( ప్రతి వారం తరుణి పత్రిక పాఠకుల కోసం ఓగిరాల కామేశ్వరి గారు వారికి నచ్చే, జనం మెచ్చే వివిధ కవుల శతక పద్యాలను , పద్య భావాలనూ అందిస్తారు చదివి ఆనందించండి ఆస్వాదించండి – సంపాదకులు)
శతక పద్యాలు. జీవన మార్గ సూచికలు
మన శతక కర్త లు శతక పద్యాలు రచించి మానవ జీవితానికి మార్గ దర్శకులు అయినారు. వాటిలో సంఘ నీతి భక్తి సూక్తులు ఎన్నో తెలియ చేసారు. అన్నీ మానవునికి ఎంతో ప్రయోజనకరమైన వి. ఒక్కొక్క కవి ఒక్కొక్క రకంగా పేర్కొన్నారు. కవులు ఎలా సూచించారో తెలుసు కునే ప్రయత్నం చేద్దాం.
భాస్కర శతకం లో కొన్నీ పద్యాలు చూద్దాం
భాస్కరశతక కర్త మారద వెంకయ్య ప్రతి పద్యం లో
మొదటి రెండు పాదాలలో తాను చెప్ప దలచు కున్న విషయం చెప్పి తరువాతి రెండు పాదాలలో అందరికీ అర్థమయ్యే రీతిలో మంచి ఉదాహరణ చూపిస్తారు.
కొన్ని పద్యాలు చూద్దాం :-
బలయుతుడైన వేళ నిజ బంధు డు తోడ్పడుగాని యాతడే
బలము తొలంగె నేని తన పాలిటి శత్రు వదెట్లు పూర్ణుడై
జ్వలనుడు కాన గాల్చు తరి సఖ్యము చూపును వాయు దే
వు డా బలియుడు సూక్ష్మ దీప మగు పట్టున నార్పదే గాలి భాస్కరా!
మన దగ్గర బలం ఉన్నప్పుడు అంటే ఆర్థిక బలం మానసిక బలం శారీరక బలం ఏ దైనా సరే ఉంటే అందరూ సహాయం చేస్తామని ముందుకు వస్తారు. మన దగ్గర ఏ బలము లేకపోతే ఒక్కరు కూడా తిరిగి చూడరు. దానికి మంచి ఉదాహరణ చూపించారు చూడండి. అగ్ని ప్రజ్వ లిస్తున్నప్పుడు గాలి తోడ్పడుతూ ఇంకా ఎక్కువ చేస్తుంది. అదే చిన్న దీపంగా ఆ గాలి దాన్ని అర్పేస్తుంది
ఇది ఈరోజులలో ఎంత నిజమో కదా ఎంతో మంది ని చూస్తుంటాం కదా!
_*_
శతక పద్యం 2
ఊరక సజ్జనుందొదిగి ఉండి న నైన దురాత్మ కుండు ని
ష్కారణ మోర్వ లేక యప కారము చేయుట వాని విద్యగా
చీరెలు నూరు టం కములు చేసెడి వై నను బెట్టే నుండగా
జే రి చినింగి పో గొరుకు చిమ్మట కేమి ఫలంబు భాస్కరా
సజ్జనుండు అతి మంచి తనము నకు పోయి ఎవ్వరి తో గొడవ పెట్టు కోక పోయినా కానీ దుర్జనుడు కారణం లేకపోయినా ఏదో కల్పించు కొని నిందలు వేస్తుంటారు. ఈ కాలంలో మరీ ఎక్కువై నది. దీనికి మంచి ఉదాహరణ చూడండి పెట్టె లో పెట్టిన చీరలను తనకు ఏమి ఉపయోగం లేకపోయినా చిమ్మట కొరికి చింపి వేస్తుంది.
వచ్చే వారం మళ్ళీ మరో రెండు పద్యాలతో….