ఈ పురుషాధిక్య సమాజంలో తనదైన స్థానాన్ని నిలుపుకోవడం, నిలిచి గెలవడం మహిళ లకు అంత సులభమేమీ కాదు. అయినా ఎక్కడా తగ్గడం లేదు. ప్రయత్నం….. ప్రయత్నం …. ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
విద్యా వైజ్ఞానిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ అపారమైన శక్తి ను ప్రదర్శిస్తున్నారు. రాజకీయాల్లోకి యువతకు మంచి భవిష్యత్తు ఉంది. సీనియర్ పొలిటికల్ లీడర్స్ ను ఆదర్శంగా తీసుకుని , ప్రపంచ రాజకీయ నాయకుల చరిత్ర నూ తెలుసు కుని, తమదైన శైలిలో మార్పులు చేర్పులు చేస్తూ ముందుకు వెళ్లాలి.
మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో, 440 మంది బీజేపీ నాయకులలో 69 మంది మహిళలు అంటే 16% మాత్రమే నిలుచున్నారు . వీళ్ళలో 30 మంది విజయం సాధించారు.అంటే 43%. ఇక కాంగ్రెస్ లో 327 సభ్యులలో 56 పోటీ చేస్తే 41 మంది మహిళా నాయకులు గెలిచారు.. , అంటే 13% మాత్రమే నిలుచున్నారు. దేశంలో ప్రముఖమైన పార్టీలుగా వీటిని తీసుకున్నప్పుడు కాకుండా మిగతా మరికొన్ని , టి ఎం సి లో 11 మంది, సమాజ్వాది పార్టీలో ఐదుగురు, డీఎంకే లో ముగ్గురు జే డి యు లు ఇద్దరు ఆర్చేడిలో ఒక్కరు ఎల్జి లో ఇద్దరూ అప్నా దళ్లో ఒక్కరు టిడిపి నుంచి ఒక్కరు వైయస్సార్ పార్టీ నుంచి ఒకరు ఎన్సిపి నుంచి ఒక్కరు, మరో పార్టీ నుంచి ఒక్కరు మాత్రమే స్త్రీలు లోక్సభకు ఎన్నుకోబడ్డారు. ఇవి లెక్కలు గ్రాఫ్లు చెప్పడానికి కాదు. గ్లోబల్ ర్యాంకింగ్ లో ప్రయత్నాల కొరకు కాదు. స్త్రీల సాధికారత కొరకు ఎన్ని ప్రయత్నాలు ఎన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా సాగుతున్న చరిత్రను కదా. కానీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్న వాళ్ళు స్త్రీల శాతం అధికంగా ఉంది.
గెలిచిన ఈ మహిళ నాయకులలో ఎంతమంది మంత్రివర్గంలో ఉన్నారు , ఇంతమంది ఏడుగురు మాత్రమే ఏడుగురు మహిళలకు మాత్రమే స్థానం దక్కింది. నిర్మల సీతారా మన్, అన్నపూర్ణ దేవి ఈ ఇద్దరికి మాత్రమే క్యాబినెట్ హోదా దక్కగా, మిగతావారు సహాయం మంత్రులుగా పదవించే పట్టారు, అంతే.
సావిత్రి ఠాకూర్ రక్షా ఖడ్సే, శోభాకరంద్లాజె, నిముబెన్ భడిణియా, అనుప్రియ పటేల్ వంటి కొందరికి స్థానం దక్కింది. కంగనా రనౌత్, హేమమాలిని కుమారి సెల్జీ, సుప్రియా సూలే, డింపుల్ యాదవ్, ఇక్రా ఛౌదరి, కనిమొళి, మొహాయ్ మైత్రి వంటి మహిళా నాయకులు విజయం సాధించిన వారు. వీరంతా ఏ ఒక్క పార్టీకి చెందిన వాళ్ళు కాదు వివిధ పార్టీల వాళ్ళు. ఇక్కడ ఏ పార్టీ వాళ్ళు ఎంతమంది గెలిచారు అనే లెక్క కొరకు కాదు ఈ విజయం తో ఇంతమంది గెలుపుతో సరిపోతుందా చాలా అనే ప్రశ్నకు వైపైతే మరోవైపు ప్రపంచం వైపు చూపును సాధించాల్సిన అవసరము ఎంత అని ప్రశ్నలు కొడవళ్ళెత్తాలి.
భారత రాజ్యాంగం ఎంతో విశిష్టమైనదని పేరు. సర్వోత్కృష్టమైన చట్టమని పేరు. గణతంత్ర ప్రతిపత్తి వచ్చినప్పటినుంచి ప్రభుత్వానిర్మాణమూ,పరిపాలన శాసన వ్యవస్థ కార్యవర్గ నిర్వాహక వ్యవస్థ న్యాయవ్యవస్థ వంటి ఎన్నో వ్యవస్థలను ఏర్పరచుకొని వాటి అధికారాలు బాధ్యతలు వాటి మధ్య సమన్వయాలు అన్ని నిర్దేశించుకుంటూ సాగేటువంటి మన రాజ్య వ్యవస్థ లో స్త్రీల ప్రాతినిధ్యం ఎంత అనే ప్రశ్న వేసుకున్నప్పుడల్లా సంభ్రమానికి లోను కావలసి వస్తుంది.
