గర్ల్ ఫ్రెండ్

కథ

                 తాటికోల పద్మావతి

“రాత్రి అందరి భోజనాలు అయిపోయినాక పడుకోబోయే ముందు భార్యని పిలిచి జేబులో జీతం డబ్బులు ఉన్నాయి తీసి బీరువాలో పెట్టమన్నాడు మాధవరావు.
“ఉండనివ్వండి ఎక్కడికి పోతాయి. రేపొద్దున పాలవాడికి, అద్దె వాళ్ళకి ఇవ్వాలి కదా అన్నది సుజాత.
“కొడుకు రాకేష్ గదిలో కూర్చొని చదువుకుంటున్నాడు. సాయంత్రం తన ఫ్రెండు ప్రవల్లిక పుట్టినరోజు గుర్తుకొచ్చింది.
“ప్రవల్లికకు ఏదైనా గిఫ్ట్ కొనడానికి వెయ్యి రూపాయలు అప్పుగా ఇవ్వమని ఫ్రెండ్ ని అడిగాడు.
“అప్పుచేసి ఇవ్వకపోతే ఎందుకురా అన్నారు స్నేహితులు.
“అమ్మాయిల్ని ఆకర్షించాలంటే అప్పుడప్పుడు గిఫ్టులు కొనివ్వాలి. సినిమాలకి షికార్లకి తీసుకెళ్లాలి. అప్పుడే మన మీద వాళ్లకి ప్రేమ ఎక్కువ అవుతుంది. మనం ఎక్కడికి రమ్మన్నా మనకోసం వస్తారు అన్నాడు స్నేహితుడు సూర్యం.
“మొన్న పుట్టినరోజుకి ఖరీదైన వాచి కొన్ని పెట్టాను. ఆశ్చర్యపోయిందనుకో. ఈసారి ఏదైనా మంచి గిఫ్ట్ కొనివ్వాలి కదా. త్వరలోనే మీ బాకీ తీర్చేస్తాను లేరా అన్నాడు రాకేష్.
“మీ నాన్న చదువుకోమని పంపిస్తే ప్రేమ దోమ అంటూ తిరుగుతున్నావా! ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే ఇంకేమైనా ఉందా అన్నారు.
“తను కూడా ప్రవల్లిక కళ్ళల్లో పడాలి. ఆమె ప్రేమను సంపాదించాలి. ఆ అందమైన రూపాన్ని చూడనిదే ఉండలేడు. ఒక్కరోజు కాలేజీకి రాకపోతే మనసు విలవిలా కొట్టుకుంటుంది. ప్రవల్లికకు గిఫ్ట్ ఏం కొంటే బాగుంటుందని ఆలోచించాడు.
“రాకేష్ పర్సులో 200 ఉన్నాయి. వాటికేమొస్తుంది. ఏం చేయాలి. అవకాశం అందుబాటులో ఉంది. ఎన్నడూ లేనిది నాన్న చొక్కా జేబు పైన చూపులన్నీ తారట్లాడుతున్నాయి.
“అడిగితే వందో రెండు వందలు ఇస్తాడు. అంతకుమించి ఇవ్వడు.
“రాకేష్ కి రాత్రంతా నిద్ర పట్టలేదు.
“ఉదయం 7 గంటలకే బుక్స్ చేత పట్టుకొని బయలుదేరాడు.
“అప్పుడే కాలేజీకి వెళ్తున్నావు ఏమిటిరా అన్నది తల్లి.
“ప్రైవేట్ క్లాసులు ఉన్నాయని చెప్పి బయటకు వచ్చాడు.
“టిఫిన్ అన్నా చేయలేదు అనుకున్నది సావిత్రి.
“ఉదయం పాలవాడికి డబ్బులు ఇద్దామని చొక్కా జేబులో చెయ్యి పెట్టగానే ఖాళీగా ఉంది. ఒక్కసారిగా సావిత్రి గుండెఝల్లుమంది.
“ఏమండీ జేబులో డబ్బులు తీసి జాగ్రత్త చేశారా ఏమిటి? పాల ఆయనకి డబ్బులు ఇవ్వాలంది.
“నిన్న రాత్రి డబ్బు తీసి జాగ్రత్త చేయమని నీకే కదా చెప్పాను బీరువాలో పెట్టావా ఇంకెక్కడైనా పెట్టావు సరిగ్గా వెతికి చూడమన్నాడు.
