జాగోరే

యధార్థం

        వనపర్తి పద్మావతి

హన్మకొండ చౌరస్తా పాలజెండా నుండి మహిళలు బారులు తీరి ఔవ షaఅ్‌ జీబర్‌ఱషవ అంటూ నినాదాలు చేస్తూ పోలీస్‌ స్టేషన్‌ ముందు దర్నా చేస్తున్నారు.  ఆ నినాదాలు వింటు నేను వెళ్ళి వారితో జతకల్సి ఏమి జరిగిందో తెల్సుకోవాలనే కుతుహలం మొదలైంది.  వివరాల్లోకి వెళ్ళితే 9నెలల పసికందు శ్రీహిత అనే చిన్నారిపై అర్థరాత్రి ఓకామాంధుడు కొలిపాక ప్రవీణ్‌ అనే యువకుడు హత్యచారాం చేసి హత్య చేశాడు.  వింటున్న నాకు ఎడపు ఆగలేదు.  అంతలోనే పాపను పోస్టుమార్ట్‌ ముగించి తీసుకవచ్చారు.  ఆ చిన్నారి కాళ్ళు, చేతులు సాగిపోయి ఉన్నాయి.  చిట్టి పెదవి పై చిన్నగాటు చూస్తుంటేనే రక్తం మరిగిపోయింది.  వెంటనే ఆరాక్షసున్ని ముక్కలు ముక్కలుగా నరికి వేయాలనిపించింది కాని ఆ దుర్మార్గుడు పోలీస్‌ కస్టడీలోకి వెళ్ళాడు ఆ చిన్నారి కన్నవారి రోదన వర్ణించలేము. జరిగిన అన్యాయాన్ని భర్తి చేయలేనిది.

మహిళ సంఘాలు, అఖిలపక్ష మహిళ సమాఖ్యలు కులసంఘాలు ఇంకా యువత జిల్లా స్థాయి రాష్ట్రస్థాయి, రాష్ట్రేతరములు దేశం మొత్తం కదిలింది.  చిన్నారికి న్యాయం జరగాలని ఎట్టకేలాకు 50 రోజుల్లో ఫాస్ట్‌ ట్రాక్‌ కింద దాదాపు 130 మంది సాక్షుల సాక్షాలధారంగా ఆనరరూప రాక్షసుడి (సైకోకిల్లర్‌)కి మరణ శిక్ష విధించడము జరిగింది.

మరణ శిక్ష విదించమని కోర్టు తీర్పునించ్చిన 48 గంటలలోపే ఐదుగురు యువకులు చదువుకుంటున్న వారు తోటి అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించి హత్యచారము చేశారు.  తట్టుకోలేని ఆచిట్టి తల్లి ఇంటికి వచ్చి తనకు తానే మరణశిక్ష వేసుకుంది.

మరో చదువుల తల్లి కన్నవారు లేకున్న ముసలి బామ్మతోడుగా జీవనం సాగిస్తుంది.  తియ్యటి మాటలతో నమ్మించి చేరువు గట్టుకు తీసుకవెళ్ళి జన సంచారం లేని ప్రదేశంలో స్నేహితులతో కల్సి హత్యాచారం చేసి హత్యగావించారు.

ఇలా చెప్పుతుపోతే పసిపిల్లల నుండి ఆరుపదులు దాటిన ముసలి వారు వరకు ఇలాంటి వేధింపులనే ఎదుర్కుంటున్నారు.  వీటి అంతంలేదా ప్రభుత్వము అమలుపరిచే చట్టాలు వున్నాయి.  వాటి వివరాలు ఎంత మంది అమ్మాయిలకు, మహిళలకు తెలుస్తున్నాయి  అంటు నాలో నేనే మదనపడ్తున్నాను.

