జీవనది

కథ

       కామేశ్వరి వాడ్రేవు

అప్పుడే ఆఫీసు నుంచి వచ్చిన మహతి సోఫాలో కూలబడింది నిస్పృహగా. లోపలి నుంచి వచ్చిన తల్లి ” ఏమ్మా అలా ఉన్నావు…. ఒంట్లో బాగుండలేదా ! ఆఫీసులో పని ఒత్తిడా ” అంటూ ఆత్రుతతో కూతురు నుదురు మీద చెయ్యి వేసి చూస్తూ. ” అమ్మ నన్ను ఒక్కసారి ఒంటరిగా ఉండనీయ, కాసేపు మాట్లాడించకు ” అని తన గదిలోకి వెళ్ళిపోయింది. ఫ్రెష్ అయ్యి వచ్చిన మహతి బెడ్ రూమ్ లోనే కుర్చీలో కూడా పడింది. మనసు మళ్ళీ గతానికే పరుగు లెట్టబోయింది. ఇంతలో తల్లి కాఫీ తాగడంతో దానికి పుల్ స్టాప్ పడింది. ” ఎలా ఉన్నావు! కారణం చెప్పట్లేదు? చెప్పు తల్లి “అని బతిమాలింది. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయమ్మా ” అంది మహతి. తల్లి నిట్టూర్చి వెళ్లిపోయింది . మహతి మనసు మళ్ళీ ఆలోచనలో పడింది ” ఏమిటి నేను కట్టుకున్న ఆశా సౌధాలన్నీ పేక మేడ లేనా. అది కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయా….'” అనుకొని డాక్టర్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి కన్నీళ్ల పర్యంతమైంది. తనకు బ్లడ్ క్యాన్సర్ అట. ఆరు నెలల కంటే ఎక్కువ బ్రతకనట. రేపు పదేళ్ల నా కొడుకు ఆదిత్య గతేమిటి. తండ్రి మోసం చేసి పోయాడు. నేను కూడా లేకపోతే వాడి గతి ఏమిటి? ఏమి నా జీవితం. అన్నీ అనుకోని అవంతరాలే. ” అనుకుంటూ వెక్కివెక్కి ఏడ్చింది. గతంలోకి ఒకసారి తొంగి చూడవలసిన అవసరం ఏర్పడింది.
చిన్నప్పుడు తనకి క్రికెట్ అంటే మహా ఇష్టం. చదువులో కూడా అన్నిటా ఫస్ట్. చాలా తెలివిగలది కావడం వలన ప్రతి వారిని మెప్పించగలదు,ఒప్పించగలదు కూడా. అందుకే టీచర్లు, స్నేహితులు, తల్లిదండ్రులు కూడా అన్నిటా ప్రోత్సహించేవారు. కానీ అన్న శేఖర్ మాత్రం అంతగా ప్రోత్సహించే వాడు కాదు. మహతి క్రికెట్ మీద ఉండే అభిలాష కొద్ది స్కూలు వాళ్లు ఒక కోచ్ ని కూడా ఏర్పాటు చేశారు. మహతి కెప్టెన్ సీ లో మిగతా టీమ్ అంతా ఫుల్ ఫామ్ లోకి వచ్చింది. ఎలాంటి మ్యాచ్ అయినా ఆటగలిగే స్థాయికి చేరారు. రానే వచ్చింది ఇంటర్ కాలేజ్ స్పోర్ట్స్ డే. అనుకోకుండా ముందు రోజు ఇంటికి తిరిగి వస్తుండగా మహతిని ఒక బైక్ రైడర్ గుద్ధి పారిపోయాడు. అనిత ఎడంకాలు ఫ్యాక్చర్ అయిందని డాక్టర్లు చెప్పారు ” ఇక నీవు ఏ మ్యాచ్ ఆడడానికి వీలులేదు, ప్రక్కన కూర్చుని నీ టీం ని ఎంకరేజ్ చెయ్ ” అన్నాడు కోచ్ మరియు టీచర్లు. ఆ మ్యాచ్ లో స్కూల్ వాళ్ళు రన్నర్స్ కింద నిలిచారు. మహతి మాత్రం చాలా అప్సెట్ అయింది అవకాశాన్ని కోల్పోయి నందుకు. కానీ” జరగవలసింది ఇంతే ” అని సరిపెట్టుకుంది
