సేవానిరతిలో మెరిసిన స్వాతిముత్యం – పి. గీత

సేవా

ధవళ వస్త్రధారణం ,సేవా తత్పరాయణం కలగలిసిన కరుణామూర్తి, శ్రీమతి పి. గీత. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా అభినందిస్తూ –

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ప్రతి సంవత్సరం , మే, 12 న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ అవార్డు ప్రదానం చేస్తారు. మే ,12న 1820లో నైటింగేల్ జన్మించారు. 1853లో లండన్ లోని ఓ స్త్రీల ఆసుపత్రిలో తన వృత్తి ధర్మాన్ని ప్రారంభించిన ఈమె క్రిమియా’ యుద్ధంలో గాయపడిన సైనికులకు సేవలు అందించే నిమిత్తం నర్సుల బృందానికి నాయకత్వం వహించారు. ఆ క్రమంలో అర్థరాత్రి కూడా అని చూడకుండా దీపం చేత పట్టుకుని వైద్య సేవలు అందించడంతో అందరూ ఆమెను’ Lady with the lamp’ పిలిచేవారట. ఆధునిక నర్సింగ్ వ్యవస్థాపకురాలైన ఈమె నర్సుల శిక్షణ కళాశాల స్థాపించిన మొదటి వ్యక్తిగా రికార్డుకెక్కారు. 1859 లో ‘Notes On Nursing’ పుస్తకాన్ని కూడా వెలువరించారు.

నర్సింగ్ వృత్తిలో తన అసామాన్య ప్రతిభా పాటవాలకు, సేవా తత్పరతకు గుర్తింపు సూచకంగా ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజు సమర్పించుకొని మే 12న ఈ అవార్డును ప్రధానం చేస్తారు. ప్రపంచమంతా ఈ వేడుకలు జరుపుకుంటారు. మన దేశంలో 1973లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ అవార్డును ప్రారంభించింది. భారత రాష్ట్రపతి అవార్డులు అందజేస్తారు . ప్రజారోగ్య సంరక్షణలో నర్సుల తోడ్పాటు వెలగట్టలేనిది. ఈ అవార్డును కేంద్రం ,కేంద్ర పాలిత ప్రాంతాలు,స్వచ్ఛంద సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు మొదలైన వాటిలో విశిష్ట సేవలు అందించే నర్సులకు ఈ అవార్డు కింద ఒక పతకం ,ప్రశంసా పత్రం, జ్ఞాపిక, 50 వేలు నగదును బహుకరిస్తారు. దీనిని భారత రాష్ట్రపతి అందజేస్తారు. ఆరోగ్య సంరక్షణలో నర్సుల సేవ గణనీయమైంది. తెల్లని వస్త్రాలు ధరించి తలపై తెల్లని టోపీ ధరించి ,ముఖంపై చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనసుకు చాలా ఆహ్లాదాన్ని అందిస్తారు.సమాజానికి వెన్నెముక లాంటి వారు నర్సులు. ప్రజా సంరక్షణకై తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి రోగులకు సేవలందించే వీరిని “ప్రపంచ ఆరోగ్య సంస్థ” ప్రశంసిస్తూ – ప్రపంచంలో సగానికిపైగా ఆరోగ్య కార్యకర్తలు నర్సులుగా సేవలందిస్తున్నా, ఇంకా 5.9 మిలియన్ల నర్సుల ఆవశ్యకత ఉందంటూ ,వీరి సేవలకు గుర్తించి వారికి సరైన సంరక్షణ ,బీమా, సకాలంలో వేతనాలు అందిస్తూ ప్రోత్సహించాలని పేర్కొంది. .

ఆరోగ్య సంరక్షణలో నర్సుల సేవ గణనీయమైందని పేర్కొన్నారు
నాటి రాష్ట్రపతి రామనాథ్ కోవింద్. కోవిడ్ -19 పై ఏక తాటిన పోరాట ప్రటిమను ప్రదర్శించారు .వీరు కోవిడ్ వాక్సినేషన్ విజయవంతంగా జరపటంలో నర్సులదే క్రియాశీల పాత్ర అన్నారు. “మీరు దేశానికి ఆశాకిరణం , మీ సేవలకు యావత్ దేశం రుణపడి ఉంటుందన్నారు” రామ్ నాథ్ కోవింద్ .కోవిడ్ – 19 సమయంలో అసువులు బాసిన నర్సులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని పేర్కొన్నారు. ఉత్తమ జాతీయ నర్సులుగా ఎంపికైన బృందానికి కోవిడ్ కారణంగా వర్చువల్ గా అవార్డు ప్రధానం చేశారు రామ్ నాథ్ కోవింద్ .

మనదేశంలో నర్సులుగా వృత్తిని నిర్వహిస్తూ, తమ విశేష కృషికి గాను అవార్డులు అందుకున్న వారికి కోవిడ్ – 19 కారణాల వల్ల వర్చువల్ గా అవార్డుల ప్రధారోత్సవం జరిగింది. తదనంతర రాష్ట్రపతి
శ్రీమతి ద్రౌపది ముర్ము సత్కారం కోసం ఆహ్వానించగా వెళ్ళిన వారిలో శ్రీ మతి పి. గీత ఒకరు.
కేరళ రాష్ట్రానికి చెందిన గీత. పి. నర్సుగా విధులు నిర్వర్తిస్తూ ఉత్తమ కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డు అందుకున్నారు.నిఫా విపత్తు సమయంలో వివిధ కార్యక్రమాల్లో క్రియాశీల పాత్ర పోషించారు. ఆమె వృత్తి ధర్మానికి ,నిబద్ధతకు ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ప్రాణాంతకం నిఫా వైరస్ కేరళను వణికించిన సమయంలో ఆమె విశేష సేవలు అందించింది. 33 సంవత్సరాల ఉద్యోగ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించి సమాజానికి సేవ చేసినందుకు జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ 2020 అవార్డుతో జాతీయ ప్రభుత్వం ఆమెను సత్కరించింది. శ్రీమతి పి. గీత కోజికోడ్ లోని ఉత్తర జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో వృత్తిని ప్రారంభించి, అంచలంచెలుగా ఎదుగుతూ పదవీ విరమణ చేసిన ఆమె, కోజీ కోడ్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలోవిధులు నిర్వర్తిస్తున్నారు.

జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు స్వీకరణ నిమిత్తం ఢిల్లీ వెళ్తుండగా, కేరళ నిలంబూరుకు చెందిన 32 ఏళ్ల సైనికుడు శ్రీ సుమన్, జమ్ము కాశ్మీర్ కు వెళ్తుండగా విమానం టేకాఫ్ ఐన 20 నిమిషాలకు కుప్పకూలిపోగా అత్యవసర వైద్యసేవల సంరక్షణ సిబ్బంది అభ్యర్థన మేరకు మొదట స్పందించిన వారు, శ్రీమతి పి .గీత. మరో ఇద్దరు వైద్యులతో కలిసి కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సి.పిఆర్.)చేసి అతన్ని ప్రాణాపాయ స్థితి నుండి రక్షించింది. ఆమె తన అభిప్రాయాన్ని ఇలా వెల్లడించారు : సుమన్ గారి ఆరోగ్యాన్ని పరిశీలించినప్పుడు రక్తపోటు ,పల్స్ రేటు చాలా తక్కువగా ఉండి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదు రవగా, సి . పి. ఆర్. తర్వాత ఇంట్రా వీనస్ ద్రవాన్ని అందించిన కొంతసేపటికి అతను స్పృహలోకి వచ్చి తేరుకున్నాడని , ఢిల్లీ చేరిన వెంటనే వైద్య బృందానికి అతన్ని అప్పగించాకే మేము మా గమ్యస్థానాలు చేరుకున్నామని చెప్పారు .

అదే విమానంలో ” డబ్ల్యు. హెచ్ .ఓ .”అధికార ప్రతినిధి డాక్టర్. అశీల్ కూడా ప్రయాణిస్తున్నారట. ఆయన మాట్లాడుతూ – గీత విమానం ల్యాండ్ సమయంలో తన సీటుకు తిరిగి వచ్చిన తర్వాత మాత్రమే ఆమె నర్సు అని గ్రహించానని, ఆమె సకాలంలో సీపిర్ ఇవ్వకుంటే సుమన్ బ్రతికేవాడు కాదని డాక్టర్ అశీల్ పేర్కొన్నారు. అత్యవసర సంరక్షణ సిబ్బంది ఉండడంతో నా పని కూడా చాలా సులభమైందని అన్నారు.
శ్రీమతి.గీత జీవిత భాగస్వామి, పి. సత్య ప్రకాష్ గారు “ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా” మాజీ అధికారి. ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు స్వీకరణ నిమిత్తం ఢిల్లీకి వెళ్లే సమయంలో ఒక రోగిని రక్షించడం యాదృచ్ఛిమైనా, సంచలనంగా మారడం విశేషా న్ని సంతరించుకుంది.
కేరళకు చెందిన పదివేల మంది నర్సులు భారత్ వెలుపల ఉన్నారని ,తాను విదేశాలకు వెళ్ళ నందుకు ఎప్పుడూ చింతించ లేదంటారామె. నా దేశ ప్రజలకు సేవలు అందిస్తున్నందుకు లభిస్తున్న సంతృప్తిచాలంటారు. కోవిడ్ – 19 నిబంధనల ప్రకారం నాటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వర్చువల్ గా అవార్డు ప్రధానం చేశారు. విజేతలకు 50 వేలు నగదు, జ్ఞాపిక, ప్రశంసా పత్రం ఇస్తారు.
ప్రజారోగ్య సంరక్షణకై తమ ప్రాణాలను ఫణంగా పెట్టి, రోగులకు సేవలు అందించే వీరిని ధన్వంతరీ సహాయకులుగా ఇలలో జన్మనెత్తారని మనం చెప్పవచ్చు. “వాల్ పెయింట్ బరి అభిప్రాయ ప్రకారం : పిస్క్రిప్షన్ లేకుండా ఓదార్పునిచ్చే కరణమూర్తులు నర్సులు అంటారాయన” తమ నిరంతర సేవలతో సమయం చిక్కక, కుటుంబాలతో గడిపే సమయంలేక ,వారి జీవితాలు ఎంతో నిరాశ నిస్పృహల్లో ఉంటాయి. అలాంటివారు తమకు తామే ప్రేరణ కల్పించుకుంటూ ,తమకు నచ్చిన కళల్ని అభ్యసిస్తూ, పుస్తక పఠనాన్ని కొనసాగిస్తూ, చరవాణిలో తమ వారితో సంభాషిస్తూ ,వారికి దగ్గరగా ఉన్నామనే భావంతో, సంతోషంగా వృత్తి ధర్మాన్ని ఇంకా సమర్థవంతంగా కొనసాగించాలని ఆశిద్దాం…

రాధికాసూరి

Written by Radhika suri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అమ్మ – చెట్టు

దొరసాని