కన్నీళ్ళకి కనువిప్పు కానేరదు
కవితలకి పరిష్కారం రా నేరదు
వాగ్దానాలకి తలవంచనేరాదు
ఓటు కోసం డబ్బు ఆశించనేరాదు
ఆకలి చావులు నాయకుల దృష్టిలో కానరాదు.
ఎవరో వస్తారు ఏదో చేస్తారనుకోవద్దు..
నీ పతనానికి నీవే భాద్యుడివి
నీ హక్కుకి నీవే బాధ్యుడివి
నీ నిర్ణయానికి నీవే బాధ్యుడివి
నీ సంస్కరణకు నీవే బాధ్యుడివి
నీ ఉన్నతికి నీవే బాధ్యుడివి.
లే పూరించు శంఖారావం
గగనం దద్దరిల్లేలా
దగా కోరుల గుండెలు దడదడ లాడేలా
నీ కన్నీళ్ళే ఉప్పెనై
నీకంటిఎఱుపు అగ్ని జ్వాలయై జ్వాలాముఖియై
నిరంకుశత్వాన్ని దహించగా
నీ గుండెల మంటలు అగ్ని పర్వతమై బద్దలిడ
లావాయై ఆరాచకాన్ని కబళించి
మరుభూమిని సస్యశ్యామలం చెసుకో!
నీ ఉన్నతికి నీవె బాధ్యుడివి
ఎవరో వస్తాని ఆశపడి మోసపోకు
నిజంమరచి నీబాధ్యత మరువకు.