ఎడారి కొలను 

19 వ భాగం )

(ఇప్పటివరకు: మూడో సారి యోగ రాజ్ స్వయంగ వస్తాడు మైత్రేయి ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ల డానికి. టూర్ నుండి వెన క్కి  వచ్చిన ప్రసాద్ ఎసై ని ప్రశ్నిస్తాడు. ఇతనితో ను ఎసై చాల రూడ్ గ ప్రవర్తిస్తాడు. పూర్తిగా కాకపోయినా కొంత విషయం తెలుసుకున్న ప్రసాద్ పోలీస్ స్టేషన్ కి బయలు దేరతాడు.  రమాదేవి  వీళిద్దరి చేత ఇల్లు ఖాళీ చేయించాలని అనుకుంటుంది) 

      స్టేషన్ కి చేరగానే మైత్రేయి ని ఎప్పుడు కూర్చోపెట్టే దగ్గరే కూర్చో పెట్టి,”ఇవాళ మీ విషయం అటో ఇటో తేల్చేస్తాను. రైటరు గారు ఇవాళ  ఈమే మీద కేసు రాయండి. . FIR పూర్తి చేద్దాము. చేద్దామా మేడం గారు,”అంటూ కన్నుగీటాడు. అయోమయంగ చూస్తున్న రైటర్ వంక చూస్తూ “మీరేమి కంగారుపడకండి సార్, నా దగ్గర పూర్తి ఇన్ఫర్మేషన్ ఉన్నది. మీకు చెబుతాగా. సాయంత్రం లోపు రాసేద్దాం. ఇప్పుడు C I గారిని కలిసేసి వస్తాను,”అంటూ ప్రభంజనం లాగ బయటికి పోయాడు. 

   

   అక్కడున్న కానిస్టేబుల్స్ అందరు ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటూ, కళ్ల తోనే ప్రశ్నించుకుంటున్నారు. రైటర్ గారు కాస్త తేరుకొని ,”రేఖ , నువ్వెళ్ళి కాస్త టీ పట్టుకురామ్మ,”అని చెప్పి ఏవో ఫైల్స్ చూడడం మొదలెట్టాడు. అందరి మనస్సులో ఆమె పట్ల జాలి కలుగుతున్నది. ఆమెకు ఎలా సాయం చేయాలో పాలుపోవటం లేదు. 

 

     ప్రసాద్ పోలీస్ స్టేషన్ కి చేరేసమయానికి యోగిరాజ్ జీప్ వెళ్లడం గమనించాడు దూరం నుంచే. లోపలకి వెళ్ళాలా?  వద్దా? అని ఆలోచిస్తూ బైకు మీదనే కూర్చొని స్టేషన్ వంక చూస్తున్నాడు.  కొద్దీ సేపట్లోనే టీ కెటిల్ పట్టుకొని దగ్గరలోనే ఉన్న టీ  బంకు దగ్గరి కొచ్చింది కానిస్టేబుల్ రేఖ. ఎదో ఆధారం దొరికినట్లయింది ప్రసాద్ కి. వెంటనే బైకు ని ఆ టీ  బంక్ దగ్గరికి నడిపించాడు.

 “హలో మేడం,”అన్నాడు రేఖ ని చూస్తూనే. ఆమె కూడా గుర్తు పట్టింది. 

  “మీరా! మిమ్మల్ని ఆ మేడం  గారి ఇంటిదగ్గరే చూశాను. మా యసై సారూ మిమ్మల్ని పక్కకి తోసారు కూడా. అది మీరే కదూ?”అంటూ కొంచం సంబరంగానే అడిగింది. 

      “అవునండీ. ఆ నేను నేనే. మా మేడం గారిని ఎక్కడ ఉంచారు. ఇక్కడే ఈ స్టేషన్ లోనేనా? ఆమెను కలవటానికి కుదురుతుందా?” అడిగాడు చాలా  మర్యాదగా.

     “అలాగే సార్. టీ  తీసుకొని లోపాలకి వెళదాం. కానీ మీరు  త్వరగా వెళ్లి పోవాలి. మా ఎసై సార్ చూసాడంటే కొంపలంటుకు పోతాయి,” అంటూ కాస్త బెదురుగానే చెప్పింది.

“అలాగే. అసలేం జరిగిందో మీకు తెలుసా ?”