ఇంకా 33% రిజర్వేషన్ బిల్లు ఆమోదం విషయాన్ని మాత్రమే చెప్పుకోగలుగుతున్నామే కానీ సమాజంలో పురుషుల స్థానం స్త్రీల స్థానం సమానమే అనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక 33 శాతానికే ఆమోదన రాలేదు అమలులోకి రాలేదు ఇక 50% కి ఎన్నడు వస్తాం అని చదువుకున్న స్త్రీలందరూ ప్రశ్నిస్తున్నారు. మొన్న జరిగిన 18 లోక్సభ ఎన్నికల్లో మహిళా సభ్యులు ఎంతమంది ఉన్నారు ఎంతమంది పోటీ లో నిలుచున్నారు ఎంతమంది గెలిచారు గెలిచిన వాళ్లలో ఎంతమందికి తగిన స్థానం చట్టసభల్లో ఇచ్చారు ఒకసారి ఆలోచించుకోవాల్సిందే.
797 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేయగా 74 మంది మాత్రమే విజయం సాధించారు
రాజకీయాల్లోకి అడుగు పెట్టాలంటే ధైర్యం ఉండాలి. బడుగు వర్గాలకు మేలు చేయాలన్న శ్రద్ధాసక్తులు ఉండాలి. కుటుంబ పాలన , దేశ పాలన రెండు సమర్థవంతంగా నిర్వహించగలరు మహిళలు.
జర్మనీ మహిళా ఛాన్స్లర్ విషయం మనకు తెలిసిందే. నాలుగు తడవలు నేను ఈ పదవిని నిర్వహించాను.ఇక నేను చెయ్యను అని చెప్పి పోటీ లో నిలబడలేదు.ఇదీ గొప్పతనమంటే.
దాదాపు 1876 లలో స్వాతంత్ర్యం వచ్చిన అమెరికా దేశంలో ఈ 200 ఏళ్ళ నుండి ఒక్క మహిళ కూడా దేశ ప్రధాని కాలేదు.
బ్రిటిష్ లో మార్గరేట్ థాచర్
గోల్డా మేయర్ ఇజ్రాయెల్ దేశం లో ఉన్నారు. మొదటి ప్రధాని గా శ్రీలంక లో సిరిమావో బండారునాయకే పదవి నుంచి చేపట్టారు.ప్రపంచంలో గొప్ప పేరున్న అగ్రరాజ్యమైన అమెరికా కంటే కూడా మనదేశంలో మహిళలకు ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. రెండు వందల ఏళ్ళ క్రితమే స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్న, అమెరికాలో చాలా ఏళ్ల వరకు మహిళలకు ఓటు హక్కు లేదు . ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత ఓటు హక్కు వినియోగించుకునే హక్కును పొందారు. అటువంటిది రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ పరిపాలన తర్వాత 1947 లో స్వాతంత్రం సంపాదించుకున్న తర్వాత, మొదటి ఎన్నికలలోనే స్త్రీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని ఏర్పరచడం గొప్ప చరిత్ర మనది. ఇన్నేళ్లుగా రాజకీయ రంగం అంటే ఏంటో తెలిసి ఎన్నికలంటే ఏంటో తెలిసి ఓటు హక్కు విలువ తెలిసి వినియోగించుకుంటున్న స్త్రీలు ఇంత పెద్ద మొత్తంలో పెద్ద శాతం లో ఉన్నా కూడా ఇంకా చట్టసభల్లో సీట్లు మాత్రం రావాల్సినంతర రావడం లేదు. కారణం ఏమై ఉంటుంది? మహిళల విస్తృత ప్రాతినిధ్యం అవసరం ఉంది అవకాశాలేని ఇవ్వడం లేదు అనే తెలుస్తూనే ఉంది. ఓవైపు సమాన హక్కులు ఇస్తున్నామని అంటూనే మరోవైపున స్త్రీలను అణచివేస్తూ ఎదగనివ్వరు..
