నేడు మందులు వాడని జనం లేరు.డాక్టర్ దగ్గర కి వెళ్లి రోగనిర్ధారణ ఐనాక మెడికల్ షాపులో మందులు తెచ్చుకోవడం వరకే మనకు తెలుసు.కానీ ఐశ్వర్య ఆమందుల గురించి అవగాహన కలిగేలా మనకు వివరించారు.మరి ఆమెను గూర్చి తెలుసుకుందాం. ఆమె పేరు దేశెట్టి ఐశ్వర్య. శ్రీ బాబూరావు గారు, విజయలక్ష్మి గారి దంపతుల కుమార్తె. ఆమె B.Pharmacy, MBA చదివారు. ప్రస్తుతం హైదరాబాద్ పేరెగ్జల్ కంపెనీలో మేనేజర్ గా పని చేస్తున్నారు. భర్త LSN కుమార్ గారు (MSC) కూడా ఫార్మా కంపెనీలో మేనేజర్ గా పని చేస్తున్నారు.
ఈమె 8 వ తరగతి వరకు ప.గో.జిల్లా జంగారెడ్డిగూడెం లో చదివారు. చిన్నతనం నుండి క్రీడల పట్ల ఆసక్తి చూపేవారు. కబడ్డీ, ఖోఖో, త్రోబాల్ మొదలగు వాటిలో ఎన్నో బహుమతులు పొందారు. ఆమెను తల్లిదండ్రులు డాక్టర్ ను చేయాలనే ఉద్దేశంతో గుంటూరు వికాస్ కాలేజీలో చేర్చారు. ఇంటర్మీడియట్ మంచి ర్యాంకుతో పాస్ అయ్యారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా B.Pharmacy చదివి distinction లో పాసై కాలేజీకి మంచి పేరు తెచ్చారు. బెంగళూరులో ఫార్మసీకి సంబంధించిన clinical research course చేశారు. ఈమె టాలెంట్ చూసి వాళ్ళ ఇన్స్టిట్యూట్ లోనే ట్యూటర్ గా పనిచేయమన్నారు. చెన్నైలో మంచి కంపెనీలో జాబ్ వచ్చింది. ఆ కంపెనీలో Best Employee award కూడా తీసుకున్నారు. ఆమె భర్త హైదరాబాద్ లో ఉండటం వల్ల ఆమె హైదరాబాద్ కంపెనీ లో జాయిన్ అయ్యారు. అక్కడ కూడా అంకిత భావంతో పని చేయడంవల్ల 3 సార్లు Best Employee award ఇచ్చారు. అత్తవారింట కూడా మంచి కోడలుగా పేరు తెచ్చుకున్నారు.
తండ్రి ప్రోత్సాహం లేకున్నా ఆమె స్వశక్తితో, ఉద్యోగరీత్యా నిలద్రొక్కుకున్నారు. కష్ట సుఖాలు తెలియడం వలన సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలనే ఆశయం కలిగి ఉన్నారు. వాళ్ళ కంపెనీలోను, తెలిసిన వారి ద్వారాను తన స్నేహితులకు వేరే కంపెనీలలో ఉద్యోగ పరంగా రిఫరెన్స్ ఇస్తుంటారు. ఆమెకు చదువు నేర్పిన గురువులకు కూడా ఉన్నత స్థాయి ఉద్యోగాలకు రిఫరెన్స్ ఇచ్చారంటే చాలా ఆనందించదగ్గ విషయం. ఆమె ప్రతిభకు ఇవన్నీ నిదర్శనాలు.
కల్తీ మందులు కనిపెట్టడానికి క్లినికల్ ట్రయల్స్ ఎలా చేస్తారు అని అడిగితే ఈమె ఈవిధంగా చెప్పారు. “మన అనారోగ్యానికి సంబంధించిన మందులు కనిపెట్టడానికి, తయారు చేయడానికి clinical trials అనేవి అల్లోపతీ మందులలో జరుగుతాయి. దీనిలో సాధారణంగా మందుకి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్, రియాక్షన్, ఎలర్జీ, ఎంతో సమయం పనిచేస్తుంది, ఎంతో మోతాదులో తీసుకోవాలి తదితర వివరాలు తెలుస్తాయి. ఇవి 4 దశలుగా జరుగుతాయి. 3,4 దశలలో మనుషులపై ప్రయోగిస్తారు. తదుపరి మార్కెట్లో మందులు అమ్మడం జరుగుతుంది. ఈ మందులు వాడాక ఎవరికైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే www.ipc.gov.in వెబ్ సైట్ నందు ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఫిర్యాదులను మాలాంటి ఫార్మాసిస్ట్ లు ప్రోసెసింగ్ చేసి ప్రభుత్వానికి తెలియపరుస్తారు ”
ఈమె తల్లి ఈమె చదువుకు, ఈమె భవిష్యత్తుకు సంపూర్ణ సహాయ సహకారాలు అందించారు. ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొని ఈమె ఈ స్థితిలో ఉండేందుకు తోడ్పడ్డారు. ఈమె తల్లి సోషల్ వర్కర్.
ఈమె సమాజానికి సహాయం అందించాలని అనాధాశ్రమాలకు, పేద విద్యార్థులకు సహాయం చేస్తుంటారు. ఈమె వృత్తి రీత్యా అందరికీ ఆరోగ్యమే మహాభాగ్యము అని బోధిస్తూ ఉంటారు.
నేడు మందులు వాడని జనం లేరు.డాక్టర్ దగ్గర కి వెళ్లి రోగనిర్ధారణ ఐనాక మెడికల్ షాపులో మందులు తెచ్చుకోవడం వరకే మనకు తెలుసు.కానీ ఐశ్వర్య ఆమందుల గురించి అవగాహన కలిగేలా మనకు వివరించారు.మరి ఆమెను గూర్చి తెలుసుకుందాం…