“కావాలంటే మీరు చూడండి. అసలు ఇంటికి తెచ్చారా లేదా! దారిలో పోగొట్టుకొని వచ్చారా!
“నేనేమన్నా చిన్న పిల్లవాడిని అనుకున్నావా! డబ్బులు పారేసుకుని రావడానికి! పిల్లలు ఏమైనా తీసారేమో అడిగి చూడు అన్నాడు మాధవరావు.
“కూతుర్ని అడిగితే నాకు తెలియదంది.
“నీ పుత్ర రత్నాన్ని అడిగి చూడు. ఇంతకీ వాడు ఎక్కడ కనిపించడం లేదు. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్లాడు!
“ప్రైవేటు క్లాసులు ఉన్నాయని చెప్పి వెళ్ళాడు లెండి. అయినా వాడలాంటి పని ఎప్పుడూ చెయ్యడే!
అడగకుండా ఎందుకు తీస్తాడు?
“అడిగితే మనం ఇవ్వం గనుక.
“డబ్బు దొరక్కపోతే ఈనెల పస్తులు ఉండాల్సిందే. తప్పంతా నీదేనంటూ భార్య మీద విరుచుకుపడ్డాడు మాధవరావు.
“సావిత్రికి కాళ్లు చేతులు ఆడటం లేదు. జేబులో డబ్బులు తెల్లవారేసరికల్లా ఎలా మాయమవుతాయి. రాకేష్ అలాంటి పని చేస్తాడంటే నమ్మకం కలగడం లేదు.
సావిత్రి కి కాళ్లు చేతులు ఆడటం లేదు. జేబులో డబ్బులు ఎలా మాయమై పోతాయి. రాకేష్ అలాంటి పని చేస్తాడంటే నమ్మకం కలగడం లేదు.
రాకేష్ ఉదయం కాలేజీకనీ వెళ్లిన వాడు సాయంత్రమైనా ఇంటికి రాలేదు.
“కాలేజీ వదలగానే రెస్టారెంట్ కి వెళ్ళాడు రాకేష్. అప్పటికే ప్రవల్లిక ఎదురు చూస్తున్నది.
“హ్యాపీ బర్త్డే ప్రవల్లిక అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి ఏది నీ చెయ్యి ఒకసారి ఇలా ఇవ్వమనగానే ఏమిటి హస్త రేఖలు చూసి చెబుతావా నా జీవితం ఎలా ఉంటుందోనంటూ కుడి చెయ్యి ముందుకు సాచింది.
“సుతారంగా ఆమె చేతిని అందుకొని జేబులో నుంచి చిన్న బాక్స్ బయటికి తీసి అందులో ఉన్న గోల్డ్ రింగ్ ఆమె చేతి వేలికి తొడిగాడు.
“ప్రవల్లిక ఆనందంతో ఉక్కిరిబిక్కిరై గోల్డ్ రింగు చూసుకొని మురిసిపోయింది.
“నిన్ను తప్ప మన ఫ్రెండ్స్ ఎవరిని పిలవలేదు. అందరికీ తెలియటం నాకు ఇష్టం లేదు అంటూ రాకేష్ చేతిని ముద్దాడి వదిలేసి ఇది మన ప్రేమకు చిహ్నం. ఈ ఉంగరం చూసినప్పుడల్లా నువ్వు గుర్తుకు రావాలి అంటూ నవ్వింది.
“ఈ ఉంగరం ఓ లెక్క కాదు. నీకోసం ఏమైనా చేస్తాను. నీ ప్రేమ దక్కితే చాలు! ఏం చేయమంటావో చెప్పు అన్నాడు ప్రవల్లికను ఓరగా చూస్తూ.
“అబ్బాయిగారు ఆవేశంలో ఏదో మాట్లాడుతున్నారు. నేను నువ్వు ఇచ్చే బహుమతులు చూసి నిన్ను ప్రేమించడం లేదు. మన మనసులు కలిశాయి. ఒకరికొకరం ఇష్ట పడ్డాం. అంతే బుద్ధిగా చదువుకుని ఉద్యోగం వచ్చాక మన కాళ్ళ మీద మనం నిలబడ్డాక పెళ్లి సంగతి ఆలోచిద్దాం అన్నది.
