మన మహిళామణులు

శ్రీమతి నోముల నర్మదారెడ్డి

178 దేశాల్లో పర్యటించిన తెలుగు వనిత ఆమె.వయసుకి చదువుకి సోషల్ వర్క్ చేయడానికి సంబంధం లేదని మనసు మానవత్వం ఉండాలని ఎంతో ఆత్మీయంగా తన భావాలు అనుభవాలు అనుభూతులు పంచుకున్నారు శ్రీమతి నోముల నర్మదా రెడ్డిగారు…

ఆమె ఇంటర్ వరకే చదివారు పెళ్లి జరిగిన సమయానికి.కానీ భర్త ప్రోత్సాహంతో M.ABEd LLM LLB చదివారు.పెళ్లి సంసారం లో మునిగి 20 ఏళ్ల విరామం తర్వాత ఇన్ని డిగ్రీలు పొంది నేడు సోషల్ వర్కర్ గా తనవంతు పాత్ర పోషిస్తున్నారు.తండ్రి ఆర్మీ ఆఫీసర్ కావడంతో దేశంలో ఎన్నో ప్రాంతాల్లో నివసించటం రకరకాల హాబీలు ఆపై తాను జీవితం ని సార్థకం చేసుకోవడం నేటి ప్రతివారికీ ఆదర్శం సుమా! హైదరాబాద్ లో ఒకటి తరగతి చదివిన ఆమె తండ్రికి కాశ్మీర్ బార్డర్ లో డ్యూటీ పడటంతో అమ్మ తో కల్సి ఆమె పుట్టిల్లు నంద్యాలలో చదివారు.7_10క్లాస్ దాకా హాస్టల్లో చదివి ఆటపాటలు చదువులో మేటిగా నిలిచారు.
గాయని క్రీడా కారిణి గా రాణించారు.అంతర్జాతీయతెలుగు మహిళా సభలో పాల్గొన్నారు.1200పైగా సినీ సంగీత విభావరి లో పాల్గొన్నారు.జాతీయస్థాయిలో బాడ్మింటన్ క్రీడాకారిణి గా రాణించారు.178 దేశాల్లో పర్యటించిన అనుభవాలు మంగోలియా ఎడారి మొదలు క్యూబా అడవులు అన్నీ పుస్తకాలరూపంలో అందించారు.” ఆగదు మాప్రయాణం యుద్ధ క్షేత్రం లో
నదీతీరాల్లో మానడక మొదలైనవి ఆమె అనుభవాలు అక్షరబద్ధం చేయబడినాయి.ఇక కొన్ని ముఖ్యమైన అవార్డులు ప్రస్తావిస్తాను _ మహిళా రత్న స్టార్ మహిళ తెలంగాణ ప్రతిభా పురస్కారం మొదలైనవి.
1200పైగా బొమ్మలకొలువులు ఏర్పాటు చేశారు.కుంచెపట్టి చిత్రాలు గీ‌స్తారు.స్కూల్ లీడర్ గా గైడ్ గా పోటీల్లో పాల్గొన్న ఆమె 44ఏళ్లనుంచీ బాడ్మింటన్ ఆడటం విశేషం.2021లో స్పెయిన్ పోటీలో పాల్గొన్న నర్మద కవి నారాయణ రావు గారి బుక్స్ చదివి ప్రేరణ పొందారు.100ఆర్టికల్స్ పబ్లిష్ ఐనాయి.తెలంగాణా శివనందిపురస్కారం పొందిన ఈమె భర్త శ్రీ ఇంద్రారెడ్డి గారి తో కల్సి సోషల్ వర్క్ చేయడం ముదావహం.వృద్ధాశ్రమాలు కాకి పిల్లలు తమ ఇంట్లోనే వారి సేవ చేయాలని ఆటపాటలు పిల్లలకి ఇంటా బడిలో తప్పని సరిగా ఉండాలి అనేది ఆమె ఎలుగెత్తి చాటుతూ ఉన్నారు. ఓబీద మహిళకి ఈమధ్య సీమంతం చేశారు.
ఆమె తన సంఘసేవ గురించి ఇలా చెప్పారు ” మాస్నేహితులం తొలి వెయ్యి చందాతో అనాథాశ్రమాలకి కావాల్సిన సరుకులు అందించాం. 40 మంది పిల్లలకు ఫీజులు కట్టాం.ఆర్మీ ఫౌండేషన్ పేరుతో టి.బి.ఎయిడ్స్ రోగులకు మందులు అందిస్తున్నాం.ఎయిడ్స్ రోగుల పిల్లలకి మందులు ఆటవస్తువులు కావాల్సిన వన్నీ అందజేస్తాం.వరంగల్ కి చెందిన ప్రియా రెడ్డి అనే యువతి కి మెడిసిన్ చదువుకోసం రెండున్నర లక్షల ఫీజు కట్టాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఆంటీ అదుర్స్

నిశీధిలో వెలిగిన నియాన్ బల్బు – పూర్ణ సుందరి ఐ.ఏ.ఎస్.