జన్మతా ఎన్నో హక్కులు
జీవులన్నిటికి
మాటలొచ్చిన మనిషికి మరీ
అందుకే ఎదుట జీవి ప్రాణం తీసి మరీ తినేస్తాడు
అందుకే బలహీనతపై బలవంతుని ఆక్రమణ
హక్కు లోని భాధ్యత గుర్తెరిగితే
స్వేచ్ఛకు పరిమళం అబ్బినట్లే
హక్కుకు ఆశలను ఎరచూపి
పరిశ్రమను పక్కకు త్రోసి పరిహసించే తత్వం ఎంతకాలం
కళ్ల ముందు కనికట్టు మందుతో
చాపక్రింద నీరై నిలువెల్లా తడిపేసే..
అంతకంతకు ఐదేళ్ళకు ఒకమారు తెలివిలేని దద్దమ్మగా
నిన్ను నిలువునా చీల్చేసి నీసంస్క్రతిని కాల్చేసి
బానిసను చేసే ఓ కుతంత్ర ప్రయత్నం
కాలం మాటున పెరిగిన పలు కాలుష్యాలు కాలువలై పారుతూ
ముప్పై ముంచుకు వస్తున్నాయి అన్న విషయం మరిస్తే ఎలా?
తెలుసుకునే స్వేచ్ఛా హక్కు వున్నప్పడే మేలుకో భవిష్యత్తు మలుచుకో
మనుగడ బలపరుచుకునే
అవకాశం ఆయుధమై
నేడు నీ చేతిలో హక్కుగా నిలిచింది.