మాటల్లో కాదు చేతల్లో చూపి అందరిమన్ననలు పొందారు.తన ఇద్దరు పిల్లలను కూడా విద్యావంతులుగా తీర్చి దిద్దారు.కొడుకు కోడలు డాక్టర్స్.కూతురు ఫార్మసీ అల్లుడు సాఫ్ట్వేర్.ఒకగృహిణిగా తల్లి గా కన్నా అధ్యాపకురాలిగా ఆమె సాధించిన విజయాలు స్ఫూర్తి దాయకాలు…
ఆమె పూర్తి పేరు చినిమిల్లి విజయలక్ష్మి.ఈమె భర్త కూడా హెచ్.ఎం.గా చేసి రిటైరైనారు.. ఇద్దరు ప్రభుత్వ బడి అధ్యాపకులు కావడంతో ఉద్యోగం బాధ్యత తో పాటు తమ స్వంత పిల్లల భవిష్యత్తు ఆలోచించారు.అబ్బాయిని 8వక్లాస్లో అమ్మాయిని 9వక్లాస్లో గుంటూరు వికాస్ హాస్టల్ లో ఉంచి చదివించారు.రెండువారాలకోసారి పిల్లల్ని చూసి వస్తూ బడిపిల్లల కి పూర్తి గా అంకితంఐనారు. విజయలక్ష్మి.2020 లో రిటైరైనారు.మనవరాలి బాధ్యత చూస్తూ కోడలికి ఆసరాగా ఉన్నారు.దాదాపు దేశంలోని ముఖ్య ప్రాంతాలు కుటుంబం తో కల్సి చూశారు.ఆధ్యాత్మికమార్గంలో గడపాలని ఆమె భవిష్యత్తు ఆలోచన.ఈమె స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం.అమ్మనాన్నలు శ్రీమతి మంగతాయారు చౌదరయ్య గార్లు.తండ్రి గ్రేడ్ వన్ హిందీ పండిట్ ప్రోత్సాహం తో చదువు ఆటపాటల్లో రాణించారు.బి.ఎస్సీ.దాకా అక్కడ చదివి ఏలూరు లో బి.ఇడి.చేశారు. ఇంజనీర్ కావాలని ఆమె ఆశ.కానీ పెద్దల మాటప్రకారం టీచర్ గా చేరి తన సత్తా చాటారు.45ఏళ్ళ తర్వాత ఎం.ఎ. తెలుగు చేయడం విశేషం.పట్టుదల ఆమె సొత్తు.తనకు చదువు చెప్పిన హెచ్.ఎం.శ్రీపిళ్లాసుబ్బారావుగారు ఆమె కి మార్గదర్శి.స్ఫూర్తిదాతకూడా.
ఆచంట మండలంలోని భీమలాపురం జిల్లా పరిషత్తు హై స్కూల్ హెచ్.ఎం.గా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అందుకున్నారు.రోజూ తెల్లవారుఝామున విద్యార్థుల ఇళ్ళకెళ్లి వారి నా లేపి పిల్లలు తల్లిదండ్రుల సహకారం ప్రశంసలు పొందారు.
10వక్లాస్ పబ్లిక్ పరీక్షల్లో నూరుశాతం పిల్లలు పాసవటంఈమె కార్యదక్షత కు నిదర్శనం.బడిలో లెక్కలటీచర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె సబ్జెక్టు లో వెనుక బడిన పిల్లలకు ఇంట్లో ప్రత్యేకంగా క్లాస్ తీసుకున్నారు.దాదాపు 20 అవార్డులు అందుకున్నారు. ఈమె తన 51వ ఏట స్కూటర్ నడపటం నేర్చుకుని పిల్లల ఇళ్లకి ఆఫీస్ పనులకి వెళ్లటం చెప్పుకోదగ్గ విషయం.
బడికి రెగ్యులర్ గా రాని పిల్లలకి ఫోన్ చేయడం లేఖ రాయడం స్వయంగా వెళ్లి కనుక్కోవడం తో పేరెంట్స్ చాలా ఆనందపడేవారు.మండల డివిజన్ జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు.2012లో టెన్త్ రిజల్ట్స్ వలన అవార్డులు భీమలాపురం గ్రామస్తులు గోల్డ్ మెడల్ మహిళా రత్న ..ఇలా ఎన్నో ఎన్నెన్నో.
