మన మహిళామణులు

శ్రీమతి కొమాండూరి లక్ష్మి గారు

ఆమె ఆంధ్ర మహిళా సభకు ఆధారంగా దుర్గాబాయి దేశ్ముఖ్ కుడిభుజం గా ఆదర్శాలు ఆచరణలో పెట్టిన గొప్ప విద్యావేత్త.ఎందరినో టీచర్స్ గా తీర్చి దిద్దారు బి.ఇడి.కాలేజ్ ప్రిన్సిపాల్ గా! ఒక అమ్మ గా కొత్తగా కాలేజీ హాస్టల్లో చేరిన ఇతర రాష్ట్రాల యువతులను కనిపెట్టి చూస్తూ వారి క్షేమ సమాచారాన్ని స్వయంగా అడిగి తెలుసుకునేవారు.ఒక అక్క లాగా సలహాలు బుజ్జగింపులు.లలితంగా సున్నితంగా మాట్లాడుతూ విద్యారంగం లో అసమాన కీర్తిప్రతిష్టలు పొందిన శ్రీమతి కొమాండూరి లక్ష్మి గారు

సింపుల్ లివింగ్ హై థింకింగ్.. ఆమె పటాటోపాలు ఎరుగని నిరాడంబర జీవితం లో ఇద్దరు చెల్లెళ్ళతో ఉంటూ ఆంధ్ర మహిళా సభ లో లాబ్ స్కూల్ నడుపుతున్నారు.ఒక కొడుకు కుమార్తె విదేశాల్లో ఉన్నారు.అప్పుడప్పుడు వారి దగ్గరకు వెళ్లి వస్తుంటారు
తండ్రి శ్రీ మంగాచారిగారు లాయర్ .బాల్యమంతా మద్రాసు లోనే గడిచింది.1972_97 దాకా మేడం రేడియో తో అనుబంధం కల్గి ఉన్నారు.ఇప్పుడు ఆధ్యాత్మికత కు ప్రాధాన్యత ఇస్తున్నారు.ఆంధ్రమహిళాసభకు బీజం రేడియో వల్లనే పడింది అన్నారామె
తండ్రి కి బాగా పరిచయం దుర్గాబాయి ఆమె తల్లి కృష్ణ వేణమ్మగార్లు.వారు పిల్లలకోసం ఏదో చేయాలని తెగ తాపత్రయ పడేవారు.అలా పిల్లలచేత పాటలు కథలు డాన్స్ ప్రోగ్రామ్స్ రేడియో లో బైట ఇప్పించారు.తల్లులకు హిందీ హస్తకళలు తో లేడీస్ ఆఫ్ బృందావన్ ఏర్పడింది.5 వక్లాస్ లో ఉన్న చిన్నారి లక్ష్మి కి లెక్కలు వందకి వంద! దుర్గాబాయమ్మ ప్రేరణతో బెనారస్ మెట్రిక్ పాసైనారు 4ఏళ్ల కోచింగ్ తో! ఆమె క్లాస్ మేట్స్ నీలం సంజీవరెడ్డి గారి అమ్మాయిలు ఇతర లాయర్ల పిల్లలు అంతా పండుగ పబ్బాలు జోరుగా ఉషారుగా జరుపుకున్న బాల్యం గురించి చెప్పారు ఆమె.బొమ్మలపండగ హడావిడి ప్రత్యేకంగా ఉండేది.దేశ్ముఖ్ తో దుర్గాబాయి పెళ్లి జరగటం ఆఫంక్షన్ సంబరాలు గుర్తు చేసుకున్నారు.పిల్లల్ని సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దాలి‌ పునాది గట్టిగా ఉండాలి అనేది ఈమె ఆశయం.దాన్ని ఆచరణలో పెడుతూ మనకు మార్గదర్శి గా నిలిచారుమేడం.ప్రొఫెసర్ పరమేశ్వరన్ గారి మాటల్తో విద్య ఉపాధి కే గాక3_8 ఏళ్ల వయసు పిల్లల్లో నిబిడీకృతమైన శక్తి ని వెలికి తీసేలా విద్యా విధానం ప్రవేశ పెట్టారు.హ్యాపీ చైల్డ్ హుడ్ అనే లక్ష్యంతో టీచర్ కి ప్రత్యేక శిక్షణ ఆటపాటలతో చదువు చెప్పడం ఇంటర్నేషనల్ లెవల్లో కావాల్సిన సామాగ్రితో బోధన జరగాలి అనే కలిపి సాకారం చేశారు.అమ్మనాన్నల్లో చదువు గురించి అవగాహన కల్గించారు.ఇక ఎం.ఏ.ఎం.ఇడి చేసిన ఆమె దుర్గాబాయి దేశ్ముఖ్ ప్రభావం తో ప్రభుత్వ ఉద్యోగం వదిలి ఆంధ్ర మహిళా సభ లో చేరి వెన్నెముక గా నిలిచారు.

