మహిళా మణులు

కళా సేవలో తరిస్తూ అలరిస్తున్న శ్రీమతి కోట క్రిష్ణవేణి నాగదుర్గ -బై అచ్యుతుని రాజ్యశ్రీ

ఆమె గురించి చదివాక నాకు ఒక విషయం బాధకలిగించింది.అదేమంటే అసూయాపరురాలైన ఒకామె ఆమె కి వచ్చిన లేఖను చింపి టి.వి.ఛాన్సుని పోగొట్టడం….
ఆమె పేరు కోట క్రిష్ణ వేణీ నాగదుర్గ.
ఆమె తండ్రిగారి పేరు భాగవతుల సూర్య నారాయణగారు. వారు శాస్త్రీయ సంగీత విద్వాంసులు.
ఓకల్ తోపాటు వీణ, వయొలిన్, ఫ్లూట్, హార్మోనియం అన్ని వాయిద్యాలు వాయించేవారు. వారికి ఏమీ ఉద్యోగం లేదు. భార్య సువర్ణ మాలగారికి కూడా ఇవన్నీ నేర్పారు. వీరువురు చుట్టుపక్కల ఊళ్ళకు వెళ్లి ఇందులో ఎవరికి నచ్చిన అంశం వారికి నేర్పుతూ కుటుంబాన్ని పోషించేవారు.


క్రిష్ణ వేణికి ఓకల్, వీణ నేర్పారు. ఈమె సోదరి, సోదరునికి కూడా ఓకల్, వయొలిన్ నేర్పారు.
ఈమె 8 వ తరగతినుంచే తనకంటే చిన్న పిల్లలకు ప్రైవేటు చెప్పి కుటుంబానికి తోడ్పడేది. అప్పట్లో సంగీతం నేర్చుకునేవారు బహు తక్కువ.
ఈమె BSC పూర్తి చేశారు. స్కూల్, కాలేజీలలో ప్రతిసంవత్సరం జరిగే యానివర్సరీలలో పాటల పోటీలో ఈమెదే ప్రథమ స్థానం.

తరువాత పేపర్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా టెలిఫోన్ డిపార్ట్మెంట్ పరీక్షకు హాజరై అందులో టెంపరరీ ఉద్యోగం గంటకు వేతనం పద్ధతిలో సంపాదించారు. తరువాత 5 ఏళ్లకు ఆ ఉద్యోగం పర్మనెంట్ అయింది.

ఈమె భర్త శ్రీ కోట భీమ శంకర ప్రసాద్ గారు RTC లో చిరుద్యోగి. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. పిల్లల చిన్న వయసులో ఇద్దరూ ఉద్యోగాలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇద్దరూ షిఫ్ట్ డ్యూటీలు అవకాశం బట్టి మార్చుకుంటూ పిల్లలను సాకేందుకు చాలా ఇబ్బంది పడ్డారు. ఇవి చాలా మంది ఎదుర్కొనే సమస్యలే.
పెళ్లి, పిల్లలు సంసారం, ఉద్యోగం బిజీలో కూడా లోకల్ గా ఏమైనా పాటల పోటీలు ఉంటే పాల్గొంటూ ప్రథమ లేదా ద్వితీయ బహుమతులు సంపాదించే వారు ఉద్యోగంలో కూడా తన ఉత్తమ సేవలకు గాను 2006 లో సంచారసారథి అవార్డును టెలికాం జనరల్ మేనేజర్ శ్రీ అనంతరాం గారు, అప్పటి ప.గో.జిల్లా కలెక్టర్ శ్రీ అగర్వాల్ గారి చేతుల మీదుగా అందుకున్నారు.

అప్పుడప్పుడు చిన్న చిన్న శాస్త్రీయ సంగీత కార్యక్రమాలలో కూడా పాల్గొనేవారు. శాస్త్రీయ సంగీతం అంటే ఎక్కువ సాధన చేసుకునే టైం కుదరక అవి ఎక్కువ పాల్గొనేవారు కాదు. సినీ సంగీతం అయితే పని చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకోవచ్చని ఎక్కువ సినీ సంగీత కార్యక్రమాలలోనే పాల్గొనేవారు.

