అమ్మ అన్న పిలుపే
మధురాతి మధురం..
అమృతం పంచిన అమ్మా..
కాపాడే
గొడుకు నీడ అమ్మా..
త్యాగానికి నిర్వచనం అమ్మా..
అందరి అమ్మలూ ఇంతే!
ఉపమానాలన్నీ ఒక్కటే..
ఒక చెట్టు పువ్వుల
సువాసనంతా ఒక్కటే..
అమ్మల స్వభావమూ ఇంతే!
మరి ఆ అమ్మల సంతానం ఎలా ఉంటుంది!?
పిల్లలు ఎందరున్నా
ప్రేమగా సాకుతుంది
అమ్మ..
ఆ పిల్లలంతా కలిసి అమ్మను సాకలేరెందుకో!
పెరిగాక స్వార్థం ఆవరిస్తుందా?
అమ్మ శపించదన్న ధీమానా..
గుండెల్లో దాచుకున్న అమ్మతో గుండేవిప్పి మాట్లాడుతున్నారా!
కడుపారా పాలు తాగి..
కమ్మని అమ్మ చేతి
వంట తిని, అమ్మకు
ఒక ముద్ద
పెడుతున్నారా..
అనురాగంగా ఆదరణగా ఉంటున్నారా..!?
ఇంటి కోసం పిల్లల
కోసం చాకిరంతా చేసి, వడలిపోయిన దేహం..
సడలిపోయిన కీళ్లు..
తప్పిపోయిన చూపు..
మిమ్మల్ని కన్న మాతృమూర్తినీ
ఆఖరి శ్వాస వరకు
ప్రశాంతంగా ఉంచుతున్నారా..
కసురుతున్నారా విసిరి కొడుతున్నారా
ఆశ్రమాలకు అంపుతున్నారా..
ఏది ఎవరికి వాళ్లు గుండెల మీద చేయి వేసుకొని ప్రశ్నించుకోండి
అంతరాత్మ నడగండి
చాలు!
మాతృ దినోత్సవ వేడుకలు సార్ధకమ వుతాయి.