ఆమె ప్రతిభకు లభించిన పురస్కారాలు ఇవి..శ్రీ ఎల్.ఎన్.గుప్తా మెమోరియల్ నేషనల్ అవార్డు ఫర్ ఎర్లీ ప్రైమరీ ఎడ్యుకేషన్ బెస్ట్ యూనివర్సిటీ టీచర్స్ అవార్డులు 1983 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ది అందుకున్నారు.కేంబ్రిడ్జ్ లో జరిగిన ఇంటర్నేషనల్ ఫోరం ఆఫ్ చైల్డ్ వెల్ఫేర్ లో ఫాకల్టీ మెంబర్ గా హాజరైనారు.1963 లో ఎం.ఇడి.లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మెరిట్ స్కాలర్ షిప్ అదే యూనివర్సిటీ కి చెందిన బి.ఇడి.లోప్రథమశ్రేణిలో పాసైన ప్రతిభా మూర్తి.

ఆంధ్ర మహిళా సభ లైఫ్ ట్రస్టీగా
ప్రెసిడెంట్ గా ఛైర్ పర్సన్ ఆనరరీ డైరెక్టర్ గా ఎన్నో పదవులు ఆమె ను వరించాయి.కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ గా 1972_97 దాకా ఆమె కృషి ఉత్తమ ఫలితాలు సాధించింది.

Chair person state resource centre early childhood education Telangana president AP civil society organisations network onECL consultant ECE and girls education to international National Organisations state government departments and NGO etc.

Areas of specialisation _
Early childhood education training for self employment of women teacher education etc

Introduced quality improvement program
Directed NCERT _ UNICEF collaborative project in ECE in A.P.1990_2000

Director_ follow ing study projects as principal investigator _

Primary curriculum package developed under her leadership is in use in all అంగన్వాడీ కేంద్రాల్లో

It has been found suitable even to children with special needs hence has been adapted by National Institute of mentally handicapped.

CECED project in collaboration with centre state foundation UNICEF and world bank2018_19.

Study on community managed ECE center at Adilabad and Vizag for SERP2010

Study on muslim minority girls in AP2003
Pretesting of some identified play materials in selected ICDS centres1991.

ఇలా మేడం చేసిన చేస్తూ పోతున్న పనులు చూస్తే పద్మ అవార్డు వస్తుందని అనిపించదూ? ఇలాంటి విద్యావేత్తలు అపూర్వ చదువుల సరస్వతి నిగర్వి మా లక్ష్మి మేడం అని చెప్పుకునే వేలాదిమంది విద్యార్థినులలో నేను ఒకదాన్ని కావటం నా అదృష్టం.ఆమె నిండునూరేళ్లు మన మధ్య ఉండి మనకు దారిదీపమై వెలుగులు పంచాలని భగవంతుని ప్రార్ధిస్తూ…చంద్రునికో నూలుపోగు నావ్యాసం ఆమె

పాదపూజకై రాలిన నా రచనా సుమం

l

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఎడారి కొలను 

గోరింక చెప్పిన బాల్కనీ కధ