హయ్‌! రాజీ ఎంటి అలా దిగులుగా కూర్చున్నావు ఎప్పుడు గలగలనవ్వుతు వుండేదానివి నీ మోముపైన ఆ నవ్వులు ఏవీ చెలియా! అంటు నా బుగ్గమీద చిటికవేసింది నాఫ్రెండ్‌ రజని ఈ మధ్య షీ టీమ్స్‌లో చేరింది.    హా ఏమి లేదు అన్నాను కాని నా మనస్సు మాత్రం ఎన్నో రకాల ప్రశ్నలకు జవాబులను వెతుకుతుంది.  రజని నా మనస్సులోని వేధన తరంగాలను పసిగట్టింది.  ఓయ్‌ రాజీ! నీ మనస్సుకు చెప్పు దాని ప్రశ్నలకు జవాబులు నేచెప్తుతాను.  వెంటనే అసక్తిగా రజని ముందు కూర్చున్న టీచర్‌ ముందు విద్యార్థినిగా.

ఈ మధ్య జరిగిన జరుగుతున్న హత్యాచారాల గురించే కదా! నీవు ఆలోచిస్తుంది.  పిచ్చి రాజీ నీకు తెలిసినవి కొన్ని మాత్రమే తెలియనివి చాలా జరుగుతున్నాయి.  ఓసారి పద్మజను కలువు ఎన్ని కథలు చెప్తుందో ఎన్ని కేసులు జనం మధ్యకు రాకుండానే ఫ్యామిలీ కోర్టులో డబ్బులకు లొంగిపోతున్నాయో మనకు తెలియదురా.

అసలు చాలా మందికి ‘చట్టాలు’ గూర్చి తెలియవు రాజీ.  ఒకవేళ తెలిసినా పోలీసుల చుట్టూ తిరగలేక వాళ్ళు మాటిమాటికి గుచ్చిగుచ్చి అడిగె ప్రశ్నలకు సమాధానము చెప్పలేక ఇలాంటి విషయాలు తెలిస్తే అల్లరి అవుతామని కొందరు పోలీసుల దృష్టికే రానివ్వరు గుట్టుగా దాస్తారు.  ఎందుకంటే పెళ్లిళ్ళు అవవని భయం ఒక కారణమైతే, సమాజం చూసే చూపులను, మాటలను తట్టుకోలేకపోవటం మరోకారణం. కొన్ని సందర్భాల్లో బంధువులు కూడా అర్థం చేసుకోకుండా కాకుల్లా మాటల్తో పోడుస్తారు.  ఆభం, శుభం ఓ అమాయకురాలు ఏ తప్పు చేయకుండానే తన జీవితాన్ని బలిచేసుకుంటున్న వారు ఎందరో అబలలు ఉన్నారు నేస్తామా! అలాంటివి మా షీటీమ్స్‌ ద్వారా పరిష్కారం చేస్తాము.  వారి వివరాలు కూడా గోప్యంగా ఉంచుతాము.

పాఠం బోదపడుతున్న దానిలా శ్రద్ధగా వింటున్నాను ఇంక చెప్పమని.  కాలం మారుతుంది.  మరాలికూడా అందుకే కొంత మంది ఆడపిల్లలు ధైర్యంగా న్యాయం కోసం ముందుకువస్తున్నారు.  అన్యాయం చేసిన వారికి శిక్షపడే వరకు శక్తిస్వరూపాలుగా పోరాడుతునే ఉన్నారు.  మనల్ని మనం కాపాడుకోవాలి అంటే కరాటె లాంటి విద్యలు అవసరమున్నది అలాగే ఎదుటి వారిని చంపెయ్యాల్సిన పరిస్థితి వస్తే భయపడతాం శిక్షపడుతుందని కానీ మన ఆత్మరక్షణ కోసం ఎదుటివాళ్ళపైన దాడి చేసినా తప్పు లేదు అలాంటి క్లిష్ణపరిస్థితే వస్తే ఆ వ్యక్తిని చంపేసిన సెక్షన్‌ 100 ప్రకారం మనకు శిక్షపడదు. కాబట్టి అమ్మాయిలు ధైర్యంగా ఎదుర్కొని వారి సమస్యలకు వారే పరిష్కారము చేసుకోవచ్చు.  ధైర్యలక్ష్మిలా రజని అవును నేను కూడా మా కాలేజిలో చుట్టువున్న పాఠశాలల్లో కూడ చెపుతాను అంటు లేచి వటింట్లోకి వెళ్ళి కాఫీ కలిపి చేరో కప్పు తాగుతూ టి.వి. ఆన్‌ చేశాను.

