గాలిని నీటిని కలుషితం చేసి పెరిగిపోతున్న భవంతుల కోసం
భూమిని నిలువుగా తవ్విపోసి
చెట్లను నిర్దాక్షిణ్యంగా నరికివేసి
ఏ ఉత్సవాలు ఇప్పుడు చేసుకుందాం ?
వానపాములు లేవు
కప్పల బెకబెకలు లేవు కుమ్మరి పురుగులు కానరావు
చిట్టి పిట్టల కువకువలు లేవు
కాకుల సందడి లేదు
పట్టణాల్లో పల్లెల్లో నీటి కోసం విలవిలా
మంచు కరిగిపోతున్నది
మట్టి మరిగిపోతున్నది
ఎండ పెరిగిపోతున్నది
ఏరులు వాగులు ఇంకిపోతున్నాయి
ఎలా చేసుకుందాం వేడుక ?
మని షీ ! మేధావి !మేలుకో !
మొక్కుబడి దినోత్సవాలు కాదు వేదికలపై మాటలు కాదు దీక్షా కంకణ బద్ధులమై సాగాలి మనం
ప్రతి ఒకరు పది చెట్లను పుడమికి కానుకగా ఇస్తే
ప్రతి బొట్టును ఒడిసిపట్టి ప్రతి చెరువును సంరక్షిస్తే
అప్పుడు కదా అసలైన పండుగ
అది కదా అంతర్జాతీయ ధరిత్రి దినోత్సవం.
__**_