ఎడారి కొలను 

ధారావాహికం – 27 వ భాగం

(ఇప్పటివరకు : అనారోగ్యంనుండి కోలుకున్న మైత్రేయిని  కాంతమ్మ గారు తన ఇంటికి తీసుకెళుతుంది. కాంతమ్మ గారి భర్త ప్రభాకర్ గారి వ్యక్తిత్వం అందర్నీ ఆకట్టు కుంటుంది.  అందరు సరదాగా మాట్లాడు కుంటూ భోజనం చేశాక   TV లో   వస్తున్న  డిస్కషన్  వింటూ అందరి దృష్టి మారుతున్న వివాహ వ్యవస్థ ధోరణి పైకి మరలి, అదే విషయం కాసేపు   చర్చించుకుంటారు) 

“ఏమయ్యా ప్రసాద్! ఎం చేద్దామనుకుంటున్నావు ఇప్పుడు,” అడిగాడాయన.

“ నాకర్ధం కాలేదు సార్!” అన్నాడు.

“అదే మైత్రేయి విషయం! నువ్వేమనుకుంటున్నావు!” అని కాస్త వివరంగా అడిగారాయన.

“ఆలోచిస్తున్నానండి! నాకేమి తోచటం లేదు. ఆమె కి ఏదయినా హెల్ప్ చేయాలన్న కాస్త అలోచించి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆమె భర్త సుబ్బారావు కాచుకొని కూర్చున్నాడు. అవకాశం దొరికితే ఆమెని ఇబ్బంది పెట్టడానికి, బాధపెట్టడానికి.”

“ అవును! నాకు అలాగే అనిపిస్తున్నది. ఏది ఏమయినా కోర్ట్ కేసు ఒక కొలిక్కి రావాలి అప్పుడే మనమేమయిన చేయగలం,” అన్నాడాయన.

“సార్! మీరేం చేసేవారు? ఎప్పుడు రిటైర్ అయ్యారు ?” అంటూ భయం తో కూడిన గౌరవంతో అడిగాడు.

“అంత భయం భయంగ అడుగుతావేంటి ప్రసాద్! నేను ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ని,” చెప్పాడాయన.

“ అయ్యా బాబోయ్! మీరు జర్నలిస్టా!” అంటూ ఆశర్యంగ చూసాడు ప్రసాద్.

“అవునయ్యా అది నా హాబీ. నేను కొంతకాలం  ఇండియన్ ఆర్మీ లో కూడా చేశాను. ఆ తరువాత నా ఫ్రెండ్ తో కలిసి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నాను. అయితే ఆ బిజినెస్ లో నేను స్లీపింగ్  భాగస్వామ్యుడని మా త్రమే. నాకు ప్రతి మూడు నెలల కొకసారి  ఆ బిజినెస్ యొక్క ఆడిట్ పని చేస్తుంటాను. నేను B COM అయినా తరువాత  C A INTERMEDIATE  కూడా చేశాను పూనా బిజినెస్ స్కూల్ నుండి. ఇవన్నీ కాస్త వయసు వచ్ఛాకనే చేశాను. ఎందుకంటే నేను ఇంటర్మీడియెట్ లో సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యానని మా నాన్న గారు కోపగించుకున్నారు. ఆ ఉక్రోషంతో ఆర్మీ రిక్రూట్ మెంట్ జరుగుతుంటే వెళ్లాను. ముందు సెలెక్ట్ అవుతాననుకోలేదు. అనుకోకుండా జరిగింది. అందులో చేరుతున్నానని మా నాన్న గారికి చెబితే అక్కడయినా మంచి రాంక్ తెచ్చుకో అని అన్నారు. నాకింకా కోపం వచ్చి నేను మిలిటరీ లో అన్ని ట్రైనింగ్స్ పూర్తి చేశాను, కానీ కాలం ఎప్పుడు మనతోటి ఉండదు కదా! మా మిలిటరీ ట్రక్ వెళుతున్న దారిలో ల్యాండ్ మైన్ ఒకటి  పేలి  మా అందరికి బాగా దెబ్బలు తగిలాయి. కన్ను లొట్ట పోయి ప్రాణం దక్కి నట్లయింది. మా అందరికి  నష్ట పరిహారం గా ఆర్ధిక సహాయం తో పా టు మాలో కొందరికి బిజినెస్ చేసుకోవడానికి ప్రభుత్వం తరఫు నుండి లైసెన్స్ మరియు బ్యాంకు లోన్స్ దొరికాయి. అలా నేను నా స్నేహితుడు గురుదీప్ సింగ్ కలిసి ట్రాన్స్ పోర్ట్  బిజినెస్  స్టార్ట్ చేసాము. వాడే నన్ను బాగా ఎంకరేజ్ చేసి నా చేత  B COM  పూర్తి చేయించాడు. నేను C A INTERMEDIATE కూడా చేశా అదే ఊపులో. అందుకే నేను పార్టనర్ కం ఆడిటర్ మా ట్రాన్స్ పోర్ట్  బిజినెస్ లో, మా బ్రాంచెస్ విజయవాడ ,హైదరాబాద్ , నాగపూర్, భోపాల్, ఢిల్లీ లో ఉన్నాయి. ఈ బ్రాంచ్ లన్నిట్లో  ఆర్మీ నుండి రిటైర్ అయిన ఇంకొందరు ఎంప్లాయిస్ కూడా మాతో కలిసి పనిచేస్తున్నారు,” అంటూ ప్రభాకర్ తన గురించి వివరించాడు.

