ఓటువేయడం యువత బాధ్యత

వ్యాసం

మనది ప్రజాస్వామ్య దేశం ప్రజల కొరకు ప్రజల చేత పరిపాలింపబడేప్రభుత్వం ప్రజలమైన మనకు మన ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు ఉంది ఆ హక్కును మనం ఓటు రూపేనా తెలియజేయవలసిన బాధ్యత ప్రజలది.ప్రజలమైన మనకు ప్రభుత్వం విధానాలు తీరుతెన్నులుప్రజలకు చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రజల అభివృద్ధి పరిసరాల అభివృద్ధి అంతా కండ్లకు కట్టినట్టు కనిపిస్తుంది.అందరుఎంతోకొంత చదువుకున్నవారు చదువుతున్న వారు అర్థం చేసుకున్నా పౌరులు ఉన్నారు. ఒటుమన బాధ్యత ఓటు హక్కు వినియోగించుకోవడం మన కర్తవ్యం ప్రజలు ఓటు వేయకుంటే మనం మన దేశంలో రాష్ట్రంలో జీవించనట్టే లెక్క తప్పక ఓటు హక్కునువినియోగించుకోవాలి అప్పుడే పౌరులుగా మన గెలుపుకు వెలుగు ఉంటుంది.
2019లోసార్వత్రిక ఎన్నికలలో మొదటి దేశ లో 69.2 ఓటు వినియోగం జరిగింది. క్రమంగా అదేఓటు వినియోగించడం 65.5%తగ్గింది.కారణం యువత,వలస కార్మికులు,వృద్ధులు,అవగాహన కార్యక్రమాలుయువత చేపట్టాలి.విద్యాధికులుప్రజలలో అయిష్టత రాకుండా చూడాలి. బోగస్, దొంగ, నకిలి, మరణించిన వారి ఓట్లు, వలసదారులఓటర్ల పేర్లు తొలగించే ప్రయత్నం యువత చేపట్టాలి.
యువత మొక్కుబడిగా కాకుండా బాధ్యతగా తమ ఓటును వినియోగించుకుంటూ వలస కార్మికుల చిరు వ్యాపారుల,ఆటో డ్రైవర్లు,నిర్మాణరంగ కార్మికులు,సెక్యూరిటీ గార్డులు,పనిమనుషులు ఓటు వినియోగించుకునే బాధ్యత యువత చేపట్టాలి భారతదేశంలో 97 కోట్ల ఓటర్లు అందులోదేశవ్యాప్తంగా 18 సంవత్సరాలునిండినవారు 4.90కోట్లుఉన్నారు.దేశ గతినిమార్చే యువత ‘ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థను కలిగిన భారతదేశం ఎంతో విలువైనది.మెరుగైన పాలన భవితను ఓటే నిర్దేశిస్తుంది. 2019 వరకు 17 వసార్వత్రిక ఎన్నికలలో ఎప్పుడు పోలింగ్ 70% మించలేదు. 2019 పార్లమెంట్ఎన్నికల్లోనే అత్యధికంగా 67.40%పోలింగ్ నమోదు అయినది.ప్రలోభాలకు లొంగరాదు అది మన బాధ్యత అని అనుకోవాలి.ఆశ కోసం ఓటు వేయరాదు మనం ఈ దేశంలో జన్మించి అనుభవిస్తున్న అవకాశాలు గుర్తించుకొని దేశ పౌరులుగా ప్రతి ఒక్కరి బాధ్యత అని ఓటు వేయాలి తప్పించుకోరాదు ప్రభుత్వం ఎన్నికల కోసం చాలా కష్టపడి డబ్బు ఖర్చు చేస్తుంది అది మనం గ్రహించాలి.మొట్టమొదట 1951-52 లోసార్వత్రిక ఎన్నికలకు అయిన వ్యయం రూ.10.45 కోట్లు 2014లో 16వసార్వత్విక ఎన్నికల నాటికి 3,800 కోట్లకునిలిచిపోయింది 2019ఎన్నికలకు 55 వేల కోట్లు చేరింది. ఈ సారి లక్ష కోట్లు దాటుతుంది.మన దేశంలో దాదాపు 97 కోట్లు ఓటర్ల కోసం 55లక్షల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, 10 లక్షల పైగాపోలింగ్ కేంద్రాలు ‘ 1.5 కోట్ల మందిపోలింగ్ భద్రతా సిబ్బంది .సాయి దధలాలవినియోగం అవసరమవుతుంది.
మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో 401 స్థానాలకు 53 పార్టీల నుంచి 1,874 మంది అభ్యర్థులుపోటీపడ్డారు. 1.96 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు జరిగాయి. 2019లో 543లోకసభ స్థానాలకు 673పార్టీల నుంచి 8 వేల మందికి పైగాఅభ్యర్థులు బరిలో నిలిచారు. 10 లక్షల పైగాపోలింగ్ కేంద్రాలు 2024 లోరాజకీయ పార్టీల సంఖ్య దాదాపు 2,500 కుపెరిగింది.పోటీ చేసే పార్టీలు, అభ్యర్థుల సంఖ్యపెరిగే కొద్దీ వ్యయం ఎక్కువవుతుంది.
యువత మద్యం మత్తు డబ్బు ఎలాంటి ఆశకు లోబడరాదు.మనం జన్మించినందుకు మన దేశ పౌరులం అయినందుకుమాత్రమే మనం మన ఓటు హక్కును వినియోగించుకోవాలి అందరిని ప్రోత్సహించాలి నిరాశతో నాకు డబ్బులు ఇస్తే వేస్తాను అలాంటి ధోరణి మారాలి ఎవరన్నా ఆశ చూపిన కట్నాలు కానుకలు అని ప్రలోభ పెట్టిన చీదరించుకొని వారికి బుద్ధి చెప్పాలి.అందరినిఓటువేయించే బాధ్యత యువత తమ బాధ్యతగా గైకొనాలి అప్పుడే దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది
రచన

Written by Dr.Nannapuraju Vijayasri

డా. నన్నపురాజు విజయశ్రీ
రాష్ట్రపతి అవార్డు గ్రహీత
రంగారెడ్డి జిల్లా
9100439884

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మదర్స్ డే

హృదయాంజలి