నా కాలు

కవిత

మాధవ పెద్ది నాగలక్ష్మి

కాలు కాలు కాలు
ఏమి కాలు ఈ కాలు
సొగసుల కాలు
చూడముచ్చటైన కాలు
కానీ ఏమీ లాభం?
కదల లేని కాలు
కదిలిస్తే కలుక్కుమనే కాలు
అడుగు వేస్తే అదిరిపోయే నొప్పి ఉన్న కాలు
అడుగుతీస్తే ఆగిపోయే కాలు
కాలు కాలు కాలు
ఈ కాలుకున్న విలువ మరి దేనికి ఉంది?
పాదయాత్రలకు ఇదే కాలు
పాదరక్షల సొగసు చూసుకోవటానికి ఇదే కాలు
పరుగు పోటీలకు పని చేసే కాలు
పరుగెత్తి దొంగలను పట్టుకోవటానికి పనికివచ్చే కాలు
కాలు కాలు కాలు
కొండలు ఎక్కి జెండాలు పాతది ఈ కాలే
చందమామ మీద సంతోషంగా నడిపించేది ఈ కాలే
రాజకీయ సభల్లో గంటలు గంటలు నిలబడి
మాట్లాడటానికి శక్తినిచ్చేది ఈ కాలే
మరి ఈ కాలును ఎంత జాగ్రత్తగా ముద్దు చేయాలి!
అందుకే కదిలించు కదిలించు కదిలించు నీ కాలు
ఆరు లక్షలు ఆపరేషన్ ఖరీదు గుర్తుపెట్టుకుని భయంతోనైనా ఆ కాలు కదిలించు అంతేనా అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టుగా వైద్యులు ఆపరేషన్తో మీరు పరిగెడతారు అని చెబుతారు
తరువాత తెలుస్తుంది నీకు
ఆ కాలుకు ఎన్ని సేవలు చేయాలో
ఎన్ని వ్యాయామాలు చేయాలో జీవితాంతం నడక ఆపకుండా వాకింగ్ చేయాలి!
ఓపిక ఉన్నా లేకున్నా అని
అందుకే ఇప్పుడే కదిలించు నీ కాలు
ఆ భయంతో నన్నా కదిలించు నీ కాలు డబ్బైనా మిగులుతుంది
వాకింగ్ వ్యాయామం ఎలాగూ తప్పవు కదా
కాలు కాలు కాలు
కదిలించు కదిలించు
కదిలించు నీ కాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఓ స్వాతి కథ

వంశోద్ధారకుడు