“మరి మీ జర్నలిజం  మాటేమిటి,” పొడిగించాడు.

రెండు రోజుల క్రితం వచ్చినా ఒక స్థానిక న్యూస్ పేపర్ ని తీసి చూపించాడు. సెంటర్ పేజీలో “ఒక అబల  పైన పోలీసుల పెత్తనం,” అన్న హెడ్డింగ్ కిందన మైత్రేయి తోటి 2 టౌన్ ఎస్ ఐ వ్యవహరించిన తీరు, అసలే నేరం పైన ఆమెని పోలీస్ స్టేషన్ కి రోజు హాజరు పరిచారంటు, తీవ్రమయిన పదజాలంతో యోగరాజ్ చేసిన నిర్వాకం బయట పెట్టబడింది,” దాని కింద eagle’s eye స్కెచ్ సైన్ లాగా కనిపించింది.

“సార్! మీరేనా ఆ  eagle’s eye. ఈ  రోజెంత శుభదినం. ఒక అద్భుతమయిన వ్యక్తి ని కలిసాను,” అంటూ ప్రభాకర్ గారి చేతులు పట్టుకొని ఊపేసాడు ప్రసాద్.

అయన చిరునవ్వు తో ప్రసాద్ భుజం తడుతూ,”చూడు ప్రసాద్! మైత్రేయి విషయం కోర్ట్ కి వదిలిపెట్టడంకాదు. మనం చేయాల్సింది కూడా ఉన్నది.ఇంకొక బాధ్యత కూడా నువ్వు నెరవేర్చాలి,” అన్నాడు.

“చెప్పండి సార్ , ఎం చేయమంటారు? అన్నాడు కాస్త ముందుకు వంగి.

“ఆమెకు  ఆత్మా విశ్వాసం పెంచాలి. ఇలాటి సమస్యలు మైత్రేయి కి మాత్రమే కాదు. చాల మంది కున్నాయి. వారిలో కొందరికి లేనిది ఏమిటో తెలుసా ఆర్ధిక స్వాతంత్రము. అది మైత్రేయి కున్నది. బేలగా  భయపడుతూ బతకాల్సిన స్థితి ఆమెది కాదు. ఆమె పది మందికి ఆధారం కావాలి, స్ఫూర్తినివ్వాలి. దానికి మనం మైత్రేయి ని తయారు చేయాల్సి ఉంటుంది. అది ఒక మంచి స్నేహితుడిగా నువ్వే చేయగలవని నా అభిప్రాయం, ” అని చెబుతుండ గానే మైత్రేయి మూడు కప్పుల టీ  తో అక్కడకు వచ్చింది.

“ ఏంటో, అంకుల్, ప్రసాద్ మాట్లాడేసుకుంటున్నారు, నా గురించేనా?” అంటూ కప్పులు వాళ్ళకి అందించి ప్రసాద్ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంది.

“ నీ గురించే అని నీకెలా అనిపించింది,” అడిగాడు  ప్రభాకర్.

