నా నీలి కళ్ళలో ఆనందంకై….
నీ కనులు అలిసెదాకా కష్టించావు…
నా ఆకలి తీర్చుటకు..
నీవు క్షుత్భాదననుభవించావు…
నా ఉన్నత స్థానానికై..
నీవు దైన్యస్థితిని అవలంబించావు…
నా రేపటి అడుగుకై…
నీ అహర్నిశలు శ్రమించావు….
కలత రానీయక…
కన్నీరు జారనీయక…
కంటికి రెప్పలా కాచుతూ…
నీ కడుపులో దాచుకున్నావు…
ఈ లోకానికి …..
చాలా గొప్పగా నన్ను పరిచయం చేసావు…
నా వెన్నoటి వుండి ప్రోత్సహించావు…
ఇరవై ఏళ్లుగా నన్ను మోస్తూనే ఉన్నావు…
ఈనాటి నా విజయానికి!..
నీవే కారణం కదా నా నాన్న…!!!