టి.వి. లో బ్రెకింగ్‌ న్యూస్‌ వస్తుంది.  ఓ అమ్మాయి సగం కాలిన దేహంతో అసుపత్రి తీసుక వచ్చారు వాళ్లు ఆ కేసును తీసుకోవడం లేదు ఎందుకంటే పోలీసులు కేసులు అని భయపడుతున్నారు. అసలు విషయం ఏమిటంటే ఆ అమ్మాయి ఒకడు ప్రేమ పేరుతో మోసం చేసి ఫోటోలను వీడియోలు చూపించి బెదిరిస్తున్నాడు.  అందుకోసం హస్టల్‌లో ఉన్న ఆ అమ్మాయి గ్యాస్‌లీక్‌ చేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది ఇది న్యూస్‌ సారాంశం.

ఏమిటి చెప్పు అంటు రజని వైపు  తిరగాను.  అలా గార్డెన్‌లోకి వెళ్దామా! అంది ఓ.కె. అంటు ఇద్దరము నడిచాము. పచ్చని గడ్డి చల్లటిగాలి హాయిగా శరీరాన్ని తాకుతుంది.  కాని మనస్సు మాత్రం హాయిగా లేదు ఆ విషయం రజని గమనిస్తూ ఆ ముఖం అలా వేలాడేసుకోకు ఇటుచూడు అంటూ గులాబిలను చూపిస్తూ అమ్మాయిలు అందమైన గులాభీలాంటి వాళ్లు రాజీ వాళ్ళకు చట్టాలు సెక్షన్లు అనే ముళ్ళు కవచంగా వుండాలి.  చెపుతాను విను అంది.

అత్యాచారానికి గురైన అమ్మాయి లేదా మహిళ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయనంటే ఆ యాజమాన్యం, సిబ్బంది మీద 166 (బి) సెక్షన్‌ క్రింద కేసు వేయవచ్చు తెలుసుకో పిచ్చిరాజీ అంది.  అత్యాచారాలు జరిగినపుడు తల్లిదండ్రులు, పిల్లలు భయపడ్తారు.  వారి పేర్లు బయటికి వస్తే ప్రమాదం కాదా అని మరి దీనికి మార్గం అంటూ ప్రశ్నార్థకం చూశాను.  మంచి ప్రశ్న విను అలాంటి పరిస్థితుల్లో పేరుగాని ఫోటోలు గాని ప్రచురించినా సంస్థ పై కూడా 228(ఎ) సెక్షన్‌ క్రింద చర్యలు తీసుకోవచ్చు రాజీ తల్లి అంటు ఓ మొట్టకాయ వేసింది.  అబ్బా అంటు లేచాను.

ఇంక వుంది కూర్చో చెపుతాను అంది.  సరే చెప్పంటు మళ్లీ కూర్చున్నాను.  మన ప్రమేయం లేకుండా ఏది చేసిన అంటే స్త్రీ శరీరాన్ని లైంగిక ఉద్దేశంతో చూసిన, తాకినా, అవమానపర్చినా ఫోటోలు, వీడియోలు తీసినా 354 సెక్షన్‌ క్రింద ఫిర్యాదు చెసెయ్యవచ్చు.  ఇలాంటివి ప్రభుత్వం మహిళల కోసం చేస్తూ రక్షణగా               ఉంది.  తెల్సు అంటు ఫోన్‌ వస్తే వెళ్ళిపోయింది రజని. ఆమెకు ఆమె భరోసా అన్నట్లుగా రజని మాటలు నాలో ఆత్మవిశ్వాసం కలిగెలా చేసింది.

