ప్రకృతి ఎంతో అందమైనదని ఓ కామన్ అభిప్రాయాన్ని చెప్తూ ఉంటాం. చక్కటి పచ్చిక మైదానంపై దృష్టి పడుతుంది ఒక్కోసారి. కానీ, ఆ మొక్కల క్రింద నేల లో ఉన్న బురదను చూడము.కొండలు దూరంగా ఉన్నప్పుడు గీత గీసినట్టుగా అందంగా కనిపిస్తాయి. కానీ, దగ్గరికి వెళితే తెలుస్తుంది రాళ్లు రప్పలతో, పెద్దపెద్ద వృక్షాలతో,పిచ్చి మొక్కలతో, ఎగుడుదిగుడుగా ఉంటాయని. పూల చెట్టు కూడా పైపైన అందంగా ఉండి కళ్ళను ఆకర్షిస్తుంది, కానీ క్రింద వేళ్ళు ఆకర్షించవు.ఈ అన్నింటిలో ఏక సూత్రత ఒకటి ఉన్నది. పైకి ఎలా ఉన్నా పట్టుకొని నిలిచి ఉన్నది భూమిపైననే అని !ఇదే మనుషుల జీవితాలకు అన్వయిస్తే, జీవనానికి ప్రథమ మాతృక స్త్రీ అనేది అర్థమవుతుంది!!
జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం అంటూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న విషయమని పాఠశాలలో, కళాశాలలో సంస్థలలో అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఆడవాళ్లకు గర్భం కలిగిన సందర్భంలో ఎలా ఉండాలి,ప్రసవ సమయంలో ఎలా ఉండాలి అనే విషయంపై WHO చర్చలు చేస్తూ ప్రచారం చేస్తుంది. లక్షలాది మహిళలు ఎక్కడో ఒకచోట ఏవో కొన్ని కష్టాల అనుభవిస్తూనే ఉన్నారు.గర్భ సమయంలో, ప్రసూతి సమయంలో చెప్పలేనన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నారు.
ప్రతి తల్లికి ప్రసూతి కోసం ఆరోగ్య విషయంలో భరోసా కల్పించే కార్యక్రమాలను నిర్వహించాలి.
కొన్ని చోట్ల శిశు మరణాలు, కొన్ని చోట్ల తల్లుల మరణాలను మనం చూస్తున్నాం. గర్భధారణ సంబంధిత వ్యాధులు ఏవి ఎలా సంభవిస్తాయి అనే విషయాలపై స్త్రీ పురుషులకు ఇద్దరికీ తెలియాలి. అప్పుడే మహిళలు సరైన ఆరోగ్య సంరక్షణ తీసుకుంటున్నారా లేదా అనే విషయంపై పురుషులూ దృష్టి పెడతారు. భార్య సమతుల్యమైన ఆహారం తీసుకుంటుందా అనే విషయాన్ని భర్త తెలుసుకోవాలి. Motherhood , మాతృత్వం ఒక గొప్ప వరం. Delivery time స్త్రీలకు పునర్జన్మ వంటిది అంటారు. నీళ్ళాట తర్వాత చచ్చి పుట్టింది అనేవాళ్ళు. ప్రాణికి జీవం ఇవ్వడం అనేది ఎంత శ్రమతో కూడుకున్నది ఎంత ప్రాణాంతకమైనది అనేది తెలిసిన పురుష ప్రపంచం తెలియనట్టు అది ఎంత సాధారణమైన విషయమైనట్టుగా మాట్లాడుతుంటారు. కానీ,వాళ్లను సరిగ్గా చూస్తున్నామా లేదా అర్థం చేసుకుంటున్నామా లేదా గౌరవిస్తున్నామా లేదా అనేది ప్రశ్నించుకొని జాగ్రత్తగా ఉండకుంటే భవిష్యత్తులో పిల్లల ముందే తలదించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి.
అధిక శిశు మరణాలు సంభవించకుండా ఉండాలంటే, ఎటువంటి జాగ్రత్తలను తీసుకోవాలో కొత్తగా తల్లి కాబోయే స్త్రీలకు శిక్షణ ఇవ్వడం చాలా అవసరం.
దీనివలన మాతా శిశు మరణాల రేటును తగ్గించడానికి అవకాశం ఉంటుంది. సరైన ఆరోగ్య సంరక్షణ మహిళలకు ఉన్నప్పుడే వాళ్లు పిల్లల్ని కనడానికి నిర్ణయం తీసుకోవాలి ఆర్థికంగా హార్దికంగా సరిగ్గా లేదు అనుకున్నప్పుడు ఒక రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్యం సరిగా లేకున్నా పిల్లలను కనడం అనేది ఇంకొక రకమైన పరిస్థితులకు కారణమవుతుంది. ఇక ప్రసూతి సమయంలో సరైన సంరక్షణ లేకుండా, పరిశుభ్రత పాటించకుండా నిర్లక్ష్యంగా ఉంటే పుట్టిన గుడ్డూ,కన్నతల్లి ఇద్దరూ అనారోగ్య పాలు అవుతారు.
