ఎక్కడుంది” అమ్మ” అని మాట కన్నా కమ్మని మాట….
ఎవరు పాడగలరు “”అమ్మా “” అను రాగం కన్నా మిన్నయిన రాగం…..
” అమ్మే గా “ఆది నిలయం…. ప్రాణ ప్రతిష్ట చేసే గర్భాలయం ……అమ్మ పాలే ఆది నైవేద్యం
అవతారం మూర్తి అయినా.. అణువంతే పడతాడు అమ్మ గర్భాన…..
అమ్మ పేగు తెంచుకొని…….. భూమి మీద పడి
వటు వింతంతై అయినట్లు ….. అంతవాడవుతాడు
నూరేళ్ల బ్రతుకు నడయాడడానికి ….అమ్మ చేతి వేళ్ళతో
.. నడక నేర్చు కుంటాడు…
బతకడానికి….. గోరుముద్దలు ఆరగిస్తాడు..
మరొక “అమ్మకు” సూత్రధారి… మరో “నాన్నకి” నాంది…
ధనవంతులకైన, దరిద్రులకైన …”. అమ్మ ఒడే ” మొదటి పాన్పు …
అమ్మ….వాసనే… సుగంధాల పరిమళం…
హతవిధీ!
ప్రేగు పంచుకొని పుట్టినవాడు……. ప్రేగు తెంచుకొని దూరం జరుగుతాడు….
కానీ అమ్మ చూపు తాబేలు చూపు…
దూరమైనా మనసులో పదిల పరుచుకుంటుంది…
బిడ్డ బాగోగులు చాలు తనకు…
ప్రకృతిలో.. బిడ్డలందు..స్వార్ధము లేనిది…. అమ్మ తన మొక్కటే….
.. బిడ్డలు ఎందరైనా తల్లి ప్రేమ నందు లేదు వేరు…
అమ్మ” తల్లివేరు” అయితే….. బిడ్డ చెట్టు…
అది ఎంతెంత పెరిగినా…. తాను( వేర్లు ) వ్యాపించి…..
దాని ఉనికిని నిలబెట్టడాని…… తాపత్రయపడుతుంది శక్తిమేర…
చీమ నుండి బ్రహ్మ వరకు…. లోపల వ్యాపించినదంతా…. అమ్మ తనమే..
అమ్మ లేని చోటు లేదు…. తల్లి లేని బిడ్డలు లేరు..
అమ్మను మరిచిన వాడు…..తనను తాను కోల్పోయిన జీవచ్ఛవం….
**********