కంచి కామకోటి పీఠంలో ఒకరోజు ఒక వంట బ్రాహ్మణుడు మినప్పప్పు పొట్లం దొంగిలిస్తూ అక్కడ సిబ్బంది కంటపడ్డాడట. విషయం చిన్నది అయినా సిబ్బంది దానిని పెద్దది చేసి ఈరోజు ఇది జరిగింది రేపు మరోటి జరగవచ్చు అని ఆ వంట బ్రాహ్మణుడిని పీఠాధిపతి పరమాచార్యుల వారి వద్దకు పట్టుకెళ్ళారట. బ్రాహ్మణుడిని పరమాచార్యుల వారి ముందు నిలబెట్టి జరిగిన విషయం చెప్పారట .అప్పుడు పరమాచార్యుల వారు ఎంతో నిదానంగా ఒక చిరునవ్వు నవ్వి ఎందుకు స్వామి అలా చేశారు? మీరు రోజు ఇక్కడే ఉంటారు కదా!!! మీ చేతుల తోటే అందరికీ గారెలు వండి ప్రసాదంగా పెడతారు కదా!!!! ఈ విధంగా చేయవలసిన అగత్యం ఏమొచ్చింది?? అని అడిగారట .అప్పుడు ఆ వంట బ్రాహ్మణుడు నేను రోజు ప్రసాదానికని ఎన్నో వందల గారెలు చేస్తాను కానీ…. అంతా అయిపోయి అందరికీ పంచి పెట్టిన తర్వాత చివరగా నాకు మిగిలేది కూడా నా వంతు ప్రసాదంగా ఆ చిన్న గారెముక్క తప్ప నాకు ఏమీ మిగలట్లేదు. నాకు గారెలు తినాలని బుద్ధి పుట్టింది ఎప్పటి నుండో కడుపునిండా తింటే బాగుండు అనుకుంటున్నాను. కానీ ఆ అవకాశం చిక్కట్లేదు .అందుకొరకు కాస్త మినప్పప్పును మూట కట్టి తీసుకెళ్తున్నాను స్వామి అని నిజాయితీగా చేసిన తప్పు ఒప్పుకున్నారట . అప్పుడు పరమాచార్యుల వారు సిబ్బందితో అతనిని వదిలిపెట్టండి .ఈరోజు నుండి ఆ బ్రాహ్మణుడికి వేరే వంట వాడితో గారెలు వండించి ఆయన తినగలిగినన్ని గారెలు పెట్టండి. అప్పుడు ఆయన తృప్తి చెందుతాడు. ఇంకొకసారి ఇలాంటి పని చేసే అవకాశం ఉండదు అని బదులిచ్చార ట .ఇంకా పరమాచార్యుల వారు ఆ వంట బ్రాహ్మణుడితో మీకు ఎప్పుడైతే గారెలు తినటం మీద విసుగు పుడుతుందో అప్పుడు ఆపేయండి ఇది మీకు సంతోషమే కదా!!!! అని చెప్పి అక్కడినుండి పంపించేశారట . పరమాచార్యుల వారి విశాలమైన ఆలోచనకు సముచితమైన నిర్ణయానికి ఆశ్చర్యపోవటం అక్కడ ఉన్న అందరి వారి వంతు అయింది.
దీనిని బట్టి మనo గ్రహించవలసింది ఏమిటంటే తప్పు చేసిన వాడిని చేసిన తప్పును ఎత్తిచూపకుండా ఆ తప్పుకు కారణాన్ని కనుక్కొని దానిని సరిదిద్దే ప్రయత్నం చేస్తే వారు మరలా మరలా ఆ తప్పు చేసే ప్రయత్నం చేయరు అని….
బ్రహ్మశ్రీ .చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచన సౌజన్యంతో నేను విన్న దానిని యధాతధంగా…