నేను ఇంట్లోని పుస్తకాలు సెల్ఫ్‌ దగ్గరకు వెళ్ళిన ఎప్పుడో మహిళ చట్టాల గూర్చి రాసిన పుస్తకము వెతుకటము మొదలు పెట్టాను.  నా వెనకలే వచ్చినట్టుంది.  పక్కింటి పార్వతి పిన్ని. అమ్మాయి ఏం చేస్తున్నావే నువ్వు నీ ఫ్రెండ్‌ మాటలు నేను విన్నానులే అవునే పిల్లా ఈ మధ్య పదవ తరగతి పిల్లలు కూడా అదేనే మేజర్‌ కాని వాళ్ళతో మగవాళ్ళు సెక్సు పాల్గొంటున్నారు కదే వాళ్లకు శిక్షలు లేవా? ఉన్నాయి పిన్ని గారు 376 సెక్షన్‌ క్రింద ఏడు సంవత్సారాలు కఠిన కారాగార శిక్ష పడ్తుతుంది.  పిన్ని గారు  ఇదిగో ఈ పుస్తకంలో రాసుంది.  ఈ విషయం మన ఆడవాళ్ళకు తెలియకపోవటం వల్లె అబ్బాయిలు హాయిగా బ్రతికేస్తున్నారే పిల్ల వుండు మా మనవరాళ్ళకు మనవళ్ళకు చెపుతాను. ఇలాంటివి అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు తెలియాలి అంటూ వెళ్లబోయింది పిన్నిగారు.  పిన్నిగారు ఆగండి మారో మాట మొన్న మన పక్కవీధిలోని కోడలిని హింసించారట కదా నిజమేనా పిన్నిగారు.  అవునే తల్లి ఎంచెప్పను ఆ పిల్ల మెతకది.  ఎలా భరిస్తుందో ఆ భగవంతుడికే తెలియాలి.  అంటు రెండు చేతులు జోడించి ఆకాశం వైపు చూస్తూ దండం పెట్టింది.

ఆగండి పిన్నిగారు దానికోసం ఓ సెక్షన్‌ ఉంది.  చెపుతాను విను అన్నాను.  పెళ్ళైన స్త్రీని ఆమెభర్తగానీ, బంధువులుగాని, శారీరకంగా గానీ మానసికంగా గాని హింసించిన, హింస ప్రేరేపించినా, ప్రోత్సహించిన 498 (ఎ) సెక్షన్‌ క్రింద మూడు నెలల జైలు శిక్ష వేస్తారు పిన్నిగారు.  అవునా అలాంటి వాళ్లకు ఇంట్లోనే నరకం చూపించాలే తల్లి మంచిగా చేపుతున్నావు.  ఇంక ఏమున్నాయో చెప్పు అంటుసోఫాలో కూర్చుంది.  మనం వైద్యం కోసం వైద్యుల దగ్గరకు పోతాము.  వారినే ప్రాణదాతలని ఎంతో గౌరవిస్తాం.  కాని వారిలో కూడ కొంత మంది వెధవ బుద్దులు ఉన్నవారు ఉంటారు.  వాళ్ళు మహిళలపై లైంగికంగా వేధించినా 376 సెక్షన్‌ క్రింద ఆ వైద్యులను జైలు ఊచలు లెక్క పెట్టించవచ్చు.  అలాగే ఒక భార్య ఉండగానే మరొకరిని పెళ్ళి చేసుకుంటే 494 సెక్షన్‌ క్రింద ఏడు సంవత్సరాలు శిక్ష గ్యారెంటీగా పడ్తుంది.  అప్పుడు మగవాళ్ళు మరో స్త్రీ వంకకన్నెత్తి చూడరు అంతే కాదు మరో విషయం రోడ్డు మీద తిరిగే జులాయిలు అమ్మాయిలతో అవ మానంగా మాట్లాడినా, సైగలు చేసిన 509 సెక్షన్‌ ప్రకారం శిక్ష వేయవచ్చు.  రాజీ అగవే తల్లి నాకు సంతోషంగా ఉంది.  నేను మావాళ్ళందరికి చెపుతాను అంటూ పిన్నిగారు వెళ్లిపోయారు.  మనస్సులో కొన్ని ప్రశ్నలకు జవాబులు దొరికినా నేను రాబోయే తరానికి జవాబుదారిగా ఉండాలని నిర్ణయించుకున్నాను.

