ఎడారి కొలను 

ధారావాహికం -22 వ భాగం

(ఇప్పటివరకు:  మూడోరోజు మైత్రేయి ని పోలీసులు తీసుకెళ్లడం టూర్ నుండి వెనక్కి వచ్చిన ప్రసాద్ చూస్తాడు. జూనియర్ రాజ్యలక్ష్మి ని కలిసి విషయం వివరించి ఆమె సహాయం కోరతాడు  మహిళా సంఘటన అధ్యక్షురాలు  కాంతమ్మ గారిని   తీసుకొని మైత్రేయి ని పొలిసు స్టేషన్ నుండి తీసుకురావటానికికి వెళుతుంది రాజ్యలక్ష్మి .అక్కమ్మ తో కలిసి ఒక ప్లాన్ ద్వారా సుబ్బారావు , యోగ రాజ్ కలిసి చేసిన నిర్వాకం వీడియో సాక్ష్యం తయారు చేస్తాడు ప్రసాద్. కాంతమ్మ గారి జోక్యం తో సి ఐ స్వయంగ  స్టేషన్ కొచ్చి మైత్రేయి ని ఇంటికి పంపించేస్తాడు) 

సాయంత్రం అయింది. చీకటి పడింది. కానీ మైత్రేయి ఇంట్లోనుంచి ఏ  చప్పుడు లేదు. లైట్ కూడా వేసుకోలేదు. అలా గమనిస్తూనే ఉన్న ప్రసాద్ కి మనసులో ఎదో అనుమానం రావడం మొదలయింది. తలుపు కొడదామా అని అనుకున్నాడు. ఇరుగుపొరుగువాళ్ళేమనుకుంటారో అన్న భయం తో ఆగిపోయాడు. ఆలా చాలాసేపు ఉండలేకపోయాడు. ఏదైతే అదవుతుంది  అనుకొంటూ రాత్రి తొమ్మిదింటి వేళ మైత్రేయి ఇంటి తలుపు తట్టాడు. ఏమి చప్పుడు లేదు.

కాస్త భయమేసింది. మళ్ళి తలుపు గట్టిగ తట్టాడు. ఏ సమాధానం లేదు. ఇక లాభంలేదు తలుపు విరగ కొట్టాల్సిందే అనుకొంటూ దూరంగా చెట్ల మధ్యన పడి ఉన్న కొడవలి తీసుకొచ్చాడు. తలుపు విరగ కొట్టే ముందు మరో సారి గట్టిగా తలుపు తట్టాడు. అప్పుడు లోపల నుండి ఎదో కదులుతున్నట్లనిపించింది. కోద్ధి సేపు ఎదురుచూశాడు. చిన్నగా తలుపు తెరుచుకుంది. బయటి లైట్ లోపలపడింది. ఆ సన్నటి వెలుగులో మైత్రేయి.

శరీరంలో ఏ మాత్రం సత్తువ లేనట్లు అక్కడే కూలబడిపోయింది. వెంటనే ప్రసాద్ లోపలకు వెళ్ళి ఆమెను తన చేతుల మీద ఎత్తుకొని  గది మధ్యలో ఉన్న సోఫా మీద పడుకోపెట్టాదు. ఆమె ఏ మాత్రం స్పృహలో లేనట్లుగా ఉన్నది. శరీరం చల్లగా ఉన్నది. ఇతనికి అర్ధంకాలేదు. ఆమె ఎదో మాట్లాడుతున్నది. కానీ స్వరం స్పష్టంగా లేదు. ఉండుండి ఆమె ఏడుస్తున్నది. మధ్య మధ్యలో నవ్వు తున్నది కూడా. ఒక విచిత్రమయిన మానసిక స్థితి ఆమెది.

ఇలా కాదని పక్కనే పడున్న ఒక చున్నీ తీసుకొని ఆమెకు బుజాల చుట్టూ కప్పి, నెమ్మదిగా బయటికి తీసుకొచ్చాడు. తనకు తెలిసిన ఒక ఆటో వాడికి ఫోన్ చేసాడు రమ్మని. పది నిముషాల్లో వాడు ఇంటిదగ్గరకు వచ్చేసాడు.  మైత్రేయి ని ఆసుపత్రికి తీసుకెళ్లాడు ప్రసాద్.