ఆమె ఇలా అంటారు ” సమస్యా పరిష్కారం పై దృష్టి పెట్టాలి.డ్యూటీ ఈజ్ గాడ్.విద్యార్థులు టీచర్ ని ఎన్నడూ మర్చిపోరు.ఇది గొప్ప వరం.ఒక హెచ్.ఎం.గా ఆమె ఏంచేశారు? దీనికి ఆమె జవాబు” అన్ని క్లాసులో పిల్లల ఫోన్ నెంబర్స్ ఇంట్లో బడి లో ఉంచే దాన్ని.10 వక్లాస్ వాళ్ళు రాత్రి 9 ఉదయం5 తర్వాత చదివారా ఏంచేశారుకనుక్కునేదాన్నిపేరెంట్స్ నా అడిగే దాన్ని.ప్రేయర్ లో ఆపిల్లల్ని పిల్చి చప్పట్లు కొట్టించేదాన్ని.తెల్లారి 5 కి రోజూ ఓ ప్రాంతంలో పిల్లల ఇళ్ళకి వెళ్లే దాన్ని. డి.ఇ.ఓ.ఇచ్చిన ప్రతిజ్ఞ 6_10 వాళ్ళ చేత చెప్పించాను.ఉదయంరాత్రి చదివి మంచి జాబ్ తో సుఖంగా గడపాలి.లేకుంటే జీవితం అంతా కష్టాలు పడాలి.అందుకె రోజు రెగ్యులర్ గా చదువుకుంటాను….ఇది.ప్రతి సబ్జెక్టు టీచర్ ఎలా ఏంచేస్తున్నారు ఏంచెప్తున్నారు గమనించే దాన్ని.రోజూ మోరల్ వాల్యూస్ చదువుల్లో లాభాలు లెక్కలు సూత్రాలు చెప్పడం చెప్పించడం 9 వక్లాస్ వారు వేసవి సెలవుల్లో లెక్కలు చేయాలి అని జూన్ 12 చూపాలి అని వర్క్ ఇచ్చే దాన్ని.పేరెంట్స్ మీటింగ్ ప్రోగ్రెస్ రిపోర్ట్ స్వయంగా c d e grade వారికి ఇచ్చే దాన్ని.సెలవురోజుల్లో పదో క్లాసు వారి కి స్పెషల్ క్లాస్ లు పెట్టే దాన్ని.స్టడీ అవర్స్ కంపల్సరీ
బడి అంటే భయపడే పిల్లల్ని మాఇంట్లో ఓరెండ్రోజులు ఉంచుకుని వారి కి ఇష్టమైన వంటకాలు చేసి ఆత్మ విశ్వాసం కల్గించే దాన్ని.చేతికి బ్యాండ్ కట్టి రోజు బడికి వస్తాను.చదువుకుంటాను.అని వారికి బ్రెయిన్ వాష్ చేసేదాన్ని.
లెక్కలు తెలుగు సూత్రాలు ఇంగ్లీష్ verbs present past tenses చెప్పమనేదాన్ని.బెంచీకి ఒకలీడర్ అతనికి ఓగణితశాస్త్రవేత్త పేరు పెట్టే దాన్ని.టి.వి.చూడనీయవద్దని పేరెంట్స్ ని కట్టడి చేశాను.ఇక పేరెంట్స్ కి నా సూచనలు ఏమంటే కాసేపు మాత్రమే టి.వి.చూడనివ్వటం రోజూ బడికి పంపడం పచ్చళ్ళు మసాలా ఆహారం తగ్గించడం.ఇలా నా తోటి ఉపాధ్యాయులు కూడా అమలు పరిచేలా చూశాను.
ఇలాంటి ఆదర్శ అధ్యాపకురాలు అమ్మ ఉన్న ఇల్లు బడి నందనవనం అవుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు.
ఆమె అటవీశాఖ లో ఉద్యోగం చేస్తున్నా సాహిత్యంతో పరిచయం ఉంది.విభిన్న రంగాల్లో రాణిస్తున్న వీణావాణి