అలా సోఫాలోనే నిద్రపోయాను.  ఎంత సేపు పడుకున్నానో తెలియదు.  బయట కాలింగ్‌ బెల్‌ అదేపనిగా మ్రోగుతుంది.  మెలకువచ్చింది.  టైం 5:30 అవుతుంది.  ఎవరాబ్బ అనిడోర్‌ వోపెన్‌ చేస్తే ఎదురుగా నా ఫ్రెండ్‌ కల్పన దాని కూతురు వచ్చారు.  వాళ్ళను చూడగానే అన్పించింది ఎదో భాదలో ఉన్నట్లుగా.

రండి కల్పన లోపలికి వచ్చి కూర్చోండి.  అంటు సోఫా చూపించాను.  వాటర్‌ బాటిల్‌లో నీళ్ళు ఇచ్చాను.  కాఫీ పెడ్తాను అంటు లోపలికి వెళ్ళాను.  కల్పన కూతురు ఇంటర్‌ ద్వితీయ సం. చదువుతుంది.  నాతోపాటు కిచెన్‌లోకి వచ్చింది. ఆంటీ ఎదైన సహాయం చేయనా అంది.  ఒద్దులేమ్మ! ఎలా చదువుతున్నావు కాలేజికి రోజువెళ్తున్నావా? అంటు అడిగాను ఆఁ! వెళ్తున్నాను కానీ… అంటు ఆగిపోయింది.  ఎంటో చెప్పు తల్లి! మధ్యలో ఆపేశావు ఎందుకు? అన్నాను అంతే కళ్ల వెంట నీళ్లు జారి పోతునే వున్నాయి.  ఎందుకెడుస్తున్నావ్‌ చెప్పు ఎడిస్తె లాభం లేదు పరిష్కారం చూడాలి నీ బాధెంటో చెప్పు అన్నాను భుజం పై చెయ్యి వేసి దగ్గరతీసుకొని అనునయించాను.  ఆంటీ కాలేజ్‌ వదలగానే కొంత మంది అబ్బాయిలు రోడ్డుపై కాచుకుని ఉంటున్నారు.  బయటికి రాగానే పాటలు పాడ్తు ఇబ్బంది పెడ్తున్నారు.  ఆంటీ అమ్మకు చెప్తె కాలేజి మానేయమంటుందని భయం నాకు బాగా చదవాలని ఉంది.  ఆంటీ నువ్వే ఎదైన పరిష్కారము చెప్పు అంది.

ఈ చిన్న విషయానికే అంత బాధపడాలా అవసరం లేదు విను లేదా రాసుకో అంటు పేపర్‌ పెన్ను ఇచ్చాను.  ఎవరైనా పాటలు పాడ్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఒంటరిగా ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టిన 294 సెక్షన్‌ క్రింద శిక్ష వేయించవచ్చు.  తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా వదిలిపెట్టకూడదు ధైర్యంగా ఎదుర్కోవాలి.

ఎవరైనా కావాలని వెక్కిరించినా, అనుకరించినా కూడా 354 (డి) సెక్షన్‌ క్రింద 3-5 సంవత్సరాల శిక్ష వేసే అవకాశం ఉంది మర్చిపోవద్దు. అంటు ఆ అమ్మాయి భుజం తట్టాను.  ఇద్దరం కల్సి కాఫీ కప్పులతో బయటికి వచ్చాము.  కల్పనతో కల్సి తాగాము.

కాఫీ తాగాక కల్పన నేను కల్సి బంగ్లాపైకి వెళ్లాము.  కాసేపు ముచ్చట్లు.  మధ్యలో కల్పన ఇలా అంది మా బాస్‌ ఎందుకో ఈ మధ్య విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు.  ఎవో సైగలు చేస్తున్నాడే నాకు అర్థం కావడం లేదు కాని మా అంటెండర్‌ మణియమ్మను లైగికంగా వేదిస్తున్నట్లు ఎవో ఫోటోస్‌ మాఫింగ్‌ చేసి బెదిరిస్తున్నాడట. నాకు చెప్పుకొని ఎడుస్తుందే దానికేమైన మార్గం చెపుతావని వచ్చాను అంది.

