,అంతరిక్ష ప్రయాణికులలో ఒక మహిళగా సుదీర్ఘమైన కాలం అంతరిక్షంలో ప్రయాణం చేసిన సునీత విలియమ్స్ ఒక రికార్డును సృష్టించారు

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఆడియో విజువల్ హెరిటేజ్

శతక పద్యాలు జీవన మార్గ సూచికలు