తెలిసిన సిబ్బంది అవడం చేత హెడ్ నర్స్ వెంటనే మైత్రేయిని ఎమర్జెన్సీ వార్డు లోని  బెడ్ మీదకు చేర్చింది. వెంటనే డ్యూటీ డాక్టర్ అటెండ్ అయ్యాడు. ఆమె పరిస్థితి అర్ధమయింది. వెంటనే ఆమెకు ఆక్సిజన్ మాస్క్ పెట్టాడు. పక్కనే ఉన్న సెలైన్ స్టాండ్ దగ్గరకు లాగి ప్రసాద్ కి కొన్ని మందులు రాసిచ్చి అర్జెంట్ గ తీసుకురమ్మని పురమాయించాడు. పదినిముషాల్లో ప్రసాద్ మందులన్నీ పట్టుకొచ్చాడు. వెంటనే సెలైన్ లో  మెడిసిన్ కలిపి ఆమెకు  ఇంట్రావీనస్ గ్లూకోజ్ పెట్టాడు.

ఇవన్నీ చేయడానికి అరగంట పట్టింది. అప్పుడు గాని ప్రసాద్ ఎం జరిగిందో అడగలేక పోయాడు. వెళ్ళబోతున్న డాక్టర్ ని ఆపి ,”డాక్టర్ , అసలేమైంది ఈమెకి,”అని అడిగాడు కాస్త ఆదుర్దాగా.

“ఇంకొన్ని గంటలుదాకా  ఆమెను మీరు ఇక్కడకు తీసుకు రాక పోయుంటే సుఖంగా శాశ్వత నిద్దరలోకి జారిపోయేది.”అన్నాడు డాక్టర్ కాస్త సీరియస్ గా.

“వాట్ !”నమ్మలేనట్లు చూసాడు.

“ఎస్ ప్రసాద్! నాకనిపిస్తుంది గత నాలుగయిదు రోజులుగా ఈమె ఉపవాసం చేస్తున్నట్లున్నారు. అంతే కాదు గత ఇరవై నాలుగు గంటలనుండి ఆమె నీళ్లు కూడా తాగ లేదనిపిస్తుంది. అందుకే ఆమె శరీరమంతా డిహైడ్రేట్ అయింది. రేపటి వరకు ఈమెకు ఇలా సెలైన్ పెట్టాలి. అప్పుడు కానీ ఆమె కళ్ళు తెరిచి మన లోకం లోకి రాదు. బా గా ఆమె మొఖం చూడండి! ఎదో మానసిక ఘర్షణను అనుభవిస్తున్నట్లుగా ఉన్నది. అందుకే పల్స్ రేట్ చాల ఎక్కువగా ఉన్నది. ఈ రోజంతా ఆమె అబ్సర్వేషన్లో ఉండాల్సి ఉంటుంది. నాకనిపిస్తుంది ఇది సూయిసైడ్  ప్రయత్నం కాదుగదా?” అంటూ అనుమానం వ్యక్తపరిచాడు  అతను.

“చ్ఛా!చ్ఛా ! అలాటిదేమీ లేదు. ఏవో ఇంటిసమస్యలు,”అంటూ మాట దాటేసి, “నేను చూసుకుంటాను!” అని అన్నాడు.

“ఓకే అలాగే! ఇది ఎమర్జెన్సీ వార్డు, మీరు ఎక్కువ సేపు  ఇక్కడ  ఉండ కూడదు మా నర్స్ చూసుకుంటుంది లెండి, మీరు బయట లాంజ్ లో కూర్చోండి. మీ నంబర్ ఇస్తే అవసరమయినప్పుడు మా నర్స్ కాల్ చేస్తుంది.” అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. పేషంట్ రిపోర్ట్ చార్ట్ మీద తన నెంబర్ రాసి బయటికి నడిచాడు ప్రసాద్.

ఎంత ఆలోచించిన మైత్రేయి ఇలాటి సాహసం చేస్తుందని అనిపించలేదు ప్రసాద్ కి.  సుమంత్ కి ఫోన్ చేసి చెప్పాడు ఆమె కండిషన్. ఒక గంట కల్ల  రాజ్యలక్ష్మి తో సహా సుమంత్ ఆసుపత్రికి వచ్చాడు. అలాగే  మగత గ ఉన్న మైత్రేయి ని చూసి బయటి కొచ్చారు.

“ఇలా అయిందేమిటబ్బా,”అన్నాడు పెద్దగానే సుమంత్ .

“ఏముంది! ఈ పోలీస్ గొడవలతో మైత్రేయి మనసు విరిగిపోయి తిండి తినడమే మానేసి ఉంటుంది. పైగా మొన్న జరిగిన విషయం ఇంకా పెద్ద విషయం. తట్టుకోలేక పోయుంటుంది.