      అటు ఇటు చూసి టీ  బంకు కి కాస్త దూరంగా తీసుకెళుతూ ,”ఒరేయ్, పది టీ  లు పోయారా ఆ కెటిల్ లో ,” అని ,”సారూ, నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు ఏ  కేసు లేదు ఆ మేడం గారి మీద. మా సార్ ఫ్రెండ్ అంట సుబ్బారావు అని.  ఆయన భార్య అంటగా ఈమె. ఈమెను బెదిరించమన్నాడంట. అతనితో ఎదో ఒప్పదం చేకునేదాకా. అందుకే ఈ యసై సార్  ఈమెనిలా ఇబ్బంది పెడుతున్నాడు. కానీ ఈయన  వాలకం చూస్తే ఆమెకి ఎక్కువ రోజులు మానం దక్కదనిపిస్తున్నది. మీరేదయినా చేయగలిగితే చేయండి. ఆ అక్కని చూస్తుంటే జాలేస్తుంది,” అంటూ  విషయం వివరించింది. 

అయితే సరే. “ఆమె భర్త ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో  తెలుసా?” 

“ఏమో సార్, ఇక్కడే పెద్దాసుపత్రి స్పెషల్ వార్డు లో ఉన్నాడని చూచాయగా తెలిసింది.”

“అక్క! టీ కెటిల్ లో పోసిన తీసుక  పో, ”అంటూ  అరిచాడు టీ  బంకు పిల్లాడు. 

“సార్! ముందుగాల నేనెళ్లత. ఆ తరవాత రండి మీరు,”అంటూ చక చక వెళ్ళిపోయింది రేఖ. ఆమెను కాస్త నెమ్మదిగా అనుసరిస్తూ స్టేషన్ లోకి వెళ్ళాడు ప్రసాదు. 

లోపలకి వేళ్ళ గానే కనిపించింది మైత్రేయి. అశోక వనం లోని సీత దేవి కూడా ఇంత ల వ్యధ చెంది ఉండదు. ఎందుకంటే ఆమె సీత. ఆమెకు తన రాఘవుడిపైన, తన వివాహ బంధం పయిన                              

నమ్మకం మెండు. ఎప్పటి కయినా తనకీ చర తప్పు తుందన్న ధైర్యం. పాపం ఈ మైత్రేయి కి అలాటి నమ్మకం గాని , అలా ధైర్యానిచ్చే  వ్యక్తి అండ గాని లేదు. పాత నేత చీర లో జుట్టంత రేగి పోయి, మొహమంతా పీక్కు  పోయి, అతి దీనంగా ముడుచుకు పోయి  కూర్చుని  ఉన్నది. రేఖ టీ గ్లాస్ ఒకటి ఆమె పక్కన పెట్టి నట్లున్నది. ఆ టీ  మీద తెట్టు కట్టినట్లుగా కనిపిస్తున్నది. ఒక ఈగ ఆ టీ  గ్లాస్ చుట్టే తిరుగుతున్నది. 

ప్రసాద్ దగ్గరికి వెళ్ళాడు. “మైత్రేయి గారు ,” అంటూ  అంటూ ఎంతో ఆద్రం గ పిలిచాడు. ఒక ఆప్తుడు పీల్చినట్లయింది ఆమెకు. దుఃఖం ఉప్పెన ల పొంగింది. చేతులలో మొహం దాచుకొని వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. ప్రసాద్ ఆమెను అలా చూస్తూ ఆమె పక్కనే ఆ బెంచ్ మీదనే కూర్చున్నాడు. ఆమె కాస్త తేరుకున్న తరువాత,”మైత్రేయి, నువ్వు బెంగ పడకు. నేను చూసుకుంటాను.” అంటూ వెంటనే లేచి వెళ్ళిపోయాడు. 

అలా వెళ్లిన ప్రసాద్ నేరుగా అక్కమ్మ వాళ్ళ గూడెం కి వెళ్ళాడు. అక్కమ్మ గురించి వాకబు చేసాడు. అక్కమ్మ ఆడబిడ్డ చెప్పింది,”సారూ, మా వదినమ్మ ఈ టైం లో వాళ్ళక్కాయ్ బిడ్డ కాడనే ఉంటాది.” 

“ఎక్కడ?” 

“అదే సారూ మన పెద్దాసుపత్రి లోని జనరల్ వార్డు లో, ముందు గాల మంచమే. ఆడనే  కూకొని కనిపిస్తాది,” అని చెప్పింది.

ప్రసాద్ నిముషం కూడా ఆలస్యం చేయకుండా గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్లి జనరల్ వార్డు బయట ఒక మూల కూర్చొని ఉన్న అక్కమ్మ ను చూసాడు . అక్కమ్మ కూడా ప్రసాద్ ని చూసింది. 

“ఎటి బాబు ? ఇలా వచ్చిండ్రు? మీ ఇలాకా ఎవరినయినా ఇక్కడ  చేర్పించినారా?” అడిగింది.

