పని ( కర్మ)

కామేశ్వరి

పని అంటే చాలా రకాలుగా కనిపిస్తుంది లోకంలో. దానినే చర్య, చేష్ట, వృత్తి, కృషి,అని రకరకాలుగా పిలుస్తారు జనం ప్రాంతాలను బట్టి. పనిచేయుని జీవి ఈ భూగోళం మీద లేనేలేదని చెప్పవచ్చు. బ్రహ్మ నుండి కీటకం వరకు పనిచేయ
వలసిందే తమకు తగ్గ పనిని. ఇది సృష్టి నియమం కూడా. పనిలో రెండు విభాగాలుఉన్నాయి. శారీరకమైన,వాచకమైన మానసికమైన వని . జలచరాలైన, చతుష్పాదాలైన, విహంగాలైన, ఉభయ చరాలైన, ఉబ్దిజాలైన ( పేను, నల్లి) వాటి పని వాటికుంది. పని అంటే సముపార్జన అని కూడా చెప్పుకోవచ్చు. పనిలో ప్రాథమికమైనవి ఆహార సముపార్జన ,సంతాన సముపార్జన, ధన సముపార్జన, కొన్ని సాంఘికమైన సమూపార్జనులు కూడా ఉన్నాయి . మన పురాణాల ప్రకారం “పని “మూడు రకాలుగా విభజింప బడింది. సత్వ, రజో, తమో గుణాలని. ఆ గుణాల ప్రభావాన్ని బట్టి మనలో పనులు జరుగుతూ ఉంటాయని చెప్పబడింది.జీవి మనుగడ” పని” లేనిదే జరగదు. అందుకే అన్నారు పెద్దలు ” కృషితో నాస్తి దుర్భిక్షం ” అని.
. పని అంటే వృత్తి అని కూడా అనుకున్నాం కదా. పూర్వపు రోజులలో ప్రజలందరూ వారి వారికి నిర్దేశించిన వృత్తులను ఆచరించేవారు. వృత్తులను బట్టి కులాలు కూడా ఏర్పడ్డాయి. ఉదాహరణకి చాకలి, మంగలి,కమ్మరి,వ్యాపారి, కంసాలి, కంచరి, వడ్రంగి, శిల్పి. రైతు,మానవజాతి కావాల్సిన వస్తువులను తయారుచేసి అందజేసేవారు. అదే వారి ప్రవృత్తిగా కూడా మారిపోయింది. పరస్పర సహకారంతో ఒకరి పనిని మరొకరికి అందజేస్తూ సంఘాన్ని ముందుకు నడిపేవారు. బ్రాహ్మణవృత్తి అని కూడా ఒకటి ఉండేది. అది మానసిక సంబంధమైనది.పనికి ప్రోత్సాహం తోడైతే విజయం అందుకోవడం సులభమే. కానీ నేటి తరంలో పనితో కూడిన వృత్తులు మాయమయ్యాయి. ఉన్నా అవి చేతి పని కన్నా యంత్రపు పని మీదే ఆధారపడిపోయాయి. తక్కువ పనితో ఎక్కువ ఫలితాన్ని పొందే లాగ చేస్తున్నాయి. దీనితో పని అవసరం తగ్గి అవయవాలు కుంటూ పడుతున్నాయి. అనేక రోగాలకు నిలయం అవుతున్నాయి. నేడు ప్రపంచం ఒక కుగ్రామం అయిపోవడంతో కార్పొరేట్ సంస్థలు అన్ని పనులలోను కలగజేసుకుంటూ వృత్తులను కాస్త వెనక్కు నెట్టాయి. మనిషి “పనిమనిషి ” కాకుండా మరమనిషి అయిపోయాడు. కొన్ని రోజులలో మర మనుషులే అన్ని పనులు చేసే దశకు చేరవచ్చు.
మనుషులే కాదు” పని “విషయంలో ప్రకృతి కూడా తన సహాయాన్ని అందిస్తోంది. మానవ జీవ మనుగడకు కావలసిన తిండి, గుడ్డ గూడు సమకూర్చడానికి తన సాయ శక్తుల తోడ్పడుతోంది. మనిషి స్వలాభా పేక్షతో “పని”చేస్తాడు. కానీ ప్రకృతి” చేష్ట “నిస్వార్థం. ప్రకృతి ప్రసాదించిన అడవులు నదులు,సముద్రాలు,కొండకోనలు. పర్వతాలు పాక్షికంగా తమ పనిని నిర్వర్తిస్తూనే ఉన్నాయి., పంచభూతాలు కూడా ఈ పాంచ భౌతిక శరీరానికి కావలసిన వి అందిస్తూనే పనిచేస్తూనే ఉన్నాయి. అది అందరికీ తెలిసినదే. జంతువులు కూడా తమ తమ” పని “ని సహకార రూపంలో అందిస్తూనే ఉన్నాయి. వాటిని మనం అంతగా గమనించటం లేదు కానీ నిత్యము వాటికి మనిషి రుణపడే ఉంటాడు.