“ఇద్దరూ చాలా సేపు కబుర్లు చెప్పుకున్నారు. ఐస్ క్రీమ్ కి ఆర్డర్ చెప్పాను.. సరదాగా కాసేపు ఎంజాయ్ చేసి బయలుదేరారు.
“రాకేష్ కి ఇంటికి వెళ్లాలంటే భయం పట్టుకుంది. ఎక్కడ డబ్బు విషయం అడుగుతారు అని కంగారు పడుతున్నాడు.
“రాత్రికి నెమ్మదిగా ఇల్లు చేరుకున్నాడు రాకేష్.
“ఉదయం కాలేజికి అని వెళ్ళిన వాడివి ఇప్పుడా రావటం అన్న తండ్రి కంఠం కంచు గంటలా మ్రోగింది.
“నాన్న జేబులో డబ్బులు కనిపించడం లేదు నువ్వేమైనా తీసావా అంటూ తల్లి సూటిగా ప్రశ్న వేసింది.
“నేనెందుకు తీస్తానన్నాడు కాస్తంత ధైర్యం తెచ్చుకొని.
“ఎవరు తీయకపోతే జేబులో డబ్బులు ఎలా మాయమైపోతాయి. ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేడట అలా ఉంది.
“ఇంట్లో అందరూ తనను ఒక దొంగ లాగా చూస్తున్నారు. తనే తీశాడని తెలిస్తే ఇంకేమైనా ఉందా! దొంగతనం చేశాననే చెడ్డ పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది.
“నాకేమీ తెలియదు. నేను తియలేదంటూ దబాయించాడు.
“మాధవరావుకి కొడుకు మీదనే అనుమానంగా ఉంది. ఇంటి అద్దె, పాలకి డబ్బులు కట్టాలి. వాళ్లకి నా మొహం ఎలా చూపించను. ఒకటా రెండా. పదివేలు. ఇంట్లోకి సరుకులు లేవు. నెలంతా కష్ట పడిన డబ్బు. ఎలా మాయమై పోతుంది..
“మాధవరావుకి ఒక ఆలోచన వచ్చింది.
వచ్చిందే తడవుగా భార్యను పిలిచి దొంగ ఎవరో కనుక్కోవడానికి స్వామి జి దగ్గరకు వెళుతున్నాను. ఆయన డబ్బు ఎవరు తీసింది చెప్పేస్తారు.
“ఆ మాటలు వినగానే రాకేష్ కి గుండెల్లో రాయి పడింది.
తనే దొంగ అని తెలిసిపోతుంది. ఇంట్లో వాళ్లకి బయటి వాళ్లకి దొంగ అని తెలిశాక ఎప్పటికీ తనని దొంగ లాగానే చూస్తారు..
“రాత్రికి రాకేష్ కి ఎంత సేపటికి నిద్ర పట్టలేదు. తండ్రికి నిజం చెప్పేయాలనుకున్నాడు. చేసిన తప్పు ఒప్పుకోవడం మంచిది. అర్ధరాత్రి దాటింది. మెల్లగా లేచి నడుచుకుంటూ తండ్రి గదిలోకి వెళ్ళాడు.”మాధవరావుకు మెలకువ వచ్చి చూశాడు. ఇంత రాత్రి టైంలో వీడింకా నిద్రపోకుండా ఇక్కడ ఏమి చేస్తున్నాడు?
“ఏమిట్రా ఇంకా నిద్ర పోలేదా?
“లేదు నాన్న! నిద్ర రావడం లేదు. మీతో కొంచెం మాట్లాడాలి.
“ఈ అర్ధరాత్రి పూట ఏం మాటలు. రేపు ఉదయం మాట్లాడవచ్చులే! ఏదైనా ముఖ్య విషయమా!
“అవును నాన్న. ఇప్పుడు మీతో చెబితే గాని నా మనసు కుదుటబడదు.
“ఏమిటంటే ముఖ్య విషయం.
“మీ జేబులో ఉన్న పది వేలు నేనే తీశాను.
“అంత డబ్బుతో నీకేం అవసరం. ఎవరికైనా ఫ్రెండ్ కి అప్పుగా ఇచ్చావా?
