ఎడారి కొలను 

ధారావాహికం – 20 వ భాగం

(ఇప్పటివరకు: మూడో సారి యోగ రాజ్ స్వయం గ వస్తాడు మైత్రేయి ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ల డానికి. టూర్ నుండి వెన క్కి  వచ్చిన ప్రసాద్ ఎసై ని ప్రశ్నిస్తాడు. స్టేషన్ కెళ్ళి రేఖ

ద్వారా కొంత విషయం తెలుసుకుంటాడు. మైత్రేయి కి ధైర్యం చెబుతాడు. అక్కమ్మను పెద్దా సుపత్రి లో కలిసి ఆమె కొక పని అప్పగిస్తాడు. ఆమె  కు సాయం గ  ఒక పిల్లాడిని  పంపిస్తాడు ఆమెకు తోడుగా స్పెషల్ వార్డు కి.   ఆ తరువాత లాయర్ వసుంధర ఇంటి కి వెళ్తాడు)

     లాయర్ వెంకటేస్వర్లు గారి ఇంటి ముందర బైక్ ఆపి  ఇంటి బయటున్న పెద్ద గాటు తెరుచుకొని లోపలికెళ్ళాడు. దూరంగా మొక్కల దగ్గరగా కూర్చొని పనిచేసుకొంటున్న ఒక ముసలాయన వెనక్కి తిరిగి చూసి,”ఎవరు కావాలి బాబు,”అని అడిగాడు.

“నేను లాయర్  వసుంధర గారిని కలవ టానికి  వచ్చాను,” చెప్పాడు.

“అమ్మగారా!   ఆమె లెరుగదా. విదేశాలకు పోయినారు. ఇంకొన్ని రోజుల తరువాతే వస్తారు. ఏదైనా కేస బాబు,”

“కాదు తాత! మరొక పని మీద వచ్చాను. మేడం గారి జూనియర్ తోనైనా మాట్లాడివెళ్తాను. రాజ్య లక్ష్మి గారున్నారా  మరి,” అడిగాడు తాను.

“ఆ బాబు, ఇట్ట ఆ మెట్ల పక్కనుండి ఆఫిస్ రూమ్ లోకి వెళ్ళండి. ఆ యమ్మ కూడా ఇప్పుడే వచ్చారు,” అని చెప్పాడు.

ఒక్క నిముషం ఆలస్యం చేయకుండా రాజ్య లక్ష్మి దగ్గరికి వెళ్ళాడు ప్రసాదు. కొత్త వ్యక్తిని  కాస్త అనుమానం గ చూస్తూ ,”మీరు…?”అని అడగబోయింది.

ప్రసాద్ ఆమె ప్రశ్నకి ఎదురు చూడ కుండానే తనని తానూ పరిచయం చేసుకొన్నాడు.

“నేను మీ దగ్గరికి అతి ముఖ్యమయిన పని మీదొచ్చను. వసుంధర గారు లండన్ వెళ్లపోయేముందు మైత్రేయి గారి కేసు తీసుకున్నారని తెలిసింది,”

“అవును, కానీ ఆ కేసు హియరింగ్ జూన్ లో కదా?” చెప్పింది రాజ్యలక్ష్మి, “ఆమె మా మేడం గారి కి మంచి  స్నేహితురాలు కూడ,”అన్నది.

“అవునండి. తెలుసు. ఇప్పుడు మైత్రేయి గారిని పోలీస్  స్టేషన్ లో ఉంచారు.”

షాక్ అయింది రాజ్య లక్ష్మి,”వాట్ …?”అరిచినంత పనిచేసింది.

“యస్… “అన్నాడు సీరియస్ గ.