ఇంటర్ అయిన తర్వాత పిల్లలందరూ కాలేజీ జీవితాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి,ఏ కాలేజీలో చేరాలి, ఏది మంచి కాలేజీ అని ఆలోచిస్తూ ఉంటారు. మహతి కూడా కామర్స్ గ్రూప్ తీసుకుని కాలేజీలో చేరింది. తర్వాత ఎంబీఏ చేయొచ్చు అని ఉద్దేశంతో. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవ్వటం వలన ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని చదువుతానని తండ్రికి చెప్పింది. కూతురు శ్రద్ధ గురించి తెలిసిన వాడటం వలన సరే అన్నాడు తండ్రి. కాలేజీలో చేరిన మహతికి అనిల్ అనే అబ్బాయి పరిచయం అయ్యాడు.అతడు ఎంతో అందంగా, హుందాగా ఉండేవాడు. అతను బిఎస్సి స్టూడెంట్. వారిద్దరూ కలిసి మెలిసి తిరిగేవారు. ఆఖరికి వారు ఒకరిని వదిలి ఒకరు ఉండలేని పరిస్థితి వచ్చారు. కానీ అతను తన అమెరికా వెళ్లాలని అక్కడ ఎమ్మెస్ చేయాలని గ్రీన్ కార్డ్ పొందాలని కలలు కంటున్నాడు. ఇలా కాలేజీ చదువులు అయిన తర్వాత ఎంబీఏ లో చేరింది. అతని విడిచి రెండు సంవత్సరాలు విడిగా ఉండడం కుదరదు గనుక అతని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అన్న శేఖర్కు అది ఇష్టం లేదు ” నువ్వు అతని పెళ్లి చేసుకోవడం సరైనది కాదు ఎందుకంటే అతడు నీకు సరైన జోడి కాదు.” ఉన్నాడు.కానీ దైవ నిర్ణయం ఆగదు కదా. వారి ఇరువురి పెళ్లి అయిపోయింది. యూఎస్ఏ వెళ్లిపోయారు. కొన్నాళ్లు బాగానే గడిచింది మహతికి. వీకెండ్స్ ఎంతో జాలిగా జగడిపారు. మహతి కూడా జాబ్ సంపాదించింది. అసలే తెలివైనది వల్ల అంచలంచెలుగా ఎదిగింది. కానీ అనిల్ లో చాలా మార్పు వచ్చింది. ఇంటికి లేట్ గా రావడం మొదలుపెట్టాడు. ఫోన్ చేస్తే ఎత్తడు. ఇంటికి వచ్చిన తర్వాత అడిగితే బ్యాటరీ డెడ్ అయిందని చెప్పేవాడు. తాగి వచ్చి నానా మాటలు అనేవాడు. అతని మాటల్లో తనకు అర్థమైంది ఏమిటంటే అతను తను ఎదుగుదలను ఓర్వలేకున్నాడు. ఒకరోజు మైకంలో కొట్టాడు కూడా. పునాదిలోని మరో”పేక “కదిలింది. ఆమె మరో ఆమెతో సంబంధం కూడా పెట్టుకున్నాడు అని తెలిసింది. ఇప్పుడు మరో “పేక “కదిలింది. ఇక భరించలేక ఇంటి నుంచి బయటికి వచ్చేసింది. అప్పటికే ఆమె గర్భవతి. ఇండియాలో ఉన్న తల్లి దగ్గరికి వచ్చేసింది. డైవర్స్ కూడా అప్లై చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత అన్న కూడా సపోర్ట్ చేశాడు. జాబ్ సంపాదించుకుని కెరియర్ను మలుచుకోమని చెప్పాడు. జరిగిన ఐదేళ్ల గురించి ఆలోచించకు. నీ జాబ్ గురించి నా ఫ్రెండ్స్ కూడా చెప్పి ఉంచుతాను అన్నాడు. కానీ అదేమీ విచిత్రమో కొంతకాలానికి శేఖర్ కూడా దుబాయ్ లో మంచి జాబ్ వచ్చి వెళ్లిపోయాడు. మహిత మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. బాబు కూడా పుట్టాడు. బాబుని పెంచడం తన గోల్సకి చేరడం ఆమె ముందున్న పరీక్షలు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఎన్నో ఒడిదుడుకుని తెస్తుంది.