ఎవరికయినా ఇలాటి విషయాలు చాల ఇబ్బంది పెడతాయి. పైగా ఏ తప్పు లేక పోయిన ఆడవాళ్ళనే ప్రతి విషయంలో అనుమానించే ఈ సమాజం, పోలీసు లొచ్చి రోజు తీసుకెళ్లి, రాత్రికి వదిలిపెడుతుంటే ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటీ? ఎంత మందికి చెప్పగలదు తానేమి నేరం చేయలేదని. ఎలా నమ్మించగలదు ? ఎందుకంటే తనకే అర్ధం కాలేదు కదా ఇదంతా ఎందుకు జరుగుతున్నదో?” అంటూ వాపోయింది రాజ్యలక్ష్మి. సుమంత్, ప్రసాద్ ఇద్దరు ఆమెతో ఏకీభవించారు.

“ఇదంతా ఆమె భర్త సుబ్బారావ్ చేయిస్తున్నాడు,” అన్నాడు ప్రసాద్ కాస్త గంభీరంగా.

“మీకెలా తెలుసు?”చూసారిద్దరు ప్రశ్నర్ధకంగా. తన మొబైల్ తీసి తన దగ్గరున్న వీడియో ని వాళ్ళిద్దరికీ చూపించాడు.

“దొరికాడు వెధవ! వాడి అంటూ ఇప్పుడే చూడొచ్చు వాడి అంతు మళ్ళి  లెవకుండా!”ఆవేశంతో పళ్ళు పటపట కొరికాడు సుమంత్ .

“సుమంత్! అంత  ఆవేశం మంచిది కాదు. మనం ఈ విషయం  వసుంధర మేడం కి చెప్పాలి. ఆమె ఎలా చెబితే ఆలా చేద్దాం. అప్పటివరకు ఈ వీడియో ని కూడా ఎవ్వరికి చూపించకుండా జాగర్త పడాలి. లేదంటే ఆ సుబ్బారావు ఎంతటి నీచమయిన పనైనా చేయొచ్చు. ఈ సాక్ష్యం ద్వారా మైత్రేయి కి న్యాయం జరగాలి గాని , కొత్త సమస్యలు తలెత్త కూడదు,” అంటూ వసుంధర మేడం ని ఇమిటేట్ చేస్తూ మాట్లాడింది.

“అచ్చు మన మేడం లాగే మాట్లాడుతున్నావ్. అంటే రాజ్యలక్ష్మి గారు మీకు లాయర్ గ మంచి భవిష్యత్తు ఉందన్నమాట,” అంటూ ఆమె ని ఉడికించాడు సుమంత్.

ఇంకా ఉన్నది

Written by Padma NeelamRaju

రచయిత గురించి:

పద్మావతి నీలంరాజు చండీఘర్ లో ఇంగ్లీష్ అధ్యాపకురాలిగా 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న రిటైర్డ్ ఉపాధ్యాయురాలు. ఆమె నాగార్జున విశ్వవిద్యాలయం ఆంధ్ర ప్రదేశ్ నుండి M A (Litt),
POST GRADUATE DIPLOMA IN TEACHING ENGLISH ,CIEFL, హైదరాబాద్‌ లో తన ఉన్నత విద్యను పూర్తి చేసింది. స్త్రీ వాద సాహిత్యంపై దృష్టి సారించి Indian writing in English లో Panjabi University, patiala , Panjab, నుండి M phil డిగ్రీ పొందింది. తెలుగు సాహిత్యం పైన మక్కువ ఇంగ్లీషు సాహిత్యంపై ఆసక్తితో ఆమె తన అనుభవాలను తన బ్లాగ్ లోను
( http://aladyatherdesk.blogspot.com/2016/02/deep-down.html?m=1,)
కొన్ని సాహితీ పత్రికల ద్వారా పంచుకుంటున్నారు. ఆమె రచనలు తరచుగా జీవితం మరియు సమాజం పట్ల ఆమెకున్న అనుభవపూర్వక దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి. ఆమె అధ్యాపకురాలిగా గ్రామీణ భారత్ పాఠశాలల్లో E-vidyalok- e-taragati (NGO) లో స్వచ్ఛంద సేవలందిస్తున్నారు. రచన వ్యాసంగం పైన మక్కువ. పుస్తకాలు చదవడం, విశ్లేషించడం (Analysis / Review) ఆంగ్లం నుండి తెలుగు లోకి అనువాదం(Translation) చేయడం అభిరుచులు . PARI సంస్థ (NGO) లో కూడా ఆమె గ్రామీణ భారత జీవన శైలిని ప్రతిబింబించే వ్యాసాలను కొన్నిటిని తెలుగులోకి అనువదించారు (padmavathi neelamraju PARI). HINDUSTAN TIMES, తరుణీ ,మయూఖ, నెచ్చెలి వంటి పత్రికలలో కొన్ని కధలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. “Poetry is the sponteneous overflow of power feelings; recollected in tranquility” అన్న ఆంగ్ల కవి వర్డ్స్ వర్త్ తనకు ప్రేరణ అని చెబుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దొరసాని

మన మహిళామణులు