జి 7 దేశాల శిఖరాగ్ర సదస్సు సమావేశంలో జార్జియా మెలోని ,
Georgia Meloni 1992 నుండే తన రాజకీయ ప్రస్థానం కొనసాగించింది. 2022 లో ఇటలీకి మొదటి మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు జార్జియా మెలోడీ హృదయంలో ఎన్ని ఆలోచనలు మొలిచి ఉండవచ్చు? ఈ గుడి మనసులను గెలిచి ఈ అన్యాయాల అక్రమాల పురుషవ్యవస్థను దాటి నిలిచి గెలిచిన మహిళ ప్రధానిగా తన పార్టీ అయినా మితవాద పార్టీకి న్యాయకత్వం వహించిన మెలోడీ ఎంతమందికి ఆదర్శమై ఉండవచ్చు? ఆమె 15 ఏళ్ల అప్పుడే యూత్ ఫ్రంట్ అనే సంస్థను ప్రారంభించి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. యువజన మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అప్పటినుంచి ఎన్నో ముఖ్య అంశాల్లో కీలకమైన మార్పులను తీసుకువచ్చిన మెలోని అలా 20 22లో ఫస్ట్ వుమెన్ ప్రైమ్ మినిస్టర్ గా అధికార బాధ్యతలు చేపడతానని అనుకున్నదా? కానీ ప్రధానమంత్రి అయింది, పలువురికి మార్గదర్శి అయింది. అందుకే మొన్నటి “జి 7 ” సదస్సులో ఆకట్టుకుంది.
ఆమె 1977 జనవరి 15 న ఇటలీలో జన్మించింది. విద్యార్థి దశ నుండే student action లో చురుకుగా పాల్గొని స్టూడెంట్ మూమెంట్ ని జాతీయస్థాయిలోకి తీసుకువచ్చింది. ఆమె Christian. conservative చెందిన స్త్రీ. సంప్రదాయ వాది. ” God, fatherland, add family” అనేవి నమ్ముతుంది. స్త్రీవాదానికి ప్రాముఖ్యత ఇస్తూనే, ఈ గ్లోబలైజేషన్లో స్త్రీలు పడే కష్టాలను ఏ విధంగా చూడాలి అనేది ఆమెకు బాగా తెలుసు. ఇలాంటి వాళ్ళు సమాజానికి కావాలి.
స్త్రీలు ఉద్యోగాలు చేస్తూ ఇంటిని చక్కదిద్దేందుకోవడం చూడటం లేదా ఈ సమాజం? తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం, ఓపికగా సమస్యలు అధిగమించడం స్త్రీ లకు తెలిసినంత ఎవరికి తెలుసు?
అటువంటిది రాజకీయాలను నేర్చుకొని పగ్గాలు పట్టి బండిని నడపలేదా? భారతదేశానికి ప్రధానిగా ఇందిరా గాంధీ ఎంత గొప్ప చరిత్రను సృష్టించారు ఈ లోకానికి తెలియదా? ఈ రంగంలోనైనా అవకాశం వస్తే తనను తాను నిరూపించుకోగల శక్తిమంతురాలు స్త్రీ అని ఈ పురుష సమాజానికి తెలియదా ? తెలుసు ! అయినా గాని రాజకీయాలలో స్త్రీలు ఎక్కువమంది వస్తే తమ ప్రాబల్యం తగ్గిపోతుంది అని వాళ్ళకి భయం. ఎత్తులు జిత్తులు తెలిసిన జాతి అది. పురుష జాతి అది.
ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా పదవులు చేపట్టిన మహిళలపై కుటుంబం ఒత్తిడి ఉంటుంది.భర్త ,కొడుకులు డామినేట్ చేస్తూ ఉంటారు. తనదైన శక్తియుక్తులను నిరూపిస్తూనే ,వాళ్ళ మాటలను వింటూనే ,కార్యకర్తలను సమాధానపరుస్తూనే ,పార్టీ అధికార నాయకులతో సమన్వయం చేస్తూనే ,సత్తా చాటుకున్న మహిళ రాజకీయ నాయకులు ఎందరో ఉన్నారు. వాళ్లని ఆదర్శంగా తీసుకొని ఇంకా ఇంకా ముందుకు వెళ్లాలి రాజకీయ నాయకులు గా ఎదగాలి. యువతులు ముందుకు రావాలి. చదువులలో ,క్రీడలలో ,సామాజిక రంగంలో ,రాజకీయ రంగంలో అన్ని రంగాలలో యువతుల పాత్ర ఎక్కువగా కావాలి. తమకి ఇష్టమైన చదువును చదువుకొని డిగ్రీలు సంపాదించినా సరే స్టూడెంట్ యూనియన్ లో పాల్గొనకున్నా సరే, దేశ సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనడానికి సమాయత్తం కావాలి. ప్రపంచ చరిత్రను చదవాలి మన దేశ చరిత్ర చదవాలి. ప్రస్తుతం అనే అద్దంలో చరిత్ర ఆనవాళ్లను వెతకాలి. నీడలూ మాట్లాడతాయి , చీకటి వేధింపులను మట్టు పెడతాయి . కాలం ఎప్పుడూ ఒక్కతీరున ఉండదు. మహిళలు తమ శక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. The woman power అంటే ఏమిటో నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. రంగుటద్దాలతో చూడకుండా రాజకీయాలు అనే స్వచ్ఛమైన రాజనీతి తంత్రంలో భాగస్వాములు కావాలి.