“ అందరికి నేనే కదా హాట్ టాపిక్. ఏ ఇద్దరు కూర్చున్న మాట్లాడేది నా గురించే కదా? అదే  గెస్ చేసి అడిగాను,” అన్నది కాస్త చిలిపిగా.

“ నువ్విలాగే ఆలోచిస్తావా! అందరిలాగే!” అన్నాడు ప్రసాద్.

“ అవును తప్పేముంది?” ఎదురు ప్రశ్న వేసింది.

“ నువెప్పుడయినా కాస్త డిఫరెంట్ గ ఆలోచించావా? నువ్వు నీ గురించే కాకుండా, నీ సమస్య గురించే కాకుండా, అప్పుడప్పుడు మరొక కోణం నుండి కూడా మనం మన సమస్యలని చూడాలి అప్పుడే పరిష్కారం దొరుకుతుంది. ఆ పరిష్కారం చాల మందికి ఉపయోగ పడుతుంది. ఏమంటావు మైత్రేయి,” అన్నాడు ప్రభాకర్ కాస్త గంభీరంగా.

“అవును మైత్రేయి. కొంతకాలం ఈ సమస్య లేవి నీవి కాదు అని ఆలోచించు. ఇంకెవరికోసమో పరిష్కారమార్గాలు వెతుకు, సమాధానం అదే దొరుకుతుంది,” అంటూ ఆమెకు నచ్చ చెబుతుండగా కాంతమ్మ గారు కూడా తన టీ కప్పు తోటి వచ్చింది.

“మీరిద్దరు కాసేపు ఆ కబుర్లు ఆపుతారా?  మనం రేపటి ప్రోగ్రాం గురించి మాట్లాడుకోవాలి ,” అంటూ వాతావరణం తేలిక చేసింది.

(ఇంకావుంది)

Written by Padma NeelamRaju

రచయిత గురించి:

పద్మావతి నీలంరాజు చండీఘర్ లో ఇంగ్లీష్ అధ్యాపకురాలిగా 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న రిటైర్డ్ ఉపాధ్యాయురాలు. ఆమె నాగార్జున విశ్వవిద్యాలయం ఆంధ్ర ప్రదేశ్ నుండి M A (Litt),
POST GRADUATE DIPLOMA IN TEACHING ENGLISH ,CIEFL, హైదరాబాద్‌ లో తన ఉన్నత విద్యను పూర్తి చేసింది. స్త్రీ వాద సాహిత్యంపై దృష్టి సారించి Indian writing in English లో Panjabi University, patiala , Panjab, నుండి M phil డిగ్రీ పొందింది. తెలుగు సాహిత్యం పైన మక్కువ ఇంగ్లీషు సాహిత్యంపై ఆసక్తితో ఆమె తన అనుభవాలను తన బ్లాగ్ లోను
( http://aladyatherdesk.blogspot.com/2016/02/deep-down.html?m=1,)
కొన్ని సాహితీ పత్రికల ద్వారా పంచుకుంటున్నారు. ఆమె రచనలు తరచుగా జీవితం మరియు సమాజం పట్ల ఆమెకున్న అనుభవపూర్వక దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి. ఆమె అధ్యాపకురాలిగా గ్రామీణ భారత్ పాఠశాలల్లో E-vidyalok- e-taragati (NGO) లో స్వచ్ఛంద సేవలందిస్తున్నారు. రచన వ్యాసంగం పైన మక్కువ. పుస్తకాలు చదవడం, విశ్లేషించడం (Analysis / Review) ఆంగ్లం నుండి తెలుగు లోకి అనువాదం(Translation) చేయడం అభిరుచులు . PARI సంస్థ (NGO) లో కూడా ఆమె గ్రామీణ భారత జీవన శైలిని ప్రతిబింబించే వ్యాసాలను కొన్నిటిని తెలుగులోకి అనువదించారు (padmavathi neelamraju PARI). HINDUSTAN TIMES, తరుణీ ,మయూఖ, నెచ్చెలి వంటి పత్రికలలో కొన్ని కధలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. “Poetry is the sponteneous overflow of power feelings; recollected in tranquility” అన్న ఆంగ్ల కవి వర్డ్స్ వర్త్ తనకు ప్రేరణ అని చెబుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సందెపొద్దు గూటిలోకి

మన మహిళామణులు