మన మహిళామణులు

శ్రీమతి రామతులసి

ఆమె పేరు రామ తులసి. కడప జిల్లా కాశినాయన మండలంలోని ఉప్పులూరు గ్రామంలో ఆగస్టు నెల 12వ తేదీ 1993 వ సంవత్సరంలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ ఆమెను డిగ్రీ వరకు చదివించారు. డిగ్రీ చదివే సమయంలోనే తిరుమలలోని శ్రీవారి సేవలో పాల్గొనేది. చిన్నప్పటినుండే తనకు ఆధ్యాత్మిక భావాలు ఉన్నాయి. తన చదువు పూర్తి అయిన తర్వాత తమ బంధువుల అతను అయినా పాపిజెన్ని రామకృష్ణారెడ్డి అనే అతనికి 2014 సంవత్సరంలో వివాహం చేశారు . వివాహం కాకముందు రామకృష్ణారెడ్డి చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఆమెను ప్రభావితం చేశాయి. వివాహమైన తర్వాత ఆమెకు సేవ మీద అవగాహన కలగటం ప్రారంభమైంది‌. తనతో పాటు ఆమె కూడా వెళ్లి కొన్ని పాఠశాలలో నిరుపేద అయిన విద్యార్థులకు పుస్తకాలు, వాళ్లకు కావాల్సిన స్టేషనరీ వస్తువులు , మోటివేేషనల్ పుస్తకాలు ఇలాంటివి ఆమె పంపిణీ చేయడం ప్రారంభించింది. అప్పటినుండి సేవలో పూర్తి సమయాన్ని కేటాయించడానికి నిర్ణయించుకుంది. రామకృష్ణారెడ్డి 2010వ సంవత్సరంలో వివేకానంద ఫౌండేషన్ సంస్థను ఏర్పాటు చేసి ఎన్నో రకాల సామాజిక సేవా కార్యక్రమాలు చేసేవారు. తన సొంత ఊర్లో ఉన్న అవ్వతాతలకు పెన్షన్ రావడం లేదని తెలిసి ఊర్లో ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరిని కలుపుకొని నెలనెలా పింఛన్ల రూపంలో అవ్వతాతలకు అండగా నిలిచేవాడు. అంతేకాకుండా గ్రామంలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న నాటుసారాను కూడా నిర్మూలించాడు. రామ తులసి మొక్కలు నాటడం ,పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేయడంతోపాటు, అరుదైన తన ఏ నెగెటివ్ రక్తాన్ని ఏ ప్రాంతంలో అవసరమైన రక్తదానం చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు ఆమె నాలుగు సార్లు రక్తదానం వివిధ ప్రాంతాలలో చేసింది. అంతేకాకుండా కాటివరకు ఆడవారు వెళ్లాలంటేనే ఒప్పుకోనట్టి ఈ సమాజంలో ఒంటరిగా ఎవరు ఎక్కడ మరణించిన అనాధలు మరణించినా ఆ నలుగురిలో ఒక్కరిగా ఆమె భుజం పట్టి అంతిమ సంస్కారం చాటుకుంటూ మానవత్వాన్ని ప్రదర్శిస్తుంది. కానీ ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఆమెకు, రామకృష్ణారెడ్డికి తెలియని అసంతృప్తి ఉండేది.

 

ఒకానొక రోజున ఒక యువకుడికి ఆరోగ్యం బాగోలేక రోడ్డు మీద పడి ఉన్న అతని చూసి తన భర్త రామకృష్ణారెడ్డి హాస్పిటల్లో చూపించి అతనికి సపర్యలు చేసినా కూడా సరైన షెల్టర్ ఇవ్వలేకపోయారు. గాయాలై పురుగులు పట్టి నరకయాతన అనుభవిస్తున్న ఆ అభాగ్యుడి దీనస్థితిని చూసి చలించిపోయారు. ఆయన తన సతీమణి రామ తులసికి విషయం చెప్పడంతో చెప్పడంతో ఆ రోజు నుంచి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇలాంటి నిర్భాగ్యులైన వారికి ఒక ఆశ్రమాన్ని కట్టించి వారికి తినడానికి తిండి, ఉండడానికి వసతి అవసరమైన వైద్యం అన్ని వసతులతో ఒక మంచి ఆశ్రమాన్ని నిర్మించాలని సంకల్పించుకున్న తర్వాత ఆమె కూడా రామకృష్ణారెడ్డి మాటకు హామీ ఇచ్చి తను చేసే సేవలో తాను భాగస్వామ్యం అవుతానని ముందుకు వచ్చింది.

కానీ ఆశయం గొప్పదే వారి దగ్గర డబ్బు లేదు. ఆశ్రమాన్ని కట్టించాలని కోరిక బలంగా ఉన్నప్పటికీ ఆర్థికంగా లేకపోవడంతో పెళ్లికి తన తల్లిదండ్రులు పెట్టిన బంగారును బ్యాంకులో తాకట్టు పెట్టి ఆశ్రమం పనులు ప్రారంభించారు. దాతలు, తెలిసిన వాళ్ళు,‌ ఆత్మీయులు ఇలా తలా ఒక చేయి వేసి ఒక ఎకరా విస్తీర్ణంలో కడప జిల్లా కాశినాయన మండలంలోని ఓబులాపురం గ్రామ సమీపంలో ఒక ఎకరా విస్తీర్ణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆశ్రమాన్ని నిర్మించారు. ఆశ్రమం నిర్మాణం కోసం తన భర్త రామకృష్ణారెడ్డి పడినటువంటి కష్టం అంత ఇంత కాదు. దాదాపు ఆశ్రమంలో 70 మంది అనాథలు ఆశ్రయం పొందారు. అందులో ఆనారోగ్యంతో కొంతమంది చనిపోయారు. కన్న బిడ్డల నుంచి వెలివేతకు గురైన వారిని అక్కున్న చేర్చుకున్నప్పటికీ వారికి ఆప్యాయతను అనురాగాన్ని పంచుతున్న ఏదో తెలియని వాళ్ళ వేదనను గమనించి వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చి తదానంతరం ఇంటికి పంపించే ఏర్పాట్లు కూడా చేసి దాదాపుగా 35 మందిని వారి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపేలా చర్యలు చేశారు.

 

ఇప్పుడు ఆశ్రమంలో 15 మంది అభాగ్యులు సేద తీరుతున్నారు . సేవా అంటే ఏంటో తెలియని తనకు రామకృష్ణారెడ్డి ముందుండి ధైర్యాన్ని నింపుతూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ ఈరోజు ఎంతోమంది అభాగ్యులకు అండగా నిలిచేందుకు రామ తులసికి ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహం ఎనలేనిది. ఆశ్రమంలోనే కుటుంబమంతా ఉంటూ అభాగ్యుల ఆలనా పాలనా చూసుకుంటూ ఆనందంగా జీవిస్తున్న రామ తులసి అవ్వతాతల ఆశీస్సులు కంటే ఇంతకన్నా మాకు ఏమీ కావాలి అని చెప్పటం ఆమె యొక్క గొప్పతనానికి నిదర్శనం. గత 14 సంవత్సరాలుగా వీరు చేస్తున్న సేవలకు జిల్లా, రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు దాదాపుగా 70 పైగా అవార్డులను అందించారు. మూడు పదుల వయసులో వీరు చేస్తున్న నిస్వార్థ సేవల నేటి తరానికి స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఆశిస్తూ…
ఇలాంటి దంపతులకు జాతీయ అంతర్జాతీయ గుర్తింపు తెచ్చే విధంగా ప్రతి తెలుగు వారు ప్రయత్నించాలి.భవిష్యత్తులో పద్మశ్రీ అవార్డు వస్తుందని ఆశిద్దాం

భర్త ప్రోత్సాహంతో పాటు సోషల్ వర్క్ చేయాలి అనే తపన నేడు చాలా తక్కువ మంది లో ఉంటుంది.యువతిగా ఆదర్శ భావాలు ఉండటం వేరు పెళ్లి ఐనాక‌ నీటిలో దిగితే కానీ లోతు తెలీదు.భర్తచేసే సంఘసేవ లో మనసా వాచా కర్మణా అర్ధాంగి గా సహకరిస్తూ తల్లి గా బాధ్యతలు చేపట్టిన రామతులసికి అండదండలు ఆమె భర్త పాపిజెన్ని రామకృష్ణా రెడ్డి గారు.తరుణిలో‌ అలాంటి యువతిని పరిచయం చేయడం నాకు గర్వకారణం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

“నేటి భారతీయమ్” (కాలమ్)

ఆరుద్ర పురుగులు