మళ్లీ గతంలోకి వస్తే…… క్యాన్సర్ అని తెలిసిన మహతి ఊర్లో పేరు ఉన్న అంకాలజిస్ట్నిని కలిసింది. తన రిపోర్టర్ ని చూపించి ఇంకా ఏమైనా అవసరం అయిన టెస్టులు చేయవలసిన ఉందా అని అడిగింది. ఆమెకు చావాలని లేదు. చావును కూడా తన కెరీర్ లాగా జయించాలనుంది. ” మీ బాధ నాకు తెలుసు మేడం, నేను కూడా యూకే లోని అని ప్రసిద్ధ డాక్టర్ ని కూడా సంప్రదించాను.ఇదిగో ఆయన పంపిన రిపోర్ట్ కూడా ” మహతి ముందుకు తోసాడు. మహతి ” జీవితం అంటే ఇదే కదా. ఈ టెస్టులని డిక్లేర్ చేస్తున్నయి నా జీవితాన్ని ముగింపు వచ్చిందని.” అని మనసులోనే అనుకుంటూ పేపర్లు తెరిచింది. తెలుసుకుంది తన జీవిత ప్రయాణం కొద్ది కాలమేనని. ఇక్కడ ఇంకో పేక ముక్క కదిలింది. ఇంటికి వచ్చి తల్లిని కౌగిలించుకుని ఏడ్చింది. ” అమ్మ మనకి అన్ని ఏర్పాట్లు చేసుకోవడానికి అట్టే టైం లేదు “అంది.” నా జీవితం ఎప్పుడూ ఒడిదుడుకుల బాటే. నీకు తెలుసు కదా నేను ఏడవ తరగతిలో ఉన్నప్పుడు నా డాన్స్ ఆరంగ్రేటము గురించి ఎంత ప్రాక్టీస్ చేశానో. కానీ ఆఖరి రోజు వచ్చేటప్పటికి ప్రాక్టీస్ చేస్తూ పడిపోయి నా మడమ విరగ కొట్టుకున్నా. మరోసారి ఎలక్ట్యూషన్లో పాల్గొనడానికి ఎన్నో రిహార్సస్ చేశాను. రెండు రోజుల ముందు త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి నా గొంతుకు మూసుకుపోయింది. దానికోసం మూడు రోజులు ఏడ్చాను ఎందుకమ్మా నాకు ప్రతి సక్సెస్ ముందు ఇలా అపజయం సాధిస్తున్నాను.” మహతి ఏడ్చేసింది బిక్కెరగా. ” ఎందుకమ్మా అవన్నీ ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నావు. ఏమైంది నీకు ఇప్పుడు బానే ఉన్నావు కదా, జరిగిపోయిన వాటిని గురించి బాధపడకూడదు. మరుపే దానికి మందు. ” అంది అమ్మ. కూతుర్లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు విడాకులు తీసుకున్న, ఎన్నో అపజయాలు ఎదురు చూసినా కూడా చెదరలేదు. ” అమ్మ ఇది అలాంటి సమస్య కాదు నా ప్రాణానికి సంబంధించన సమస్య. నాకు బ్లడ్ క్యాన్సర్ ఎటాక్ అయింది. నేను పది నెలలకి మించి బ్రతకను. దీని సింప్టమ్స్ నాకు కొన్ని నెలల కిం దే కనిపించాయి. తరచుగా జ్వరము,ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతొంది. కానీ నేను క్యాజువల్ గా తీసుకున్నా. ఫిజీషియన్ కూడా కనిపెట్టలేకపోయాడు. ఇది నీవు ఒప్పుకోవాల్సింది నిజం ” అంటూ తల్లిని పట్టుకుని ఏడ్చేసింది. ఇద్దరూ నోట మాట రాక షాక్ లో ఉండిపోయారు. ఒకరికి బాధను ఒకరు అర్థం చేసుకున్నారు. మానస వచ్చే ఆరు నెలల్లో ఒక ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంది ఆఫీసులో. ఇలాగా కొడుకు ఆదిత్య కోసం ఏదైనా చేయాలి. స్కూల్ ప్రిన్సిపాల్ ని కూడా కలిసి తన పరిస్థితి వివరించింది.