ఆమెకు తన కు అర్ధ మయినంత వరకు వివరించాడు. వెంటనే రాజ్య లక్ష్మి కాంతమ్మ గారికి ఫోన్ కలిపింది. కాంతమ్మ గారు మహిళాసంగ్ కార్యకర్త. స్త్రీల హక్కుల పోరాట సమితి అధ్యక్షురాలు. ఆమెను  2 టౌన్ పొలిసు స్టేషన్ కి రమ్మని చెప్పింది.

“ప్రసాద్ గారు! పదండి , పొలిసు స్టేషన్ కి వెళదాము,” అంటూ చక చక పర్సు తీసుకొని బయటికి దారి తీసింది. ప్రసాద్ ఆమెని అనుసరించాడు. ఆమె ఆఫీస్ కి తాళం వేసి, ”సుమంత్ గారొస్తే చెప్పు నేను 2టౌన్ పొలిసు స్టేషన్ కి వెళుతున్నానని. ఆయన్ని కూడా అక్కడికి రమ్మను తాత,” అంటూ ప్రసాదు వేనకాతలే  బైకు మీద కూర్చుంది. ప్రసాద్ బైకు ని ముందుకి దూకించాడు వేగంగా. ఇరవై నిముషాల్లో స్టేషన్ దగ్గరికి చేరుకొని  కొద్దీసేపు బయటే వేచి ఉన్నారు కాంతమ్మ గారి కోసం. మనిషి పొట్టిగా, కొంచం లావుగా ఉంటారు కాంతమ్మ  గారు . కానీ చూడ గానే పెద్దరికంతో పాటు ఎదో ఆదర్శం ఆమె ముఖంలో కనిపిస్తుంది, చూసేవారికి ఆమె ను చూడగానే దణ్ణం పెట్టాలనిపించే విధంగా. మారుతి కారునుండి దిగిన కాంతమ్మ గారికి అనుకోకుండానే రెండు చేతులు జోడించి నమస్కారం చేసాడు ప్రసాదు.

కాంతమ్మ గారు, రాజ్య లక్ష్మి స్టేషన్ లోకి వెళ్లారు.

కాంతమ్మ గారిని చూస్తూనే చాలా గౌరవంగ స్టేషన్ హెడ్ లేచి నిలబడి ఆమెను కుర్చీలో కూర్చోపెట్టాడు. పక్కనే రాజ్యలక్ష్మి కూడా కూర్చుంది. దూరంగ తలదించుకొని అన్నీ  పోగొట్టుకున్న స్థితిలో దీనంగా కనిపించింది మైత్రేయి వాళ్ళకి.

“ఆ అమ్మాయిని ఎందుకు పొలిసు స్టెషన్  లో కూర్చో బెట్టారు. కారణం తెలుసు కోవచ్చా?” అడిగింది చాలా  గంబీరంగా.

వెలతలా పోయాడు సెక్షన్ హెడ్. ‘యసై చేస్తున్న ఈ పాడు పని మహిళా సంఘం దాకా పాకిందన్న మాట. అంటే వీడికి అదే యోగిరాజ్జ్ గాడికి ఇక్కడ పనైపోయింది’ అని అనుకొన్నాడు మనసులో.

“తెలియదు మేడం, మా యసై గారె  ఈ కేస్ ని స్వయంగ చూసుకుంటున్నారు. వివరాలు ఎవరికీ చెప్పొద్దని ఆర్డర్ వేసాడు,”అంటూ నీళ్లు నమిలాడు.

“మరయితే ఎక్కడ మీ యసై “ మరో ప్రశ్న సూటిగా కాంతమ్మ గారి నోటినుంచి.

“C I గారి ని కలవడానికి వెళ్లారడు.”

“ఎంతసేపు పడుతుంది,”

“తెలవదు మేడం,”

గంభీరం గ తలాడిస్తు, “అలాగా అయితే , ఆమె పైన రాసిన FIR చూపెట్టండి. మా లాయర్ చూస్తుంది.”

