చైత్రమాసి జగద్బ్రహ్మ సపర్ణ పథమే అహని
వత్సరాదౌ వసంతాదౌ రసరాద్యే తథైవచ
చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయవేళకు పాడ్యమి తిథి ఉన్నరోజును ఉగాదిగా నిర్ణయిస్తారు. ఈ పండుగను తెలుగువారే కాకుండా మరాఠీలు ‘గుడిపడ్వా’గా, తమిళులు ‘పుత్తాండు’ అనే పేరుతో, మలయాళీలు ‘విషు’ అని, సిక్కులు ‘వైశాఖీ’గా, బెంగాలీలు ‘పోయ్ లా బైశాఖ్’ గా జరుపుకుంటారు. ఉగాది పండుగ సందర్భంగా
వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభా
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
మీరు తలపెట్టే కార్యాలు నిర్విఘ్నంగా పూర్తికావాలని ఆకాంక్షిస్తూ
జీవితం సకల అనుభూతులు సమ్మిశ్రమం అదే ఉగాది పండుగ సందేశం
తరుణి పాఠకులకు, రచయితలకు శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
– డా. కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు