జానపద రామ గాధలు – వ్యక్తి ధర్మం

వ్యాసం

ఏ.మృణాళిని, పరిశోధక విద్యార్థి, ఉస్మానియా విశ్వవిద్యాలయం.

నిత్య జీవితంలో మానవుల నీతి నియమాలను ఇతిహాస పురాణ కథలకు జోడిస్తూ జానపదులు వ్యవహారిక భాషలో వా రివారి ప్రాంతీయ పలుకుబడులు నుడికారాలతో అనేక ప్రక్రియా రూపాల్లో జానపద సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. “రామో విగ్ర హవాన్ ధర్మః” అన్నట్టుగా ధర్మానికి ప్రతిరూపమైన ఆ రాముని చరిత్రను కావ్యంగా మలిచాడు వాల్మీకి. ఆదికవి వాల్మీకి తరువాత ఈ ప్రపంచంలో ఎన్నో వేలకు పైగా రామాయణాలు వెలువడ్డాయి. గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణం అనీ, భాస్కర రామాయణం, వె మల్ల రామాయణం, కంబన్ రామాయణం, ఆధ్యాత్మిక రామాయణం, శతకంధర రామాయణం, నిర్వచనోత్తర రామాయణం ఇలా ఎన్నో రా మాయణాలు ఎంతో మంది కవులచే రచింపబడినవి. వీటన్నింటితో పాటు జనపదాలలో నివసించే పల్లీయులు అంటే జానపదులు తమ ఊహశక్తి మేరకు రామకథను గానం చేసారు. సీతారాములను అవతార పురుషులుగా కాక తమ నిత్య జీవితాల్లో సాధారణంగా వారు చూసే స్త్రీ పురుషుల వలె భావించి రామాయణానికి సంబంధించిన ఎన్నో గేయాలను రచించారు.
జానపదులు వాల్మీకి రామాయణాన్ని అనుసరించి ఎక్కువ మొత్తంలో రామాయణ సంబంధ గేయాలు రాసినప్పటికీ వారు త మ యొక్క జీవితాల్లోని కష్ట సుఖాలను ఆ సీతారాములకు ఆపాదించి, ఆయా సంఘటనలు ఎదురైనప్పుడు వారు ఏ విధంగా ప్రతిస్పం దించేవారు స్వాభావికంగా ఆ గేయాల్లో తమ యొక్క కల్పనలతో వ్రాసారు. వాల్మీకి రామాయణం తరువాత వచ్చిన గోనబుద్ధారెడ్డి రామాయణంలో, భాస్కర రామాయణాలలో అవాల్మీకమైన అంశాలతో పాటు అప్పటికే జానపద సాహిత్యంలో ఉన్న రామాయణానికి సం బంధించిన ఎన్నో విషయాలు కనిపిస్తాయి. జానపద సాహిత్యం శిష్ట సాహిత్యానికి మార్గదర్శకంగా నిలిచిందని దీని వల్ల స్పష్టమౌతు ంది.జానపద రామ గాధలలోని అంశాల ఆధారంగా వ్యక్తి ధర్మ నిరూపణం చేయడం ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశ్యం. వాల్మీకి రామాయణం కన్నా భిన్నంగా ఉన్నప్పటికీ రాముని యొక్క ధర్మాన్ని బలపరిచేవిధంగా ఉండడం విశేషం.

రామాయణం-చతుర్విధపురుషార్ధాలు :

మానవ జీవితం సక్రమంగా సవ్య దిశలో సాగాలంటే మనం పాటించవలసినవి చతుర్విధ పురుషార్ధాలు. అవే ధర్మం, అర్ధం, కామం, మోక్షం. ఈ చతుర్విధ పురుషార్థాల వివరణ, వాటిని పాటించే విధానము అడుగడుగునా మనకు రామాయణంలో కనిపిన ంది. కొంత లోతుగా పరిశీలిస్తే ఈ జానపదులు వ్రాసిన రామాయణాల్లో మనం ఈ చతుర్విధ పురుషార్ధాలను గమనించవచ్చు.