ప్రకృతి జీవులకు కర్మేంద్రియాలను ,జ్ఞానేంద్రియాలను ప్రసాదించింది, కాయక క ర్మ మానసిక కర్మ చేయడానికి అనువుగా. పనే కదా అని అనాలోచితంగా చేయకూడదు. కొన్ని పనులు సుఖానికి, దుఃఖానికి… కూడా దోహద పడతాయి.చేసిన “పని “ధర్మంగా చేస్తే కలకాలంనిలిచి ఉంటుంది. “పని “అధర్మం అయితే నీవు, నీ సంఘం కూడా దాని ప్రభావంలో పడేలా చూస్తుంది. దానం, ధర్మం,మంచి నడవడిక, జాలి దయ ప్రేమతో చేసే “పనులు “. వీటి వ్యతిరేకమైనవి అధర్మ” పనులు “. ఇవి మనిషిలో అహాన్ని పెంచి ద్వేషానికి దారి తీస్తాయి. స్వార్థం పెరిగి ఆధిపత్య పోరుకు ముందుంటుందిపని. ఈ” చేష్ట ” వల్ల అశాంతి పెరిగి ఐకమత్యం దెబ్బ తింటుంది. అందుకే ప్రతి “పనికి “ముందు మంచి చెడులను ఆలోచించి చేయాలి. విచక్షణ కలిగి ఉండాలి. ఒక్కొక్కసారి తమకు ఏమాత్రం సంబంధం లేని “పని” లో వేలు పెట్టి కష్టాలలో పడటం చూస్తూనే ఉంటాం. ( చిన్నప్పటి కోతి కథ జ్ఞాపకం ఉంది కదా )
పనులు శారీరకమైనవి, మానసికమైనవి కూడా ఉంటాయి. కొన్ని పనులు మనం తెలిసి చేస్తాం. కొన్ని పనులు మన సంకల్పం లేకుండానే జరిగిపోతూ ఉంటాయి. ఉదాహరణకి గాలి పీల్చుకోవడం, గుండె కొట్టుకోవడం, రక్త ప్రసరణ, జీర్ణక్రియ ఇలాంటివన్నీ. నిరంతరం అంతరేమ్ ద్రియాలు శరీర రక్షణకు” పని చేస్తూనే ఉంటాయి. జీవం ఉన్నంత వరకు విశ్రాంతి లేని “పని “వాటిది. ఒకరికి ఒకరు సహకరించుకుంటూ నిరంతరం” పని”చేస్తూనే ఉంటాయి. మన బాహ్య” పని “మీదే అంతరేంద్రియాల “పని “కూడా ఆధారపడి ఉంటుంది. ” పని” శరీరానికి రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. “పని” లేకపోతే కృంగుబాటుతనం కూడా దరి చేరుతుంది. అందుకే పని మనకు అంతర్ వైద్యుడు. వైద్యుడు ఇచ్చిన మందులు వేసుకుని లాభ పడినట్లు, “పని”చేసే అందరూ లాభపడాలి. కార్మికుడు యజమాని యొక్క ఆజ్ఞను ఎలా శిరసావాహిస్తాడో అలాగా మనసు, బుద్ధి యొక్క సహకారంతో “పని “చేయాలి.
” పని “ని కూడా భవత్కార్యంగా భావిస్తారు అన్ని మతాలవారు. ఇంగ్లీషు వారు కూడా ” వర్క్ ఈస్ వర్షిప్” అన్నారు. ఒక విధంగా ఐకమత్యం కూడా “పని ‘వల్లే ఏర్పడుతుంది. ఇష్టపడి చేసే “పని” కష్టమనిపించదు. మన మానసిక భావనే పనిలోని కష్టము సుఖము. “పని” పదిమందిని కలుపుతుంది. ఒక్కరే చేసే పనులు కన్నా పదిమందితో కలిసి చేసే పనులే ఎక్కువ. మనుషులే కాదు కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు కూడా ఒకరికొకరు సహాయ సహకారాలను అందించుకుంటూ ఐకమత్యంతో నడవడం వలన మానవ జీవితం సజావుగా సాగుతోంది.బుద్ధి నిర్ణయించిన దానిని మనసుఇంద్రియాలను పనిముట్లుగా వాడుకొని” పని” జరిగేలా చేస్తుంది. బతుకు అంతా పుట్టినప్పటినుంచి మరణించేదాకా “పని “మీదే ఆధారపడి జీవనం సాటిస్తోంది. మానసిక “పని’,శారీరక “పని “కూడా మనిషి ఔన్నత్యానికి దోహదపడేవే.
( చిన్నప్పటి కోతి కథ:– ఒక ఊళ్లో కొంతమంది వడ్రంగి పని వారు దుంగలను మధ్యకు చీల్చే పనిని రంపన్తో కోస్తున్నారు. ఇంతలో మధ్యాహ్నం భోజన సమయం కావడంతో కోసే దుం గకు మధ్యలో ఒక కర్రపిడిని పెట్టి ( చీల్చినవి రెండు కలవకుండా ) వెళ్లారు. పక్కనున్న చెట్టుపై కొన్ని కోతులు ఉన్నాయి. మనుషులు అలా వెళ్లడం చూసి అందులో ఒక తుంటరి కోతి దుంగ మీద గెంతి కొంచెం సేపు ఆట్లాడి, దుంగ మధ్యన ఉన్న కర్రపిడిని లాగడానికి ప్రయత్నించింది. ఎంతకీ రాకపోయేసరికి నిలబడి ఒక కాలు చీలిక దగ్గర పెట్టి గట్టిగా లాగింది. పిటి ఒక్కసారి చేతిలోకి రావడమేమిటి కోతి కాలు రెండు దొంగల మధ్య చిక్కుకుపోయింది. కుర్రో మొర్రో అంటే లాభమేంటి. తనకు మాలిన పని చేయడం ఎందుకు, దాని ఫలితం అనుభవించడం ఎందుకు. ఈ కథ మా చిన్నప్పుడు మా తాత మామ్మలు చెప్పేవారు. రెండు లేక మూడవ తరగతి తెలుగువాచకములో చదివినట్టు గుర్తు ).
*********

Written by Kameshwari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

చిన్న కుటుంబం. చింత లేని కుటుంబం.

తిశ్రగతి