ఓ ఇదా సంగతి అందుకనే కల్పనగారు మాఇంటికి వచ్చింది అన్నాను వెటకారంగా. కాదులేవే నిన్ను చూడలాని కూడ వచ్చాను అంది నవ్వుతు… సరే చెపుతాను విను.  ఉద్యోగము చేసే ప్రదేశాలల్లో ఇబ్బంది కలిగిస్తే ఎడుస్తు వుండటమో లేక లొంగిపోవల్సిన అవసరం లేదు.  2013 సం. వేధింపుల చట్టం ప్రకారం వాళ్ళను దారిలోకి తీసుకరావచ్చు.  వాట్సాప్‌లలో, ఫేస్‌బుక్‌లలో ఆప్‌లోడింగ్‌ ఎంత ఎక్కువయ్యాయో, మార్పింగ్‌ చేసి ఇబ్బంది పెట్టే విధంగా ఇంటర్నెట్‌లో ఫోటోలు పెడుతున్న సంఘటనలు ఎక్కువుతున్నాయి.  సరైన ఆధారాలు మీ దగ్గర ఉంటే 499 సెక్షన్‌ కింద 2సం.లు శిక్ష పడేటట్లు చేయ్యవచ్చు.  అంతేకాదు కల్పన మరో విషయం తెలుసుకో గ్రామాల్లో గిరిజన యువతులను, మామూలు వారినీ కూడా నగ్నంగా ఊరేగిస్తున్నారని వింటున్నాముకదా! అలాంటి పన్లు చేసే వారిపై 354 (బి) సెక్షన్‌ క్రింద 3-7 సంవత్సరాల శిక్ష వేయించవచ్చు.  ఇది 13/2013 సవరణ చట్టం ద్వారా ఈ సెక్షన్‌ ఆధనంగా చేర్చబడింది.  ప్రేమలో మోసపోయి కాని విడిపోయిన తర్వాత అమ్మాయిల ఫోటోలు, వీడియోలు ఎవరికైన పంపిస్తానని బెదిరించిన కూడా 354(సి) సెక్షన్‌ క్రింద 3సం.లు శిక్షపడ్తుంది.  అప్పటికి వాళ్ళు మారకపోతే 3-7 సం.ల దాకా శిక్షతో పాటు జరిమాన కూడ పడుతుందని కాబట్టి అన్ని సెక్షన్స్‌ గూర్చి తెల్సుకుంటే కొన్నింటినైన అరికట్టవచ్చు.

18సం.ల, ఆ లోపు మైనర్‌ బాలికలను ప్రేమ పేరుతో తీసుకపోయి అమ్మేసే వాళ్ళు ఉన్నారు.  అలా కొన్న వారికి 373 సెక్షన్‌ క్రింద 10సం.ల జైలు, జరిమాన వేయవచ్చును.  కొంతమంది జులాయిలు ఫ్రెండ్స్‌ కల్సి లైంగిక దాడి చేయడం, చేయించడము నేరం క్రింద 376(బి) సెక్షన్‌ క్రింద 20 ఏళ్ళు తగ్గకుండా జీవిత ఖైదు శిక్ష పడ్తుంది.  13/2013 సవరణ చట్టం ద్వారా ఈ సెక్షన్‌ సవరించడం జరిగింది.

