తరుణి పాఠకులకు శ్రోతలకు నమస్కారం
గత మూడు వారములుగా శతక కవులు రచించిన శతక పద్యాలు తెలుసు కునే ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగా భాస్కర శతకం లోని మరో రెండు పద్యాలతో మీ ముందుకు వచ్చాను
ఊరు గుణవంతు డొ డ్లు ధన కొండపకారము చేయునప్పుడుం
బర హితమే ఒనర్చు నొకపట్టు నైనను గీడు జే యగా
నెరుగడు నిక్కమే కదా య దే ట్లన గవ్వము బట్టి యెంత యున్
దరువగ జొచ్చినం బెరుగు తాలిమి నీయదే వెన్న భాస్కరా
భావం చూడండి
గొప్ప గుణములు కలవారు తమకు ఎవరైనా అపకారము చేసినా కూడా తిరిగి ఉపకరమే చేస్తారు. దీనికి మంచి పోలికను చెప్పారు మారద వెంకయ్య గారు చూడండి. పెరుగును కవ్వము పట్టి ఎంతగా చిలికినను మనకు వెన్న నే ఇస్తుంది కదా
మరొక పద్యం చూడండి
తెలియని కార్యమెల్ల గడ తేర్చుట కొక్క వివేకి జే కొనన్
వలయు న టై న దిద్దుకొన వచ్చు బ్ర యో జ న మాంద్య మేమి యుం
గలుగదు పాల మందు ది ల కం బిడునప్పుడు సేత నద్దమున్
గలిగిన జక్క జే సికొన గాదె నరుండ ది చూచి భాస్కరా
ఇప్పుడు భావం చూడండి
మనకు తెలియని పని ఏద యినా పూర్తి కావాలి అంటే సరిగా తెలిసిన వ్యక్తి దగ్గరకు వెళ్ళి పని పూర్తి చేసుకోవచ్చు అట్లు గాక అందరినీ అడుగుతూ ఉంటే సమయం వృధాకాదు దీనికి మంచి పోలిక చూడండి నుదుట బొట్టు పెట్టు కోవాలంటే చేతిలో అద్దం ఉంటే సరి పోతుంది మిగిలిన ఎన్ని వస్తువులు ఉన్న కుదరదు
మరో రెండు పద్యాల తో వచ్చే వారం మీ ముందుంటాను