“అసలు నిజం దాచడం ఇష్టం లేక ప్రవల్లికను ప్రేమిస్తున్నట్టు ఆ డబ్బుతో ఉంగరం కొనిచ్చానని నిజం చెప్పాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని ఒట్టు వేయించుకున్నాడు. మరొకసారి ఇలాంటి పని చేయను అంటూ కాళ్ళ వేళ్ళ పడి ప్రార్థించాడు.
“ప్రేమించడం తప్పు కాదు. డబ్బు చూసి ప్రేమిస్తారు కొందరు. ఆ డబ్బు లేని నాడు దూరం పెడతారు. అమ్మాయిలు వెంట తిరగటం అంత మంచిది కాదు. ఇప్పటినుంచి ఆ స్నేహాలు మానుకో. బుద్ధిగా చదువుకుని ఉద్యోగం వెలగబెట్టమంటూ కోపడ్డాడు.
ప్రవల్లిక సినిమాకి వెళ్దామని పట్టు పట్టింది.
“రాకేష్ జేబులో డబ్బులు లేవు. పర్సు మర్చిపోయానని చెప్పి తప్పించుకున్నాడు.
“మరోసారి షాపింగ్ కి వెళ్దామని తీసుకువెళ్లి మంచి డ్రెస్సు సెలెక్ట్ చేసుకుంది. రాకేష్ ని బిల్లు కట్టమంది.
అప్పుడు కూడా పర్సు మర్చిపోయాను అని చెబితే బాగుండదని మరో వంక చెప్పి తప్పించుకున్నాడు.
“అప్పటినుంచి రాకేష్ తో ప్రవల్లిక మాట్లాడటమే మానేసింది.
“ఒకసారి ప్రవల్లిక ఎవరిదో బైక్ మీద వెళ్లడం చూశాడు రాకేష్. అతనితో సినిమాలు షికారులకి తిరుగుతున్నది. ఇద్దరూ కలిసిఇక ఇకలు పక పకలు.
“వాళ్లను చూస్తుంటే కోపం వచ్చింది రాకేష్ కి.
“కాలేజీ వదిలిగానే ప్రవల్లిక కోసం అటు ఇటు చూశాడు.
ఒక్కటే నడుచుకుంటూ బయటికి వచ్చింది.”అతను ఎవరు అని అడిగాడు.
“నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పింది.”ఇన్నాళ్లు నా చుట్టూ తిరిగావు . నన్ను ప్రేమిస్తున్నాను అన్నావు. ఇదంతా నాటకమేనా?
ఇందులో తప్పేముంది. మీ మగవాళ్లు భార్యని మార్చినప్పుడు మా ఆడవాళ్లు మారటంలో తప్పేముంది. నీకు నాకు సరిపోదు. నన్నెప్పుడూ కలుసుకోవడానికి ప్రయత్నించకు. అతను బాగా డబ్బున్న వాడు. నాకోసం ఎక్కడికైనా వస్తాడు. ఎంత డబ్బైనా ఖర్చు పెడతాడు అన్నది గర్వంగా.
“ప్రేమంటే ఇదేనా! మనసుంటే సరిపోదా! నాన్న చెప్పిన మాట అప్పుడు గుర్తుకు వచ్చింది. సమయానుకూలంగా ఊసరవెల్లి రంగులు మార్చిన వైనం అర్థమైంది. ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే అనుకోకుండా ఉండలేకపోయాడు రాకేష్.
“ప్రవల్లిక కోసం తండ్రి జేబులో నుంచి డబ్బు దొంగతనం చేసి ఉంగరం కొని బహుమతిగా ఇచ్చాడు.
దానికి ఫలితం తండ్రి ముందు దోషిల నిలబడ్డాడు.
“గర్ల్ ఫ్రెండ్స్ అంటే అబ్బాయిలు వెంట తిరిగి డబ్బులు ఖర్చు పెట్టిస్తారని మాట నిజం అనిపించింది.
“చేసిన తప్పుకు పశ్చాతాప పడుతూ ప్రవల్లికతో మాట్లాడటం మానేశాడు. నిన్న తనతో తిరిగింది ఈరోజు మరొకరితో, రేపు ఇంకొకరితో తిరుగుతుంది. ఇది ప్రేమ అంటారా!
“మిత్రుడి మాట విననందుకు రాకేష్ కి బాగా బుద్ధి వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన మహిళామణులు

తిరగబడితే!