అమ్మా! నాకో సందేహం అంటూ మా ఇంటి పనామ్మాయి వచ్చింది.  చెప్పు ఇంక ఆలోచన ఎందుకు అన్నాను.  అదేనమ్మ ఈ మధ్య చాలా మంది చిన్న పిల్లలు మాయం అవుతున్నారు కాదా వాళ్ళను తీసుకవెళ్ళి ఇంజక్షన్‌ ఇచ్చి వ్యభిచారంలోకి దింపుతున్నారట! ఆత్యాచారము చేసి చంపుతున్నారు కాదా ఆయేషా అలానే చనిపోయింది. వీరికి శిక్షలు లేవా క్యాండిల్‌ ర్యాలీలు మాత్రమేనా చెప్పండమ్మా అంది.  చాలా మంచి విషయాలే అడిగావు నీకు లోకజ్ఞానం వుందే లక్ష్మి అన్నాను నవ్వుతూ.

చెప్పండమ్మ అంటు నా ముందు కూర్చింది.  మైనర్‌ బాలికలను వ్యభిచారానికి ప్రోత్సహించి, ప్రలోభపెట్టిన 366(ఎ) క్రింద పదేళ్ళు శిక్ష జరిమానా పడుతుంది.  బలవంతంగా ఎత్తుకెళ్లి పెళ్ళి చేసుకోవాలన్నా 366 సెక్షన్‌  క్రింద 10సం.లు జైలు శిక్ష వెయించవచ్చు. గర్భవతులను రేప్‌ చేసిన ఆ ప్రయత్నంలో ఆమె మరణించినా, ఆమె గర్భంలోని శిశువు మరణించినా 316 సెక్షన్‌ క్రింద 10సం.లు జైలు శిక్ష పడ్తుంది. అర్థమయిందా లక్ష్మి గుర్తుపెట్టుకో… ఆఁ ఆఁఁ వెళ్ళి పన్లు చూడు మాటల్లోపడి పనిచేయకుండపోకు అంటు నేను లోపలికి వెళ్ళాను తృప్తిగా….

మరుసటి రోజు ఉదయమే మెలకువ వచ్చిందికాని చిరుజల్లు వర్షం పడ్తుంది.  పాలవాడి కోసం చూస్తున్న ఇంతలో ఇంటికి దగ్గరల్లో జనం గూమిగూడి వున్నారు.  కొంత మంది ఎడుస్తున్నారు.  మరికొంత మంది కోపంతో ఉన్నారు.  పిల్లలను కనగానే సరిపోదు వారి మంచి చెడ్డలు చదువులు కూడా చూసుకోవాలి.  లేకపోతే మన పిల్లలను మనమే నాశనము చేసుకుంటాము పెద్దవాళ్ళె పిల్లలకు కరదీపికలు అనే విషయం మర్చిపోయి కుటుంబ సభ్యులు గొడవలు పెట్టుకుంటే పసి పిల్లలు ఎమైపోతారు.  వారికెమన్నయితే ఎవరికి చెప్పుకుంటారు.  అందుకే ఈ రోజు ఈ పసిది చచ్చిపోయింది.  అంటు పెద్దగా అరుస్తుంది ఒకావిడ.

అసలు విషయం తెల్సుకోవాలని వారి వద్దకు వెళ్లాను.  పాపం ఆచిన్నారి నలిగిపోయినట్లుంది.  శరీరముపై గాట్లు రక్తపు మరకలు ఉన్నాయి.  నిర్జీవంగా ఓ పసిప్రాణం గాలిలో కల్సింది.  ఇది ఎవరిఘోరం, ఎవరు చేసిన అన్యాయం. నేరం ఒకరిది శిక్షమరొకరిదా! బాధగాను భయంగాను వుంది భావి పౌరులు ఏమౌతారో అని.  డాక్టర్‌ పరీక్షలు జరిగాయట అమ్మాయిపై అఘాత్యము జరిగినట్లు తెలింది.  తల్లిదండ్రులు బంధువులు, స్నేహితులు బాధపడ్తున్నారు.  నిందితుడికి శిక్ష పడ్తుంది.  కాని ఆ పసిపాపరాదు కదా!