“ఇప్పటివరకు అలాటి దేమి రాయలేదు మేడం ,”

అంతే అగ్గిమీద గుగ్గిలమే అయింది ఆమె, ”ఏమను కుంటున్నారు మీ పోలీసులు. అంత మీ ఇష్టప్రకారం చేయొచ్చనా? అడిగేవారెవరు లేరనా/ ఏంటి మీ ధైర్యం ? ఏ  విషయం మీద ఒక గౌరవప్రదమయిన అధ్యాపకురాలిని ఇలా స్టేషన్ లో కూర్చోబెట్టారు.  మీ దగ్గర ఏ వివరాలు లేవనేగా అర్ధం. అంటే తప్పుడు కేసు పెట్టాలని  చూస్తున్నారన్న మాట. దానికి నువ్వే సాక్ష్యం, నీతో పాటు నేను కూడా. పద ఇప్పుడే మిమ్మల్ని అందరిని  కోర్ట్ కి ఈడుస్తాను. ఆడవాళ్లంటే ఈసంత  గౌరవం లేదు. ఈ విధంగా ఆమె ను టార్చర్ చేసే హక్కు మీ కెవరిచ్చారు. ఎక్కడ మీ ఎసై , ఫోన్ చేయి రమ్మను వెంటనే, ఆయనతో పాటు సి ఐ గారి ని రమ్మని చెప్పు , ఆయనకి నేను రమంటున్నానని చెప్పు,” అంటూ గట్టిగ మాట్లాడటం మొదలుపెట్టింది కాంతమ్మ గారు. ఇంతలో రాజ్య లక్ష్మి మైత్రేయి దగ్గరకెళ్ళి ఆమె ని చెయ్యిపట్టుకొని తీసుకొచ్చ్చి కాంతమ్మ గారి పక్కన కూర్చోపెట్టింది. సెక్షన్ హెడ్ యోగరాజ్ కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాడు. అతను  మాట్లేడేటప్పుడు స్పీకర్ లో పెట్టి మాట్లాడమని కాంతమ్మ గారు డిమాండ్ చేసింది . ఇతను మాట్లాడినదంతా  సి ఐ  కూడా  వినడం జరిగింది.

బయట నుంచొని ఉన్న ప్రసాద్ పదే  పదే  తన మొబైల్ చూసుకుంటున్నాడు. కొద్దిసేపటికల్లా ఒక వీడియో వచ్చింది అతనికి మొబైల్ లో. ఆ వీడియో ని మొత్తం చూసినప్పుడు అతని కళ్ళలో మెరుపు, పెదవుల మీద ఒక చిరునవ్వు మెరిసాయి.

ఇంతలో పొలిసు జీపు లో యోగ రాజ్ తో పాటె C I  కూడా దిగాడు. లోపలికి వెళుతూనే “నమస్తే కాంతమ్మ గారు! ఎలా ఉన్నారు?” అంతకంటే ఎక్కువ అడిగే ధైర్యం చేయలేదు.

“మీరు కూడా వచ్చారన్న మాట. ఇంకొద్ది సేపట్లో మా పత్రిక విలేఖరి ఇంకొందరు పత్రిక విలేకరులతో  వస్తున్నాడు. అప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుందాము.” అని సూటిగా  మాట్లాడారు.

సి ఐ గారు వెంటనే, “ఎంత పని చేశావయ్యా యోగ రాజ్. ఎంత చెత్త నెత్తిన పెట్టావో తెలుసా నీ దూకుడుతనం తో. మేన్నర్స్ లేవు. లేడీస్ తో టి విషయాలు ఎంత సున్నితంగా ఉంటాయి. ఏ  మాత్రం తేడా వచ్చిన మనమందరం ఇదిగో ఈ సెల్లు లోనే కూర్చొని చిప్ప కూడు తినాలి. కాంతమ్మ గారి లాటి వ్యక్తుల దృష్టి లో పడ్డావు. నువ్వే కాదు, మాకు కూడా తలవంపులు తెచ్చావు. ఆమె మీద ఏ  కేసు లేదు. ఎందుకు ఇన్ని రోజులనుండి ఆమెని స్టేషన్కి తీసుకొచ్చి ,రాత్రి దాకా ఇక్కడ  కూర్చోపెడుతున్నావు?” చాలా సూటిగా అడిగాడు.