చతుర్విధ పురుషార్థాలలో ధర్మం:

చతుర్విధ పురుషార్థాలలో ప్రప్రథమమైన మరియు శక్తివంతమైన ధర్మం గురించి చర్చించుకుందాము. ధర్మం అంటే ఖచ్చితంగా గా ఇదీ అని చెప్పలేం. ధర్మం అంటే విధి. భగవద్గీతలో చెప్పినట్టుగా “యద్యదాచరతి శ్రేష్ఠః” ధర్మము అంటే ఉత్తములు వేటినైతే ఆచరి స్తారో వాటినే జనులు ప్రమాణంగా తీసుకుంటారు. అదే ధర్మంగా చెప్పవచ్చు. రామాయణ గాధలలోని విభిన్న పాత్రలు ఈనాటికీ మాన వాళికి ఆదర్శంగా నిలవడం మనం గమనిస్తూనే ఉన్నాం.

భార్యాభర్తల అనుబంధం

రాముడు దశరథుని ఆజ్ఞ మేరకు కైకేయి యొక్క మాటలను అనుసరించి పుత్రధర్మంగా వనవాసానికి బయలుదేరగా సీతాదేవి రాముడి వెంట తాను కూడా వస్తానంటే రాముడు వద్దన్నాడు. అప్పుడు సీతాదేవి
“మాను పారిన తీగ మాను తప్పిన వెనుక మరియెట్లు నిల్వగలదూ,
చమురు లేని దివ్వె ఎంతకాలముదాక వెలిగేది” అని పలికింది. సీత యొక్క పతి భక్తి సతీ ధర్మం మనకు ఈ విధంగా తేటతెల్లమవు తుంది.

ప్రజాభిమానాన్ని పొందిన రఘురాముడు:
మంథర మాటలు విని స్వతస్సిద్ధంగా మంచి మనసు గల కైకేయి చెప్పుడుమాటలు విని భరతుని పట్టాభిషేకము, రాముని పద్నాలుగేళ్ళు వనవాసం చేయమని కోరింది. రాముడు దానిని అనుసరించి సీతాలక్ష్మణ సమేతుడై అడవులకు పయనమవుతుండగా అయోధ్యానగర వాసులందరు వారిని వెంబడించారు. ఎంత వదన్నా వినలేదు. ఇక్కడ రామున్ని విడవలేక ప్రజా ధర్మాన్ని పాటించారు. ప్రజలు.చివరికి రాముడు ‘యీ రాత్రి ఇచ్చటను ఇరువుగా నిద్రించి తెల్లవారిన వెనుక తేరు దోలింతాము కావుననుమనమింక కలిసి నిద్రింతాము ‘అని చెప్పి రాత్రికి రాత్రే నీతా లక్ష్మణులతో వారికి అందకుండా వెళ్ళిపోయాడు.

ఏకపత్నీవ్రతుడిగా రాముడు:
ఏకపత్నీవ్రతుడైన శ్రీరాముడి వద్దకు శూర్పణఖ వచ్చి రాముడి సౌందర్యాన్ని చూసి తనను పెళ్ళిచేసుకోమని కోరింది. అతడు “ఇంటి పురి తీసి ఇటు మళ్ళమనుచు వీవున వ్రాలు వ్రాసెను” దీనిని బట్టి రాముడు తన పతిధర్మాన్ని చాటిచెప్పాడు. అంతే కాక రావ ణుడు సీతనపహరించిన సందర్భంలో సీతను కోల్పోయిన రాముడు పంపా సరోవర ప్రాంతశోభను చూసి ఆ సరోవరంలో
“మడుగులో పుష్పముల్ -మదనబాణము లయ్యె-
లోత్పలంబులు-నెలత కన్నులబోలు-
యీ చక్రవాకముల్-ఈపద్మముకుళముల్ ఇంతి కుచములబోలు-
చారు శైవాలంబు సీత కురులనుబోలు”
హంస నడకలు సీత నడకలుగా, పద్మాల రేఖులను సీత కన్నులుగా, కోకిల రవాలను సీత వలుకులుగా, చేపల మిలమిలను సీత చూపులుగా, కమలాలను సీత వదనంబుగా ఊహించుకొని శ్రీరాముడు విలపించిన సమయంలో, మాయలే దీని చూసి సీత మనసు పడి కోరగా తెచ్చి యిచ్చే సమయంలో, ఆంజనేయుడు లంకకు సీతాదేవికి రాముడి యొక్క సమాచారాన్ని అ ందించడానికి వెళ్లిన సందర్భంలో సీతాదేవి గుర్తుపట్టేందుకు రాముడు సీత యొక్క ఆనవాళ్ళు కొన్ని ఆంజనేయుడితో ఇచ్చి పంపిన స దర్భంలో కూడా శ్రీరాముడికి సీతాదేవికి పట్ల ఉన్న బాధ్యత, భార్య పట్ల తన యొక్క ధర్మం కనిపిస్తుంది.

దాసుడిపై వాత్సల్యం: —

గుర్తుపట్టేట్టు చేసి రాముని గురించి సీతాదేవికి తెలియజేసాడు. అదే విధంగా లక్ష్మణుడు మూర్ఛిల్లిన సందర ఎంలో రాముడు “ఇలలో నల్గురము ఇపు డన్నదమ్ములము, ఇటుపైని మా తోటి హితువు మీరంగ, ఐదవవాడగుచు అలరుచుంద్రువు నీ వ”ని కోరాడు. ఎవరూ తేలేని సంజీవిని తెచ్చి లక్ష్మణుని పునర్జననానికి మూలకారకుడైయ్యాడు. ఆంజనేయుడు సంజీవనిని తీసుకొని వ చ్చే సందర్భంలో రావణుడు కాలనేమి వంటి రాక్షసులను పంపి ఆంజనేయుడి కార్యాన్ని భగ్నం చేయాలనుకున్నాడు. ఆంజనేయుడు వాళ్ళతో భీకర పోరాటం చేసి సంజీవనిని తీసుకువచ్చాడు. ఈ కాలనేమి వృత్తాంతం వాల్మీకి రామాయణంలో లేదు. అదే విధంగా సీతా రామ చంద్రుల పట్టాభిషేక సందర్భంలో అందరూ కట్నాలు చదివించారు. అప్పుడు సుగ్రీవుడు ఒక మణిహారాన్ని బహూకరించాడు. రాముడు సీతతో ‘ఎవ్వరి మూలమున వృద్ధిబొందితివో వారి కిమ్మన’గా సీతమ్మ ‘నాయాత్మబంధుండ జీవరక్షకుడా మాయన్న హను మంత రమ్మను’చు “బిలిచే తన చేత కంఠమాల హనుమంతుకేసె ‘ ఇలా భృత్యు ధర్మాన్ని పాటించిన హనుమంతుడు కేవలం సీతకే కాదు అందరికీ ప్రీతిపాత్రుడే.

స్నేహబంధం:
రావణుడి ఆగడాలు భరించలేని రావణుని సొంత సోదరుడైన విభీషణుడు అన్నను ఎన్నిసార్లు వారించినా వినలేదు. విభీష ణుడు ధర్మంవైపు నిలిచి రాముడి ప్రావుపొందాడు. రాముడు తన శత్రువైన రావణుడి సోదరుడు విభీషణున్ని సైతం మిత్రునిగా భావించ వాడు రావణుని మరణరహస్యం తెలియకుంటే రావణుని చంపడం రాముడితో అయ్యేవనికాదు. ‘నాభిలో అమృతాన్ని కొల్లగొట్టినచో రావ ణుడి మరణం సంభవిస్తుంద’ని తన అన్న మరణ రహస్యాన్ని విభీషణుడు తెలియజేయడంలో మిత్రధర్మం ప్రతిబింబిస్తుంది. రావణ వ ధ అనంతరం లక్ష్మణుడు ఇక్కడే ఈ బంగారం వంటి లంకలో ఉందామని కోరగా రాముడు
“అపి స్వర్ణమయీ లంకా నమోరోచతె లక్ష్మణా
జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ” అంటూ జన్మభూమి పై ఉన్న ప్రేమను తెలియజేసాడు. లంకానగరానికి విభీషణున్ని రాజును చేశాడు.

అన్నదమ్ముల అనుబంధము :
జానపదుల రామాయణంలో బహుళ ప్రచారం పొందిన అంశాలు ఊర్మిళాదేవి నిద్ర, లక్ష్మణదేవర నవ్వు, శ్రీరామచం దుడు పద్నాలుగేండ్ల అరణ్యవాసం పూర్తి చేసుకున్న తరువాత అయోధ్య నగరానికి సీతా, లక్ష్మణ, ఆంజనేయ సమేతంగా తిరిగివచ్చినప్పు డు లక్ష్మణుడు సరాసరి తన భార్యయైన ఊర్మిళాదేవి స్థితిని గురించి తెలుసుకోకుండా రాముని యొక్క పట్టాభిషేక పనులలో నిమగ్నమ “తాడు. స్త్రీ యొక్క హృదయం స్త్రీకే అర్థమవుతుంది కాబట్టి సీతాదేవి లక్ష్మణుని ఊర్మిళాదేవిని కలసిరమ్మని రామునితో చెప్పింది. ఇక్క డ పదునాల్గేండ్ల అరణ్యవాసం తరువాత కూడా తన సొంత భార్య అయిన ఊర్మిళాదేవిని పట్టించుకోకుండా ఇంకా తన అన్నగారి పన ఎల్లోనే నిమగ్నమై ఉన్న లక్ష్మణుని చూస్తుంటేహనుమంతుడు శ్రీరాముడి పట్ల అడుగడుగునా తన యొక్క దాస్య భక్తిని నిరూపించాడు. లంకలో ఉన్న సీతాదేవికి రామ డు పంపించిన ఆనవాళ్ళతో గు తమ్మునికి అన్న పట్ల ఉండవలసిన గౌరవం, ప్రేమ కనిపిస్తాయి. ఇదే భాతృ ధర్మం. ఈ ధం కాన్ని అనుసరించడంలో రాముడే లక్ష్మణుడికి ఆదర్శప్రాయుడు. రావణవధ జరిగే సందర్భం కన్నా ముందు విభీషణుడికి ఎదురెళ్ళి లక్ష క్ష్మణుడు రావణుని శక్తి చే మూర్ఛితుడవుతాడు. అతన్ని చూసి రాముడు సందుగొందుల వెదుకుచూ మీరింత తప్పుతాయగ వస్తిరీ” అంటూ ఆమె లక్ష్మణుని మందలించడంలో లక్ష్మణుడిని తప్ప ఇతరులను భర్తగా ఊహించలేని సతిధర్మం కనిపిస్తుంది. అంత టితో ఊరుకోక వచ్చినవాడు లక్ష్మణుడని తెలియక
“ఒకడాలి కోరిగాదా ఇంద్రునికి ఒడలెల్ల హీనమాయె,
పరసతిని కోరిగాదా రావణు మూలముతో హతమాయెను,
ఒకడాలి కోరిగాదా కీచకుడు ప్రాణములు కోలుపోయె,
ఇట్టి ద్రోహములు మీరు యెరుగుండి యింత ద్రోహము కొస్తిరా”
ఇలా ధర్మాన్ని బోధించింది.ఈ మాటలు విన్న లక్ష్మణుడు “కత్తి వరదీసి యపుడూ లక్ష్మణుడు తా వేసుకొందు” ననెను అనగానే కన్నులు తెరచిన ఊర్మిళా భర్తను చూసి భర్త పాదాలపై వాలింది. కరిగిపోయి హృదయోద్వేగురాలైంది.
” మా తండ్రి జనకరాజూ మిము నమ్మి మరచి పెండ్లిజేసెనూ
చిత్త మొకదిక్కునుంచి సమయమున చిన్నబుత్తురు పురుషులూ”
అని దెప్పిపొడిచింది. లక్ష్మణుడు ఊర్మిళాదేవి యొక్క ప్రేమను తెలుసుకొని తాను కూడా నిద్రాహారాలు మానిన సంగతి తెలిసి హృ దయభారాన్ని తగ్గించుకున్నాడు. ఈ విధంగా ఊర్మిళా లక్ష్మణుల దాంపత్య ధర్మం జానపదులు చక్కగా వివరించారు.
శ్రీరాముని పట్టాభిషేక సమయంలో లక్ష్మణుడు నవ్విన ఘట్టం జానపదుల హాస్యానికి, ఊహాశీలతకు నిదర్శనం. ఆ నిండు కొలువులో
“కలకల నవ్వే లక్ష్మణదేవ రవుడూ, కలతలు పుట్టెనూ కవులందరికీ,
కిలకిల నవ్వే లక్ష్మణదేవరవుడూ కిలకిల నవ్వగా భిన్నుడయె రాజూ”.
లక్ష్మణుడు అకారణంగా నవ్వాడు. సభలోనివారు కొంత కించపడ్డారు. ఎవరి ఊహకు తగ్గట్టుగా వాళ్ళు కారణాలు ఊహించుకున్నా రు. గంగను తలపై మోస్తున్నందుకు నవ్వాడని శివుడు, అన్నను చంపి తను రాజైనందుకు నవ్వాడని విభీషణుడు, ఆడరాని మాటలాడిన ఆడవారిని నమ్మరాదని నవ్వాడని జానకి, రావణుని చంపి ఆలిని తొడపై కూర్చోపెట్టుకున్నందుకు నవ్వాడని శ్రీరాముడు అనుకున్నారు. దీనినే చేష్టావ్యంగ్యం అంటారు. సభలోని వారినిట్లా అవమానపరిచినందుకు శ్రీరాముడు తప్పు చేస్తే తమ్ముడిని సైతం వధించవచ్చునన ్న ధర్మాన్ని చాటిచెబుతూ లక్ష్మణున్ని ఒరలోనున్న కత్తితీసి చంపబోతాడు. లక్ష్మణుడు రాముని పాదాలపై పడి తాము వనవాసానికి వెళ్ళి నప్పుడు సీతారాములు నిద్రించగా కాపలాగా ఉన్న తనని నిద్రాదేవి ఆవహిస్తుంటే తాను ఆ ప్రభావానికి లోనుకాక నిద్రాదేవితో ” పో పో మ్మ య్యోధ్యాపురీ నగరునకు వేగా ధవుని బాసినట్టి సతియుండ……” అని అయోధ్యా నగరంలో తన భార్యయైన ఊర్మిళాదేవి వద్ద కు వెళ్ళమని చెప్పాడు, అప్పుడు వెళ్ళి నిద్రాదేవి మళ్ళీ ఇప్పుడు మీ పట్టాభిషేక సందర్భంలో తనను ఆవరించిందని అందుకే నవ్వానని కారణాన్ని వెల్లడించాడు. ఈ కారణాన్ని విన్న రాముడి గుండె జారిపోయినది. తమ్ముడు చేసిన త్యాగానికి, నిష్కళంక సోదర ప్రేమకు త న తొందర పాటును గ్రహించి తను తీసిన కత్తితో తానే చంపుకోవాలని చూడగా వసిష్ఠులు మొదలైనవారు అడ్డుకున్నారు. లక్ష్మణస్వామిజ రోజు పద్నాల్గిండ్ల నిద్ర. రాముడు లక్ష్మణుడి వద్దకు వచ్చి పాదాలు ఒత్తుతున్నాడు.
” మీ అడుగులొత్తెటి ప్రాయమ్ము వాణ్ణి అహల్య పావనమైన అడుగు మీ యడుగు
బలిశిరస్సుననున్న అడుగు మీ యడుగు
మీ యడుగులొత్తుదురు సకలదేవతలు”
లక్ష్మణుడు తన పాదాలు పట్ట వద్దని వారించినా రాముడొత్తిన సందర్భం సోదర ప్రేమను చాటి చెపుతుంది. ధర్మ నిరతి :
“యథా రాజా తథా ప్రజా” అంటారు. రాజు ఏ విధంగానైతే వ్యవహరిస్తాడో ప్రజలు కూడా అదే విధంగా వ్యవహరిస్తారు అ నేది దీని అర్థం . చాకలి నిందకు తట్టుకోలేక రాముడు సీతను అరణ్యవాసానికి పంపించినట్టు వాల్మీకి రామాయణంలో ఉంది. సీతాదేవి. పై నిందమోపి అడవులలో వదిలిన ఘట్టానికి జానపదులు ఓ అందమైన కథను కల్పించారు. అది ఇలా ఉంది. శూర్పణఖ యతి వేష ంలో అయోధ్యకు వచ్చింది. రాముడు వేటకు వెళ్ళాడు. సీత ఆ మాయా యతి వేషంలో ఉన్న శూర్పణఖకు గౌరవ స్థానమిచ్చి అతిథి సత్కారాలు చేసింది. కోరిన బహుమతులిస్తానన్నది.
“రావణుపటమూ వ్రాసియిచ్చితే – బ్రతుకుదు నేనీలోకములోను”
ఇలా రావణుడి పటాన్ని రాసిమ్మని మాయాయతి శూర్పణఖ కోరింది. లంకాపురంలో జనకుని స్థానంలో చూసిన రావణుని అంగుళీ యకము మాత్రమే చూసానని దాన్ని పటంలో రాసి ఇచ్చింది. శూర్పణఖ మాయమాటలచే బ్రహ్మను మెప్పించి ఆ పటముకు ప్రాణం ఎ యించింది. ఆ పటంలో ఉన్న రావణుని చూసి సీతాదేవిని భయపడింది.
“పటమొచ్చి ముందర నిలుచుండి రావే పోదము లంకకు ననుచు – సీతను బట్టుకు ఆపదబెట్టెను జానకి బట్టుక డ్వదొడంగెను
సీతాదేవి తన మంచం క్రింద ఆ పటాన్ని దాచింది. రాముడు తిరిగివచ్చిన తరువాత సీతాసమేతుడై ఆ మంచంలో నిద్రించుచుండగ ఆ పటము రాముడికి ఎదురుపడింది . సీతాదేవిని ఆ కారణంతో అవమానించి రాముడు అడవులకు పంపించాడని జానపదులు చ క్కని కల్పనలు చేసారు . జనులు ఏమనుకుంటారో అన్న భయంతో కాక నీతినియమాలను అనుసరించి రాజధర్మంగా సీతమ్మతల్లిని అరణ్యవాసమునకు పంపిన తీరు ఊహారమణీయము.
భారతం ఏ విధంగా నైతే ధర్మజ్ఞులకు ధర్మశాస్త్ర గ్రంధంగా, నీతి విచక్షణులకు నీతిశాస్త్రంగా,పౌరాణికు లకు మహాపురాణ సముచ్ఛయంగా కనిపిస్తుందో జానపదులు రామాయణాన్ని ఆసాంతం చతుర్విధ పురుషార్థాలైన ధర్మ, అర్థ,కామ,వె వాక్షాలు ప్రతిబింబించే విధంగా వ్రాసారు. వేదాలకు ప్రతిపాదితమైన ఈ పురుషార్థాలను నిత్యజీవితంలో ఏ విధంగా పాటించాలో మన కళ్ళ ముందు కదలాడే పాత్రల ద్వారా అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేసారు . శిష్టుల కంటే కూడా సమర్థవంతంగా జానపదు లు ఈ చతుర్విధ పురుషార్ధాలను సీతారాముడు మొదలైన పాత్రల ద్వారా చెప్పకనే చెప్పారు. సీతారాములు ఈ చతుర్విధ పురుషాం ర్ధాలను పాటించి మానవాళికి మార్గదర్శకంగా నిలిచారు . తప్పనిసరిగా మన జీవితాన్ని సరైనా మార్గంలో నడవడానికి ఈ చతుర్విధ పు రుషార్ధాలను, ముఖ్యంగా ధర్మాన్ని పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మానవాళి మనుగడ ధర్మబద్దం కావడానికి జానపద రామ గాధలు దోహదపడుతున్నాయి.

ఉపయుక్త గ్రంథాలు

1. తెలుగు జానపద గేయ సాహిత్యం – డా॥ బిరుదురాజు రామరాజు గారు

2.  తెలుగు జానపద గేయగాధలు – నాయని కృష్ణకుమారి 3.

3. వాల్మీకి రామాయణం

4. రామాయణం- స్త్రీల పాటలు

5. రామకథా సుధార్ణవమ – లాడె సుందరనారాయణ

6. సూక్ష్మ రామాయణం ఆది నారాయణదాసు.

Written by Mrunalini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సమానత్వం

శ్రీరామ కీర్తన