ఆలోచనలు మెదడు నిండ ఉన్నాయి ఆసలు ఎం జరిగిందో తెల్సుకోవాలి.  అనే ఆలోచన ధృఢంగా ఉంది.  నెమ్మదిగా సమాచార సేకరణ మొదలైంది.  అమ్మా నాన్నల గొడవల మధ్య విసిగిపోయిన పసిపాప తన బాబాయికి దగ్గరైంది.  బాబాయి కూడ ఆ చిన్నారిని ప్రేమగా చూసుకునే వాడు.  బొమ్మలు, చాక్లెట్స్‌, ఐస్‌క్రీంలు కొనిపెట్టేవాడు చదువులోను సహాయం చేసేవాడట అందుకే తండ్రికన్న బాబాయికే దగ్గరై చనువు పెరిగింది.  కొన్ని సంవత్సరాలు గడిచాయి.  చిన్నారిలో శారీరమార్పులు రావడం మొదలైంది.  బాబాయి ఆలోచనల్లో మార్పులు వచ్చాయి.  విచిత్ర చేష్టలు మొదలైనవి.  తల్లీతో చెప్పిన వినే పరిస్థితిలో లేదు. తండ్రి విషయం వేరే చెప్పనవసరం లేదు.  బాబాయిలో కాముఖుడు నిద్రలేచాడు.  చిన్నారిలో మౌనం చోటుచేసుకుంది.  చదువులో వెనుకబడిపోయింది.  స్కూల్‌ నుండి తల్లికి ఫోన్‌ వచ్చింది.  ఫలితంగా చిన్నారికి చావు దెబ్బలు బహుమతిగా ఇచ్చింది ఆ తల్లి.  తండ్రి తిట్ల వర్షం కురిపించాడు.  అదే అదునుగా రెచ్చిపోయాడు బాబాయి అనబడె మృగాడు.  తెల్లవారింది.  లేవలేని స్థితిలో చిన్నారి నడవలేకపోతుంది.  కింద కూర్చోలేకపోతుంది.  అన్ని చూస్తుకూడ తల్లిలో చలనం లేదు పైగా తిట్లు ఏమి చేయలేని నిస్సహయస్థితి జ్వరంతో ఒళ్లుకాలిపోతుంది.   వదలని మృగం పంజా విసిరింది చిన్నారిని అంతం చేసేదాకా.

అమ్మనాన్నలారా! తొమ్మిదినెలలు కడుపులో దాచుకున్న బిడ్డను భూమి మీదకు వచ్చాక కండ్లల్లో పెట్టుకొని చూడండి చట్టాలు ఉన్నాయి శిక్షలు ఉన్నాయి కాని అన్యాయం జరిగిన తరువాతే కదా! మనబిడ్డలను మనమే కాపాడుకోవాలి.  3సం.ల నుండి అమ్మనాన్న తప్పమరొకరు తాకనియకుండ చూసుకోవాలి.  పరిచయం లేని వారివద్దకు పిల్లలను వెళ్లనీయవద్దు.  ఎక్కడికి వెళ్లిన తల్లి సమక్షంలోనే ఉండాలి.  సమాజంలోని మనం కూడ ఏ బిడ్డ అయినా మన ఆడకుతూరే అన్నట్లుగా భావించిన నాడు కొంత వరకు అత్యాచారాలను తగ్గించవచ్చును.  ఎవరు లేరనుకున్న వాళ్ళు ‘షీ’ టీమ్స్‌ను సహయము కోరవచ్చు. టోల్‌ ఫ్రీ నెంబర్స్‌ మరికొన్ని ఫోన్‌ నెంబర్స్‌ ప్రతి ప్రభుత్వ పాఠ్యపుస్తకాలలో ముద్రించబడినాయి.  అమ్మాయిలు, మహిళలు షీ టీమ్స్‌ సహాయం తీసుకోవాలి.  భయపడితే బలి అవుతాము.  తెలివితో మసులుకుంటే సబలగా నిలిచిపోతాము.

తస్మాత్‌ జాగ్రత్త!

 

Written by Vanaparti Padma

వనపర్తి పద్మావతి, హన్మకొండ

9949290567

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నులివెచ్చని గ్రీష్మం

శతక పద్యాలు. జీవన మార్గ సూచికలు