ఆరోగ్యాని ఆది సూత్రం
ఆలోచనలకు మూలసూత్రం
ఆనంద జీవనానికి ఆహ్లాద మార్గం
యోగ…
సంపూర్ణ ఆయుష్షుకు స్నేహం
పరిపూర్ణ ఆరోగ్యమునకు అనుబంధం
సువర్ణ జీవితమునకు అనుకూలం
యోగ…
ఆధ్యాత్మిక ప్రసాదం
శారీరక దృఢత్వ బలం
భారతీయ విశిష్ట వైభవం
యోగ…
నయమవుతది రోగం
కలిసొస్తది భోగం
యోగాయే యాగం
యోగతో పరిపూర్ణ జీవనం సాధ్యం…
పతంజలి ప్రసాదితం
ప్రయోగాల ఆసనకర్మగారం
ఆదిదేవుడి ఓంకారం శబ్దాకారం
ముక్తిని నిచ్చే సుగమనం
ప్రపంచం పాటించే పరమపధం
యోగ…