క్రోధి ఆగమనం

కవిత

క్రోధి ఆగమనం
కావాలి శోభాయ మానం!!
షడ్రుచుల ఉగాది పచ్చడి సేవనం… హరించే అరిషడ్వర్గాలను!!
పంచాంగ శ్రవణం కావాలి పాప హరణం!!
వరణుడు దయతో
కురిపించును వర్షాలు
జల కళ తో కళకళ లాడు జలాశయాలు!!
మురిపించే భూమాత
పచ్చని కోకతో
గాదెలు నిండును ధాన్యాలతో!!
మనుష్యుల మనసులలో
ఈర్ష్యా ద్వేషాలను వదలాలి
వసుధైక కుటుంబ భావన పెంపొందాలి!!
క్రోధి నామ వత్సరమున
జగాన జనులందరూ
వర్ధిల్లాలి సుఖశాంతులతో!!
క్రోధి ఆగమనం
కావాలి శోభాయ మానం!!
********

💐💐💐 క్రోధి నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు💐💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంధి అంటే??

మరో వసంతం