పద్యాలు

నెల్లుట్ల మాధవి

ఆ .వె . వరద నీరు వచ్చె వార్ధక్యము వలెను
కోరికట్టుకున్న కొంప మునిగె
ఇల్లు కట్టి మనము ఇక్కట్ల పడితిమి
చెరువుకుంటలన్ని చెదరగొట్టి

ఆ .వె .పెరటి తోటలోన పెంచుదాం మొక్కలు
పురుగు మందు లేక పుష్టిగాను
పోషకాలనిచ్చి వృద్ధి చేయు మనల
జబ్బు రాదు మనకు జన్మలోన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన మహిళామణులు

పాట