మన మహిళామణులు

శ్రీమతి రేవూరు శోభాదేవి

ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దారనేర్పించినన్‌.. అందరికీ తెలుసు.పెళ్ళికి ముందు అమ్మ నాన్నల ప్రోత్సాహం పెళ్లి తర్వాత భర్త ప్రేరణ ప్రోత్సాహం లభించడం ఆమె అదృష్టం పూర్వజన్మ సుకృతం.పందిరికి అల్లుకున్న పూలతీగెలాగా ఆమె గృహిణి గా తల్లిగా సాహితీ వేత్త గా ఎదిగారు.ఆధ్యాత్మికరంగంలో రాణిస్తున్నారు.భర్త ప్రోత్సాహం వల్లనే ఇదంతా సాధ్యం ఐంది అంటారు.ఆమహిళామణి‌ శ్రీమతి రేవూరు శోభాదేవి గారు!

భర్త అండదండలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి సాహిత్యం ఆధ్యాత్మికజీవితం జోడు గుర్రాలులాగా సాగుతూ పోతున్నాయి.అమ్మమ్మగారి ఊరు కరేడు.తల్లికి 15 ఏళ్ల వయసులో శోభపుట్టారు. చాలా బలహీనంగా ఉండే ఆపాప ప్రకృతి చికిత్స ఇతరవైద్యాలతో త్వరగానే కోలుకుంది.


ఇక బంధువుల రాక పోకలుతో ఇల్లు సందడిగా ఉండేది.తమ్ముడు ఈమె సరదాగా గడిపారు బాల్యంని.పాడిపంటలతో అలరారే అమ్మమ్మ గారి ఇల్లు నిత్యకళ్యాణం పచ్చతోరణం! పెద్ద బేసిన్ లో అన్నం కలిపి ఎవరో ఒకరు కథలు చెప్తూ పిల్లలచేతిలో అన్నం ముద్దలు పెట్టడం ఆనాటి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పారిజాత పూలు ఏరితాటినారతో‌ గుచ్చి దేవాలయం లో ఇవ్వడం మధురస్మృతులు.ప్రతి పండుగ సంబరాల తో అంబరాన్ని అందుకున్న రోజులవి.సంక్రాంతి పండుగ సందడే సందడి.అమ్మవారిని కుమ్మరింటినుంచి తెచ్చి పూజలు చేయడం ఆఖరున
అమ్మ వారి వాలాడింపు ఆనాటి సందడి సంబరాలు నేటి తరానికి తెలీవు.రాజమండ్రి దుంపలబడిలో చదివిన ఆమె వక్తృత్వ వ్యాసరచన పోటీల్లో పాల్గొనటం బహుమతులు పొందటం ఆనందంగా గడిపిన విద్యార్ధి జీవితంలో మరువలేని ఘట్టం.జీవనదాతసూర్యుడు అనే పుస్తకం ని బహుమతిగా పొందారు.పి.యు.సి.లో బైపిసి చదివి బి.ఎ.ఫస్ట్ ఇయర్ లో ఉండగానేశ్రీ రేవూరు అ…శోభ గారి మాటల్లో ఆమె అనుభవాలు చదువుదాం.”మావారు ఢిల్లీ లో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గా ఉన్నప్పుడు దాదాపు అన్ని పుణ్య క్షేత్రాలు సందర్శించాము.ఆనాటి సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ శ్రీ శేషన్ గారి సతీమణి జయలక్ష్మి శేషన్ గారు మాకు 60రాగాల్లో నారాయణీయం నేర్పించారు.


కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వారి సీనియర్ ఫెలోషిప్ లభించింది.అన్నమాచార్య కీర్తనలపై 3 పుస్తకాలు నేను రాసినవి తి.తి.దే.వారు ప్రచురించారు.అన్నమయ్యభక్తిసామ్రాజ్యం అన్నమయ్య సంకీర్తనా సౌరభం జీవనప్రస్థానం “సంభవామి యుగే యుగే”లో దశావతారాల అంతరార్థం ని వివరించాను.40ఏళ్లు రేడియో ప్రసంగాలు చేయడం మరుపురాని అనుభూతి.ఆరాధన సప్తగిరి వేదాంత భేరి ఇంకా చాలా పత్రికల్లో నా రచనలు పుంఖానుపుంఖాలుగా వచ్చాయి.ఇక మేము ఢిల్లీ లో ఉండగానే దాదాపు అన్ని పుణ్య క్షేత్రాలు దర్శించాము.నాకు ఓ అద్భుత అనుభవం కల్గింది గోవర్ధన గిరి ప్రదక్షిణ చేసినపుడు.రాధాకుండ్ కృష్ణ కుండ్ మధ్య దూరం 21కి.మీ.చీకటితోనే లేచి బైలుదేరాం.అక్కడ ఓపెద్ద బండరాయి మధ్యలో‌రంధ్రం ఉంది.ఎందుకో నాకు అందులోంచి దూరి బైటికి రావాలని పించింది. కంతలో దూరాను.కానీ మధ్యలో‌ఇరుక్కు పోయాను.మాబృందం ముందు వెళ్లి పోతే ఒంటరిగా ఈ సాహసం చేశాను.దూర…
ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక మావారు ఎస్.వి.బి.సి.ఛానల్ కి ఓరూపం తేగలిగారు. తిరుపతిలో బ్రహ్మోత్సవాల్లో కోలాటాలు పాటల్లో పాలు పంచుకున్న భాగ్యం దక్కింది.
ఇక మావారితో కల్సి 2008 లో నెవార్క్ లో ఆటాసభలో పాల్గొన్నాను.ఒక కథకి నేను రాసిన ముగింపు కి100డాలర్ల పారితోషికం అందుకున్నాను.వంగూరి చిట్టెన్ రాజు గారు సృజించిన పోటీ అది.
మావారి ఉద్యోగరీత్యా సాహితీ వేత్తలు సినీనటులు ఎంతోమంది మాఇంటికి అతిథులు గా రావడం వారితో పరిచయాలు ముచ్చట్లు మరువలేని మంచి గంధపు పరిమళాలు.
ఇక ఆధ్యాత్మిక రంగానికి చెందిన పుష్పగిరి స్వాములు శుకబ్రహ్మాశ్రమ విద్యాప్రకాశానందగిరి వారు సుందర చైతన్య విశ్వయోగి విశ్వంజీ ఆశీస్సులు పొందాంమేము. వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి 2017 లో మాదంపతులను సత్కరించారు.” ఇలా ఎన్నో విషయాలు కలబోసుకున్న శోభాదేవి దంపతులకు ఓకుమార్తె ఇద్దరు కొడుకులు మంచి స్థితిలో ఉన్నారు.లౌకిక ఆధ్యాత్మిక రంగాల్లో శోభ అనంతపద్మనాభ రావు గార్లు తెలుగు వారికి ఆదర్శజంట.పూవుకి తావి అబ్బినవిధంగా శివశివానీలుగా
దీర్ఘ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు సాహిత్య భక్తి రంగాల్లో సేవలు అందించాలని తరుణి ఆశిస్తూ సెలవు తీసుకుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

భలే…. భలే వర్షం

“పిల్లలు – ఆర్థికపరిస్థితులు”