Maternal Morality Ratio ఎంత ఎలా ఉన్నది అనే గణాంకాలు తీసినప్పుడు ఆశ్చర్యంగొలిపే విషయాలు బయటపడ్డాయి. Anemia is the main cause of the pregnant woman’s death అని, అంతే నిష్పత్తిలో chailed death ratio కూడా అలాగే ఉంది అని ప్రపంచ ఆరోగ్య గణాంకాల విషయంలో తెలుస్తే అవి మానవజాతి మనుగడ ఎలా అనే స్పృహ తప్పకుండా వస్తుంది.
అసలే ప్రెగ్నెన్సీ తో ఉన్న స్త్రీకి కాంప్లికేటెడ్ ఇష్యూస్ గా చెప్పేటప్పుడు వయస్సు, ఆహార పలవాట్లు, అపరిశుభ్ర వాతావరణంలో ఉండడము, అసంతృప్త జీవనము వంటివి ముఖ్యమైన శత్రువులు. వీటిని జయిస్తేనే భావితరాలకు మంచి పౌరులు లభిస్తారు. పౌష్టికాహారం తినకుండా సరియైన విశ్రాంతి తీసుకోకుండా ఆందోళనలో బాధలలో ప్రెగ్నెంట్ వుమన్ ఉంటే పుట్టే పిల్లలు అంతకన్నా ఎక్కువ ఆందోళన స్వభావాన్ని కలిగి అంతకన్నా ఎక్కువ కష్టాలకు లోనవుతూ ఉండే వాళ్ళు పుడతారు.
అసలే ఈ గ్లోబలైజేషన్ వలన ఈ నాగరికత విధ్వంసం వలన మనుషులకి మనశ్శాంతి కరువైపోయి టెన్షన్ టెన్షన్ టెన్షన్ అంటూ బ్రతికు ఈడుస్తున్నారు. ఇక పెళ్లి పిల్లలు విషయం మరొక వింత అయిపోయింది. ఈ కొత్త తరంలో,వీళ్ళ కు ఎంత కష్టం ఏంటి? పెళ్లిళ్లు చేసుకున్నా పిల్లల్ని కనాలి అంటే ఆలోచిస్తున్నారు, పెంచగలమా అని భయపడుతున్నారు. కొంతమంది కంటున్నారు గానీ ఒక్క సంతానంతోటే సరిపుచ్చుకుందాం అనుకుంటున్నారు. ఇక్కడి వరకు పరవాలేదు అనుకుంటే, కొంతమంది సహజీవనం అని చేస్తున్నారు. పొరపాటున గర్భం కలిగితే గర్భవిచ్చితి అయినా చేయించుకుంటున్నారు లేదా కనేసి వదిలి చేసుకుంటున్నారు. కొంతమంది అటువంటి నిర్లక్ష్యపు పురుషుని తోడు లేకున్నా ఎలాగైనా తన కన్న బిడ్డను సాది పెంచి పెద్ద చేస్తాను అని పట్టుదలగా ఉంటున్నారు కొందరు స్త్రీలు. ఇవన్నీ మంచి పరిణామాలు కావు. తల్లి తండ్రి ఇద్దరు ప్రేమగా పెంచిన సంతానం తప్పకుండా మంచి సంతానంగా పెరిగి పెద్దయి సుభిక్షమైన దేశానికి పట్టుకొమ్మలవుతారు.
కాబట్టి తన ప్రాణం పోతున్న ప్రాణికి ప్రాణం పోసి ఈ ప్రపంచానికి పరిచయం చేసే అమ్మ కోసం జాతీయమాతృత్వ దినోత్సవం జరుపుకున్నాడమొక్కటే కాదు, ఇండల్లో తల్లి తండ్రి అత్త మామ భర్త తోబుట్టువులు అందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆ స్త్రీకి గర్భం ధరించినప్పటి నుంచి ప్రసవించే వరకు ప్రేమను అనురాగాన్ని చక్కని ఆరోగ్యమిఇచ్చే ఆహారాన్ని అందిస్తూ మంచిగా ఉన్నప్పుడే మాతృత్వ దినోత్సవానికి అర్థం నెరవేరినట్టు. ప్రసవించిన తర్వాత మాతృ క్షీరం అంటే తల్లిపాలు ఆ పసి గుడ్డుకు ఎంతో ముఖ్యమైనది కాబట్టి చక్కగా పాలు వచ్చేలాంటి ఆహారం ఆమె తినగలగాలి. అప్పుడే సమృద్ధిగా పాలు పడతాయి తల్లి ఆరోగ్యం క్షేనించదు దానివల్ల పిల్లలను శ్రద్ధగా ఓపికగా మరింత మంచిగా పెంచగలరు. వసంత రుతువులో పూలు వెదజల్లుతూ వృక్షాలు ఎంత అందంగా ఉంటాయో అట్లాగే స్త్రీలు విరగ గాసిన చెట్టులా ఆనందంగా ఉండాలి. ఆరోగ్య సంరక్షణ అందరికీ ఎంత అవసరమో అంతకన్నా రెండు రెట్లు ఎక్కువ పాలిచ్చే తల్లులకు అవసరము అనే ఆలోచనతో అందరూ అడుగులు ముందుకు వేస్తే ఆచరిస్తే “సేవ్ ద వరల్డ్” అని గొంతెత్తి అరవాల్సిన అవసరం ఉండదు.