ఆదిత్య కు ఏదైనా స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉందేమోనని కనుక్కుంది. తన బంగారం, ఫ్లాటు అన్ని అమ్మేసి ఫిక్షడ్ డిపాజిట్ చేసింది ఆదిత్య పేరు మీద. అన్న శేఖర్ ఈ విషయం తెలిసి ఇండియాకు వచ్చాడు. ఆదిత్యను తను కూడా దుబాయ్ తీసుకువెళ్తానన్నాడు. కానీ తన కొడుకు ఒకరి మీద ఆధారపడడానికి ఒప్పుకోలేదు. కాస్త ఆసరాగా ఉండి గైడెన్స్ చెయ్యి అంది. నేను ఉన్నన్ని రోజులు వాడు నాతోటే ఉంటాడు అంది. ఆపైన అమ్మ భగవంతుడు ఉన్నాడు అంది.
కాలం దేనికోసం ఆగదు కదా! దండ వేసి గోడకు వేలాడుతున్న ఫోటోను చూసి తల్లికి ఒక కంటిలో ఏడుపు, మరో కంటిలో ఆనందం కళ కలసి వస్తున్నాయి.
ఎందుకంటే ఇవాళ ఆదిత్య గ్రాడ్యుయేషన్ సెర్మని అని, దుఃఖం మహిత లేకుండా తొమ్మిదేళ్లు గడిచిపోయాయని. ఇంతలో బలమైన చెయ్యి భుజం మీద పడింది. తిరిగి చూస్తే నుగు నుగు మీసాల ఆదిత్య. ” అమ్మమ్మ బయలుదేరుదామా క్యాబ్ వచ్చేసింది ” అన్నాడు. ఆదిత్య కూడా మరోసారి అమ్మ ఫోటో వైపు చూశాడు. ఓటమి ఎరుగని ధీరవనిత కనిపించింది అతనికి. క్యాబ్ ఎక్కిన తర్వాత మనవడి చేతిని చేతిలోకి తీసుకుని” మీ అమ్మ ఒక ప్రవహించేజీవనది నది లాంటిది రా. నదికి కొండలు, కోనలు అడ్డు వచ్చే కొద్ది తీవ్రంగా విజృంభిస్తుంది సముద్రాన్ని చేరడానికి. చేరే చెత్తనంతను పక్కకు రోజు పారేసి నిర్మలంగా పారుతుంది . అలాగే Read అమ్మ కూడా వచ్చిన దెబ్బలు అన్నింటిని ఎదుర్కొంటూ ముందుకు సాగింది. ఆ ప్రయాణంలో ప్రక్కనున్న పొలాలకు కూడా నీరు అందించి వాటిని పోషిస్తుంది. మీ అమ్మ కూడా అలాగే ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నీకు ఎలాంటి లోటు రాకూడదని, నీ కలలను సాకారం చేసుకోవడానికి మార్గం సుగమం చేసి తను వచ్చిన ప్రదేశానికి వెళ్ళిపోయింది . “అన్నారు.”అలాగే అమ్మమ్మ అమ్మలాగ జీవనదిలా ప్రవహిస్తూ పలువురికి ఉపయోగపడుతూ ఉన్నత శిఖరాలకు చేరతాను. అమ్మ పేరు నిలబెడతాను ” అన్నాడు చెమ్మగిల్లిన కళ్ళతో.

Written by Kameshwari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

శతక పద్యాలు. జీవన మార్గ సూచికలు

పద్య పఠనం