తరుణి పాఠకులకు నమస్కారం. గత రెండు వారాలుగా భాస్కర శతక పద్యాలు తెలుసు కు నే ప్రయత్నం చేస్తున్నాం అందులోభాగం గా ఈ వారం మరో రెండు పద్యాల తో మీ ముందుకు వచ్చాను.
దానము సేయ గోరిన వదా న్యున కీయగ శక్తి లేనిచో
నైన బరోప కారమునకై యొక దిక్కున దెచ్చి యై న నీ
బూను ను మేఘు దంబుదికి బోయి జలంబుల దేచ్చి ఈయడే
వాన సమస్త జీవులకు వాంచిత మింపెస లార భాస్కరా
ఇప్పుడు భావం చూడండి
ఎవరికైనా సహాయం చేయాలనుకునే దాతకు తన దగ్గర సొమ్ము లేక పోయినా ఇంకొకరి దగ్గర తీసుకుని వచ్చి సహాయం చేస్థాడు. మేఘం తన దగ్గర నీరు లేక పోయినా సముద్రం దగ్గరకు పోయి తెచ్చి సమస్త జీవులకు సంతోషం కలిగే టాట్లుగా వాన నిస్తుంది.
ఇప్పుడు మరొక పద్యం చూద్దాం
భూపతి కాత్మ బుద్ది మది బుట్టని చోట బ్రదాను లెంత ప్ర
జ్ఞా పరిపూర్ణులైన కొనసాగదు కార్యము కార్య దక్షులై
యోపిన ద్రోణ భీష్మ కృప యోధులనీకులు గూడి కౌరవ
క్ష్మాపతి కార్యమేమయిన జాలిరే చేయగా వారు భాస్కరా
ఇప్పుడు భావం చూద్దాం
రాజు స్వయంగా తన మంచి చెడ్డలను విచారించు కోక పోతే తన దగ్గర ఎంత నిపుణులైన మంత్రులు ఉన్నాగాని కార్యము కొనసాగదు భీష్మాచార్యుడు ద్రోణాచార్యుడు కృపాచార్యుడు మొదలగువారు ఎంతమంది ఉన్నను దుర్యోధనుని బాగు చేయగలిగారా.