పూర్వం ఈటివి కోల్గేట్ పాడుతా తీయగా కోసం ఈమె ఎన్నికయ్యారు. కాని ఆడిషన్ గురించిన వివరాలు పంపిన ఈటీవీ వారి లెటర్ ప్రక్కింటి ఒక అసూయా పరురాలు ఈమెకు తెలియకుండా అందుకొని చించి పారేయడంతో ఆ అవకాశం పోయింది. ఇంక విరక్తితో మరల పాల్గొనలేదు.

కాని ఈమె ఆఫీస్ లోని సహోద్యోగి అయిన శ్రీ ఖాసిం గారు ఎన్నో సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఘంటసాల గాన సభలో మాత్రం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11 న జరిగే ఘంటసాల వర్ధంతి కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొంటారు. కాని కేవలం మాధుర్య ప్రధానమైన గీతాలు, సంగీత ప్రధానమైన గీతాలు మాత్రమే పాడతారు. అన్ని రకాల గీతాలు పాడరు. పైగా మిగిలిన గాయనీ గాయకులు, వాద్యకారులతో పాటు ఇచ్చే పారితోషికం అసలు తీసుకోరు. నేను అన్ని పాటలూ పాడటానికి ఇష్టపడను, పైగా నాకంటూ ఒక ఉద్యోగం ఉంది. వీరికి ఇదే వృత్తి కనుక నేను ఇక్కడ పాడినందుకు ఒక్క రూపాయి కూడా తీసుకోను అంటారు.

ఈమెకు ఈ ఘంటసాల గానసభలో ఒకసారి, దెందులూరు పెద్దింట్లమ్మ ఆలయ కమిటీ వారు ఒకసారి, తాడేపల్లిగూడెం రంగస్థల కళాకారులు సంఘం వారు ఒకసారి ఇంకా రెండు మూడు చిన్న సంస్థలవారు సన్మానాలు చేశారు.

కొంతమంది తెలిసిన వారు రాసిన పాటలను స్వరపరచి పాడి వాట్సాప్ ద్వారా పంపితే వారు అలాగే కాని వేరే వాయిద్యాలతో, గాయకులతో పాడించుకొని కానీ utube లో పంపుకుంటారు. వీరి ఊళ్ళో రికార్డింగ్ థియేటర్ లేని కారణంగా వారు కాకినాడ వచ్చి పాడమంటే పొరుగూరు రావడం కుదరదని సున్నితంగా తిరస్కరించి ట్యూన్ చేసి పంపేవారు. వారినుంచి కూడా పారితోషికాన్ని వద్దని తిరస్కరించేవారు.

2000 సంవత్సరం జనవరి 31 న BSNL common గా ఇండియా మొత్తం మీద 80,000 మందికి ( 50 సంవత్సరాల వయసు దాటిన వారికి) కంపల్సరీ గా voluntary retirement ఇవ్వగా ఆమె కూడా తప్పక ఆప్షన్ ఇచ్చి VRS తీసుకున్నారు.

ప్రస్తుతం తాడేపల్లిగూడెం స్వగృహంలోనే house wife గా ఉంటూ అప్పుడప్పుడు జరిగే చిన్న చిన్న లోకల్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

ఈమెకు పాటంటే ప్రాణం. ఈమె అభిమాన గాయనీ మణులు శ్రీమతి S.జానకిగారు మరియు శ్రీమతి వాణీ జయరాం గారు . ఈమెకు వారిరువురి పాటలంటే చాలా చాలా ఇష్టం

తన ఈ విజయానికి కారణం ఎవరని ప్రశ్నిస్తే చిన్నప్పుడు సంగీతం నేర్పిన తండ్రిగారు, ప్రతిసారీ ఈ కార్యక్రమాలలో పాల్గొనమని ప్రోత్సహించే తన భర్త కారణమని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Importance of Upbringing

ధరిత్రి – పిల్లలు – కథలు – The reality