” కాలం నింద”

కవిత

కె. భానుజ ఎం.ఎ. తెలుగు

అంతటా అల్లకల్లోలం
అనుదినం ఎదురవుతున్న
దృశ్యాలు రోజువారిగా
అడుగున పడిపోతుంటాయి
ఏమి జరగనట్టు
ఎంత ఉన్నతస్థానంలో ఉన్నా
ఆడదానిగా ఆ నిమిషం
ఊపిరిబిగపట్టేలా చేస్తాయి
న్యాయం నడివీధిలో
నన్ను నిలబెడుతుంది
చుట్టుప్రక్కలా పలకరింపులు
చిల్లరమాటలు
ఓదార్పును కూడా
ఒంటరి చేసేస్తాయి
అయినా….
ఎదిరించి ముందుకెళ్ళా
పోరాటం చేయడానికి

అక్కడ కూడా….
అణచివేసే అడుగులకే పట్టం
అందెలమెక్కిన వారిదే పైచేయి
తప్పులు ఒప్పులు
ఒప్పులు తప్పులుగా
సవరించబడతాయి
రాజకీయం , పలుకుబడి
ఉంటే మారిపోతుంది
న్యాయవ్యవస్థ కూడా
కాలం నిందను మోస్తున్న
చిన్న బ్రతుకులు
అక్కడ అమ్ముడుపోతుంటాయి
మన కళ్ళెదుటనే
మటుమాయం సాక్యం
నిరూపించమంటే
నిలబడలేని బతుకులు
ఏడుస్తూ సాగుతుంటాయి
కాలం గతి చెల్లిందని
దేవుడి వైపు చూస్తూ మౌనంగా

Written by Bhanuja

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నాయకత్వం – మహిళలు The woman power

నేటి తరం