ఏమీ  మాట్లాడకుండా తలవంచుకొని కూర్చున్నాడు యోగరాజ్. “అలా నేల చూపులు చూస్తే ఎలా? నిన్నెందుకు  సస్పెండ్ చేయకూడదో నాకు రీసన్ ఇవ్వు.”

“ఎంటలా చూస్తూ నిలబడతావ్, వేళ్ళు. వెళ్లి యసై యోగరాజ్ పేరు మీద షోకాజ్ తయారు చెయ్యి. నేను వెంటనే ఇష్యూ చేస్తాను. ట్వంటీ ఫోర్ అవర్స్ లోగ సమాధానం ఇవ్వాలని రాయి,” అంటూ ఆర్డర్ పాస్ చేసాడు సి ఐ రైటర్ కి.

కాంతమ్మ గారి వైపు చూస్తూ, “మేడం మీరామెను తీసుకొని వెళ్లిపోండి మేడం. మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను.” అంటూ తొందర పెట్టాడు..

   (ఇంకా ఉన్నది)                      

Written by Padma NeelamRaju

రచయిత గురించి:

పద్మావతి నీలంరాజు చండీఘర్ లో ఇంగ్లీష్ అధ్యాపకురాలిగా 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న రిటైర్డ్ ఉపాధ్యాయురాలు. ఆమె నాగార్జున విశ్వవిద్యాలయం ఆంధ్ర ప్రదేశ్ నుండి M A (Litt),
POST GRADUATE DIPLOMA IN TEACHING ENGLISH ,CIEFL, హైదరాబాద్‌ లో తన ఉన్నత విద్యను పూర్తి చేసింది. స్త్రీ వాద సాహిత్యంపై దృష్టి సారించి Indian writing in English లో Panjabi University, patiala , Panjab, నుండి M phil డిగ్రీ పొందింది. తెలుగు సాహిత్యం పైన మక్కువ ఇంగ్లీషు సాహిత్యంపై ఆసక్తితో ఆమె తన అనుభవాలను తన బ్లాగ్ లోను
( http://aladyatherdesk.blogspot.com/2016/02/deep-down.html?m=1,)
కొన్ని సాహితీ పత్రికల ద్వారా పంచుకుంటున్నారు. ఆమె రచనలు తరచుగా జీవితం మరియు సమాజం పట్ల ఆమెకున్న అనుభవపూర్వక దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి. ఆమె అధ్యాపకురాలిగా గ్రామీణ భారత్ పాఠశాలల్లో E-vidyalok- e-taragati (NGO) లో స్వచ్ఛంద సేవలందిస్తున్నారు. రచన వ్యాసంగం పైన మక్కువ. పుస్తకాలు చదవడం, విశ్లేషించడం (Analysis / Review) ఆంగ్లం నుండి తెలుగు లోకి అనువాదం(Translation) చేయడం అభిరుచులు . PARI సంస్థ (NGO) లో కూడా ఆమె గ్రామీణ భారత జీవన శైలిని ప్రతిబింబించే వ్యాసాలను కొన్నిటిని తెలుగులోకి అనువదించారు (padmavathi neelamraju PARI). HINDUSTAN TIMES, తరుణీ ,మయూఖ, నెచ్చెలి వంటి పత్రికలలో కొన్ని కధలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. “Poetry is the sponteneous overflow of power feelings; recollected in tranquility” అన్న ఆంగ్ల కవి వర్డ్స్ వర్త్ తనకు ప్రేరణ అని చెబుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దొరసాని

షార్లెట్ చోపిన్