“లేదు అక్కమ్మ. నీకోసమే వచ్చాను. మైత్రేయి గారు చాలా ప్రమాదంలో  పడ్డారు. ఆమెను పోలీసులు తీసుకెళ్లి స్టేషన్ లో కూర్చోపెట్టారు. నేను అక్కడ నుంచే వస్తున్న ,”

“ఓలమ్మో! ఎంత పనయినాది ! ఎం జరిగినాది బాబు? ” ప్రసాద్ చెప్పింది వినగానే హతాసు రాలయింది అక్కమ్మ. 

“అవన్నీ మాట్లాడుకొనే సమయం లేదు అక్కమ్మ. ఆమె భర్త ఆమె మీద కేసు పెట్టాడని  అంటున్నారు. అందుకని వాళ్ళాయన ఇక్కడే స్పెషల్ వార్డు లో ఉన్నాడని తెలిసింది.నువ్వు ఆయన్ని గుర్తు పట్టగలవా?”

“మహా బాగా! దుర్మార్గుడు.”

“అయి తే విను, నాకు తెలిసిన కుర్రాడు ఇక్కడే స్వీపర్ గ చేస్తున్నాడు. వాడితోటి నువెళ్ళి, అతన్ని చూపించు. మిగిలింది వాడే చూసు కుంటాడు. “పక్కనే నిలుచుని ఉన్న పిల్లాడిని పిలిచి “ఒరేయ్, నువ్వి ఆంటీ తోటి వెళ్ళరా ! నేను చేపిందంతా గుర్తుంది కదా?”

“ఆ అన్న! నువ్వేమి ఫికరవమాకు. నేను నీకన్ని సెబుతాగా,” అన్నాడు.

అక్కమ్మ సాలోచనగా, “ప్రసాద్ బాబు , మీరు వెంటనే వసుధరమ్మ గారి జూనియర్ రాజ్యాలచమి అమ్మగారిని కలవండి. ఆమె మీకు సాయం చేస్తారు,” అంటూ “పదరా పోరగా!”అంటూ గబా గబా స్పెషల్ వార్డ్ వైపుకి పోయింది. పోతూపోతూ,”బిడ్డ  నువ్వేమి దిగులవమాకు నేనిప్పుడే వస్తా,”అని అక్క కూతురికి చెప్పింది. ప్రసాద్ లాయర్ వసుంధర ఇంటి వై పు కి వెళ్ళాడు.          

(ఇంకా ఉంది)               

Written by Padma NeelamRaju

రచయిత గురించి:

పద్మావతి నీలంరాజు చండీఘర్ లో ఇంగ్లీష్ అధ్యాపకురాలిగా 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న రిటైర్డ్ ఉపాధ్యాయురాలు. ఆమె నాగార్జున విశ్వవిద్యాలయం ఆంధ్ర ప్రదేశ్ నుండి M A (Litt),
POST GRADUATE DIPLOMA IN TEACHING ENGLISH ,CIEFL, హైదరాబాద్‌ లో తన ఉన్నత విద్యను పూర్తి చేసింది. స్త్రీ వాద సాహిత్యంపై దృష్టి సారించి Indian writing in English లో Panjabi University, patiala , Panjab, నుండి M phil డిగ్రీ పొందింది. తెలుగు సాహిత్యం పైన మక్కువ ఇంగ్లీషు సాహిత్యంపై ఆసక్తితో ఆమె తన అనుభవాలను తన బ్లాగ్ లోను
( http://aladyatherdesk.blogspot.com/2016/02/deep-down.html?m=1,)
కొన్ని సాహితీ పత్రికల ద్వారా పంచుకుంటున్నారు. ఆమె రచనలు తరచుగా జీవితం మరియు సమాజం పట్ల ఆమెకున్న అనుభవపూర్వక దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి. ఆమె అధ్యాపకురాలిగా గ్రామీణ భారత్ పాఠశాలల్లో E-vidyalok- e-taragati (NGO) లో స్వచ్ఛంద సేవలందిస్తున్నారు. రచన వ్యాసంగం పైన మక్కువ. పుస్తకాలు చదవడం, విశ్లేషించడం (Analysis / Review) ఆంగ్లం నుండి తెలుగు లోకి అనువాదం(Translation) చేయడం అభిరుచులు . PARI సంస్థ (NGO) లో కూడా ఆమె గ్రామీణ భారత జీవన శైలిని ప్రతిబింబించే వ్యాసాలను కొన్నిటిని తెలుగులోకి అనువదించారు (padmavathi neelamraju PARI). HINDUSTAN TIMES, తరుణీ ,మయూఖ, నెచ్చెలి వంటి పత్రికలలో కొన్ని కధలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. “Poetry is the sponteneous overflow of power feelings; recollected in tranquility” అన్న ఆంగ్ల కవి వర్డ్స్ వర్త్ తనకు ప్రేరణ అని చెబుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దాతృత్వం

సీ “రియల్”