మన మహిళామణులు

సైన్స్ సంగీతం సాహిత్యం మేలు కలయిక త్రివేణీ సంగమం డాక్టర్ ధారా విజయలక్ష్మి…

ధరణికోట రుక్మిణీ దేవి అనంతరామయ్య గార్ల ఏకైక కుమార్తె ఈమె.ముగ్గురు అన్నదమ్ములు.తండ్రికి ఢిల్లీ ట్రాన్స్ఫర్ కావడంతో అమ్మమ్మ తాతగార్ల దగ్గర చెన్నైలో పెరిగారు.6వక్లాస్ కాగానే తండ్రి కి హైదరాబాద్ లో ఉద్యోగం వల్ల చదువు అంతా ఇక్కడే పూర్తి ఐంది.బాల్యంలో సంగీతం డాన్స్ నేర్చిన ఆమె సంగీతాన్ని శ్రీ ఎం.ఎస్.బాలసుబ్రమణ్యశర్మగారు పి.వెంకట్రావు డి.జి.భవానీగార్లవద్ద ఓకల్ నేర్చారు. శ్రీమేడూరి నరసింహారావు గారి దగ్గర వీణ నేర్చుకున్నారు.తల్లి ప్రోత్సాహం తో సంగీతం సాహిత్యం అబ్బాయి.హిందీ విశారద పాసైనారు.”మాఅమ్మ అందరికీ సౌందర్య లహరి నేర్పేది.వైలెన్ వాయించేది.98 ఏళ్ల అమ్మ నాజీవితం లో ప్రముఖ పాత్ర పోషించింది” అన్నారామె.ఫిజిక్స్ లో ఎం.ఎస్సీ.పి.హెచ్.డి.చేసి కర్ణాటక సంగీతం లో డిప్లొమా పొందారు.రాజమండ్రి లో కందుకూరి రాజ్య లక్ష్మి ఉమెన్స్ కాలేజీ లో ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ ఇన్చార్జి గా 32ఏళ్లు పనిచేసి రిటైరైనారు.

ఫిజిక్స్ లో బెస్ట్ థీసిస్ అవార్డు ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పొందారు.పోతనభాగవతంలో భౌతిక శాస్త్ర అంశాలు ఉత్తమ వ్యాసంగా బహుమతి పొందింది.విష్ణునామసంకీర్తనలు వెయ్యి నామాలకి వెయ్యి పాటలురాస్తే ఆ 4 భాగాలను టిటిడి వారి ఆర్థిక సాయం తో ప్రచురించారు.మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారి ప్రశంసాపత్రం దానికి అందుకున్నారు.ఇక ఆకాశవాణి విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.వివిధ సంగీత ప్రోగ్రామ్స్ ప్రసంగాలు చేశారు.అనేకసార్లు భక్తి సంగీతం నాదనీరాజనం ప్రోగ్రాంలు తిరుపతి భద్రాచలం లో పాల్గొన్న ఘనత ఆమెదే!18ఫిబ్రవరి 2024న హైదరాబాద్ డి.డి.లో ఈమె ఇంటర్వ్యూ వచ్చింది.ఈమె ముఖ్య రచనలు పోతన భాగవతం రామాయణం లో భౌతిక శాస్త్ర అంశాలు గ్రహగతులగూర్చిన విశ్లేషణ ముత్తుస్వామి దీక్షితులు వారి రచనలకు ఆధునిక ఖగోళ శాస్త్రపోలికలు అష్టాదశ శక్తి పీఠాలు పై పుస్తకం రామన్ ఎఫెక్ట్ లేజర్స్ పై వ్యాసాలు ప్రముఖుల ప్రశంసలు పొందాయి.ఇకస్కౌట్స్ గైడ్స్ శిక్షణ పొందిన ఆమె తన కాలేజీ అమ్మాయిలచేత ఎన్నో ప్రోగ్రాంలు చేయించారు.డ్రమటిక్ అసోసియేషన్ ఇన్ చార్జి గా అమ్మా యిలచేత డాన్స్ డ్రామాలు చేయించారు.యూత్ ఫెస్టివల్స్ లో4సార్లు వీరిగ్రూప్ డాన్స్ లకి బహుమతులు రావడం విశేషం.సినీనటి జయప్రద ఈమె స్టూడెంట్.రామప్పగుడి చండాలిక గోదాదేవి మొదలైన నృత్య రూపకాలు పేరు గాంచాయి.రేడియోలో విద్యార్థినులతో చర్చాగోష్ఠులు నిర్వహించారు.1971_72లోపాకిస్థాన్ తో యుద్ధం జరిగేటైంలో విద్యార్థినులచేత స్వెట్టర్లు అల్లించి పంపారు.ధవళేశ్వరం వరదలటైంలోపిల్లలతో కల్సి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.కందుకూరి దంపతుల గూర్చి తమసోమాజ్యోతిర్గమయ నృత్యరూపకం నిర్వహణ సూక్తి సుధ క్యాసెట్ మంచి పేరు తెచ్చాయి.జేమ్స్ ఎడ్విన్ అనే రోదసీ యాత్రికుని కలవటం ఆయన అనుభవాలు వినడం తాను జీవితంలో మరువలేని మధురానుభూతి అంటారు ఆమె.” నా విష్ణు సహస్రనామ సంకీర్తన పుస్తకాలు దాదాపు అన్ని లైబ్రరీ వాళ్ళు అన్ని రాష్ట్రాల వారు కొన్నారు.మన టి.వి.లో పాఠ్యాంశాలు నేర్పాను.ప్రస్తుతం నేను సంగీతం నేర్పుతున్నాను.ఓ అంధబాలిక గూడా నేర్చుకుంటోంది.” ఆమె భర్త శ్రీధారావెంకటప్రసాద్ గారు పోలవరం ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజనీర్ గా చేసి రిటైర్ అయ్యారు.ఆయన సహకారం తో కాలేజీ బిల్డింగ్ కాంక్రీటు స్ట్రక్చర్ ప్లాన్ వేయడం జరిగింది.విద్యార్ధులనుంచి కేవలం 2 రూపాయలు వసూలు చేసి కాలేజీ ప్రహరీగోడ కట్టించారు.ఆమె ఫోన్ నెంబర్ 9989031791..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

యువత భవిత

ప్రామాణికం – Standerd