బాధ్యతా నీవు ఎక్కడా?

మాధవ పెద్ది నాగలక్ష్మి

హమ్మయ్య ఎన్నికలు అయిపోయినాయి.అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాజకీయ నాయకులు, ప్రజలు కూడా చాలా సంతోషించారు. నాయకులు ‘హమ్మయ్య గొంతులు పోయేటట్లుగా ఉపన్యాసాలు ఇవ్వక్కరలేద’ని ప్రజలు ‘ఇహ టీవీలలో ఇతర వార్తలు అన్ని వినవచ్చు’అని సంతోషించారు.

అందరూ, ముఖ్యంగా గ్రామాలలో ఓటు హక్కు తమ హక్కుగా భావించి వినియోగించుకున్నారు. ముసలి వాళ్లు కూడా ఎండలు లెక్కచేయకుండా వరుసల్లో ఓర్పుగా నిలుచుని మరీ ఓటు వేశారు. దివ్యాంగులు కూడా కుర్చీలలో వచ్చి మరీ ఓటు వేశారు. ఇంతమంది చురుకుగా ఓటు వేస్తున్నప్పుడు యువతకు ఏమి కష్టం వచ్చింది ఓటు వేయడానికి? ప్రభుత్వం సెలవు ఇచ్చి, జీతం ఇచ్చింది ఇంట్లో కూర్చోవడానికా?సినిమా టికెట్ల కోసం లైన్లో ఎంత సేపైనా నిలుచోవడం లేదా? పబ్బులలో ఎంతసేపైనా నిలబడి ఉండడం లేదా?

ఇటువంటి వారికి ప్రభుత్వం ఒక చట్టం తేవాలి. ఓటు వేయని వారికి జరిమానా ఇంకా ఒక నెల జైలు శిక్ష అని! అంతేకాదు వాళ్ళకి ప్రభుత్వ సహాయాలు అందింపబడవని కూడా చట్టం తేవాలి! అప్పుడు గాని తమ కర్తవ్యాన్ని సరిగ్గా చేయరు.

ఈ విషయంలో తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల పాత్ర కూడా చాలా అవసరం.పిల్లలకు ఊహ వచ్చినప్పటి నుంచే అంటే 7,8 తరగతులలో చదువుతున్నప్పుడే ఓటు విలువను గురించి చెప్పాలి. ఉపాధ్యాయులు వారానికి ఒక క్లాసులోనైనా ఓటు విలువ గురించి వివరంగా బోధించాలి.ఆ చిన్న వయసులో వింటేనే వారికి బాగా వంట పడుతుంది దాని విలువ !ఎంత కష్టపడితే ప్రజాస్వామ్యం నిలుస్తుందో వారికి తెలియ చెప్పాలి.

వీలైతే మన్ కీ బాత్ వంటి ప్రోగ్రామ్లలో ఈ విషయమై యువతతో చర్చించాలి. అప్పుడు అందరికీ మనసులలో బాగా నాటుకుంటుంది.ఏమంటారు మీరు?
ఇప్పటి ఈ కార్పొరేట్ ఉద్యోగులు యువత తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా అదనంగా వచ్చిన సెలవు రోజును బాగా ఎంజాయ్ చేసేందుకు వినియోగించారన్న వార్తలు పత్రికలలో విన్న నాకు ఎంతో బాధ కలిగి నా అభిప్రాయం ఇలా రాసాను. మీరేమంటారు? నాతో ఏకీభవిస్తారా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కాశీ విశ్వనాథ తండ్రీ విశ్వనాథ పాట విశ్లేషణ:

ఆ పా(త)ట మధురం :