నాకు నలుమూలల
ఖాళీగా ఉంది
ఏమి తోచట్లేదు
అపుడే మనసు
కాసేపు ప్రశాంతతకు లోనవుతుంది
నిలకడ పడే లోపే స్థిరత్వం కోల్పోయాను
పార్క్ లో హాడావుడి
టైం అయిపోయింది వెళ్ళండని
కవిత మలుపు తిరిగింది అక్కడే
విశ్రాంతి కోల్పోయిన మనస్సుతో
రోజు నడిచే దారిలోకి నడుస్తూ
ఏంటీ కిరాయి బ్రతుకు సిటీలో
సంతోషం కూడా
కిరాయిగా లభిస్తుందిక్కడ
పైసలు ఖర్చు చేస్తే సరిపాయె
జాబ్ చేసే అందరూ
ఈ శని,ఆదివారాలు
బోలెడంత టైం పాస్ చేస్తూ
సంతోషాన్ని
అరువు తెచ్చుకుంటారు
అదెంతసేపు మళ్ళీ
తెల్లారె మాయమైపోతుంది
మిగిలిన రోజులన్ని
ఏదో తెలియని వెలితి
పీడిస్తుంటది తీర్చలేని బాధ
అలవాటైపోయిన వీటికి
నా మనస్సింకా అలవాటుపడలేదు
ఇంట్లో ఖాళీ సమయాలలో
సెల్ ఫోన్,టివి మాట్లాడుతుంటాయి
మనస్సుకు మాట్లాడే సమయం
దొరకడం లేదు ఆధునికం ఇది
శరీరంలో కిరాయిగా బ్రతుకుతూ