నీ శ్రమను గుర్తించేది ఎవరు. నిరంతర నీ పరిశ్రమ
ఈ ఇల్లు ని తీర్చిదిద్దడం ఈ పిల్లలని చదివించడం
పెంచి పోషించడం ఇంటి బాధ్యతలు మరియు
ఉద్యోగ బాధ్యతలు అవి కాక కరెంట్ బిల్లు వాటర్ బిల్లు సైతం బ్యాంకు పనుల సైతం పని మనిషి లేకుంటే ఇంటి పని పూర్తి నీవంతే మగమహారాజులకి ఆఫీసు నుంచి వచ్చి టీవీ చూస్తూ పేపర్ చదువుతూ కూరగాయలు తెచ్చిపెట్టి సెల్ ఫోన్ తో ఆడుకుంటూ కూర్చుంటారు. నీకెక్కడిది రెస్ట్ నువ్వు తిన్నావా అని అడిగే వారు ఎవరు నువ్వు పడుకున్నావా అని అడిగే వారు ఎవరు నీవు ఒక శ్రామికురాలివి నిరంతర నిర్విరామ శ్రామికురాలివి నీ శ్రమ కు ఫలితం లేదు గుర్తింపు లేదు పిల్లలు ఎవరు చెడిపోయినా తల్లిదే బాధ్యత అంటారు భర్త తాగొచ్చునా భార్యది తప్పంటారు సంసారం చెడిపోయిన భార్యదే తప్పంటారు ఈ లోకం మార్పులు ఎప్పటికీ
ఎప్పటికీ నీవు శ్రామికురాలివి ఎప్పటికీ నీ శ్రమ గుర్తించు వారు లేరు మీ ఆరోగ్య పరిస్థితి నీదే నిన్ను పట్టించుకునే వారు ఎవరు ఎవరికోసం నువ్వు పుట్టావు ఎవరికోసం నువ్వు పెరుగుతున్నావు ఎవరికోసం నువ్వు బ్రతుకుతున్నావు ఎవరికోసం నువ్వు సంపాదిస్తున్నావు ఎవరికోసం నీవు ఎదురు చూస్తున్నావు మార్పు కోసమా ఫలితం కోసమా గుర్తింపు కోసమా నీ శ్రమ నిరంతరంగా కొనసాగుతూనే ఉంది ఏళ్ల తరబడి ఏడేళ్ల తరబడి కానీ నిన్ను గుర్తించే వారే లేరు అమ్మ మీ శ్రమను గుర్తించే రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీ కూతురు.
కన్నీటితో రాస్తున్నాను
ఈ రచనను శ్రామికుల దినోత్సవానికి అంకితమిస్తున్నాను.